వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దశాబ్దాలపాటు నిస్వార్థంగా పనిచేశారు: ప్రణబ్ ముఖర్జీని కొనియాడిన ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు భూపేన్ హజారికా, నానాజీ దేశ్‌ముఖ్‌లకు భారతరత్న పురస్కారం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. వారి సేవలను ఆయన కొనియాడారు. వారి దేశానికి ఎంతో సేవ అందించారని పేర్కొన్నారు.

ప్రణబ్ ముఖర్జీ తనకాలపు విశిష్ట రాజనీతిజ్ఞుడు అని ప్రధాని మోడీ అన్నారు. ప్రణబ్ భారత రాజకీయాలపై తనదైన ముద్ర వేశారని చెప్పారు. దశాబ్దాల పాటు దేశం కోసం నిస్వార్థంగా పని చేశారని చెప్పారు. దేశ అభివృద్ధిలో ఆయన తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. ఇలాంటి ప్రణబ్‌కు భారతరత్న హర్షించదగ్గ విషయమని చెప్పారు.

భూపేన్ హజారిగా పాటలు అన్ని తరాల వారిని అలరించాయని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. న్యాయం, సామరస్యం, సోదర సందేశాన్ని అవి అందించాయని చెప్పారు. భారతదేశ సంగీతాన్ని ప్రపంచానికి తెలియజెప్పిన గొప్పవ్యక్తి అన్నారు. అలాంటి భూపేన్ హజారికాకు భారతరత్న ఇవ్వడం సంతోషించదగ్గ విషయమని చెప్పారు.

నానాజీ దేశ్‌ముఖ్ గ్రామీణాభివృద్ధికి ఎంతో కృషి చేశారని ప్రధాని మోడి కొనియాడారు. గ్రామాల సాధికారత కోసం కృషి చేశారన్నారు. ఆయన భారతరత్న పురస్కారం అన్నివిధాలా అర్హులు అని పేర్కొన్నారు. అలాగే పద్మ అవార్డు గ్రహీతలకు కూడా కంగ్రాట్స్ తెలిపారు.

కాగా, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి భారతరత్న పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశానికి అత్యున్నత సేవలందించినందుకుగాను ఈ ఏడాది ముగ్గురిని ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. నానాజీ దేశ్‌ముఖ్‌, భూపెన్‌ హజారికాలకు మరణానంతరం భారతరత్న పురస్కారాలను ప్రకటించింది.

PM Modi Hails Former President Pranab Mukherjee On Bharat Ratna Honour

రాజకీయాల్లో, ప్రభుత్వరంగంలో అనేక విధాలుగా సేవలందించిన ప్రణబ్‌కు మేధావిగా, సంక్షోభ పరిష్కర్తగా మంచి పేరుంది. 2012 నుంచి 2017 వరకు భారత రాష్ట్రపతిగా ఆయన సేవలను కొనియాడటంతో పాటు రక్షణ మంత్రిగా, ఆర్థికమంత్రిగా రాజకీయాల్లో తనదైన ముద్రను వేసిన వ్యక్తిగా ఆయన సేవలను గుర్తించి భారతరత్న పురస్కారానికి ప్రణబ్‌ను కేంద్రం ఎంపిక చేసింది.

సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులు చేపట్టిన ప్రణబ్‌ ఆర్థిక మంత్రిగా పని చేశారు. అలాగే అయిదేళ్ల పాటు పాటు రాష్ట్రపతిగా సేవలు అందించారు. ఆ పదవికి వన్నె తెచ్చారు. రాష్ట్రపతి అంటే కేవలం రబ్బరు స్టాంపు కాదని నిరూపించారు. ప్రభుత్వానికి అవసరమైన సూచనలు చేస్తూ దేశం తరఫున గళం విన్పిస్తూ తన ప్రత్యేకత చాటుకున్నారు. అలాంటి ప్రణబ్‌కు భారతరత్న ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

English summary
PM Narendra Modi Hails Former President Pranab Mukherjee On Bharat Ratna Honour, Calls Him An Outstanding Statesman Of Our Times.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X