వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలింగ్ బూతుల్లో కెమెరాలున్నాయ్.. బీజేపీకి ఓటెయ్యకపోతే అంతే.. గుజరాత్ బీజేపీ నేత కామెంట్ !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఎన్నికల వేళ నేతల కాంట్రవర్సీ కామెంట్లు కొనసాగుతోన్నాయి. ఆయా పార్టీలకు చెందిన నేతలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నాలిక్కరుచుకొని .. ఈసీ ఆగ్రహానికి గురవుతున్నారు. ఇటీవల కుల, మత రాజకీయాలను నేతలు ప్రస్తావించగా .. ఓ అడుగు ముందుకేసిన బీజేపీ ఎమ్మెల్యే పోలింగ్ బూతుల్లో సీసీ కెమెరా పెట్టామని చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోన్నాయి.

పోలింగ్ బూతుల్లో కెమెరాలా ?

పోలింగ్ బూతుల్లో కెమెరాలా ?

'ఆయా పోలింగ్ బూతుల్లో ప్రధాని మోదీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఒకవేళ మీరు కాంగ్రెస్‌కు ఓటేశారనుకో అది మాకు తెలిసిపోతోంది. ఈవీఎంపై బీజేపీ అభ్యర్థి జశ్వంత్ సింగ్ భాబోర్, బీజేపీ గుర్తు కమలం కనిపిస్తోందని చెప్పారు. ఆ రెండు చూసి నిర్ధారించుకొని, ఓటేయాలని సూచించారు. మీరు ఓటేసే సమయంలో ఎలాంటి అవంతరాలు ఎదురుకావని, అందుకోసం మోదీ ఏర్పాట్లు చేశారు‘ అని గుజరాత్‌లోని ఫతేపుర బీజేపీ ఎమ్మెల్యే రామేశ్ కథారా ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం దహోదా నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా తన నోటిదురుసుకు ప్రదర్శించారు.

ఎవరికీ ఓటేస్తున్నారో తెలుస్తోంది ?

ఎవరికీ ఓటేస్తున్నారో తెలుస్తోంది ?

ఓటేసే సమయంలో వయోజనులు ఎవరికీ ఓటేస్తున్నారో తెలుస్తోంది. ఆధార్ కార్డు, మిగతా ధ్రువీకరణ పత్రాలు కూడా ఇప్పడు ఫోటోలతో వస్తున్నాయని చెప్పారు. అదేకాదు ఒకవేళ మీరు బీజేపీకి ఓటు వేసింది, వేయనిది సులభంగా తెలిసిపోతుందని వివరించారు రమేశ్. అంతేకాదు ఓటేసిన వారికే ఉద్యోగ, ఉఫాది అవకాశాలు కల్పిస్తామని .. ఓటేయని వారికి నౌకరీ ఉండదని బహిరంగంగానే బెదిరించారు.

ఇది సరికాదు ?

ఇది సరికాదు ?

రమేశ్ వ్యాఖ్యలను విపక్షాలు తప్పుపడుతున్నాయి. ఓ బహిరంగ సభలో ఎమ్మెల్యే రమేశ్ చేసిన వ్యాఖ్యలను తేలిగ్గా తీసుకోవద్దని ఆర్జేడీ ట్వీట్ చేసింది. 'గొంతెత్తలేని, ఎలాంటి సాయం లేని పౌరులు, బీజేపీకి ఓటేసే ప్రమాదం ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు వారిపై ప్రభావం చూపుతాయి‘ అని లాలు యాదవ్ ట్వీట్ చేశారు.

English summary
Prime Minister Narendra Modi has installed cameras in polling booths and will know who voted for the Congress, a lawmaker of the ruling BJP has said in Gujarat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X