వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయనకు ఎవరూ లేరు : అందుకే కుటుంబ విలువలు తెలియవు, మోదీపై పవార్ ఫైర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : పవార్ మంచోడే, కానీ కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారనే మోదీ కామెంట్‌కు శరద్ పవార్ కౌంటర్ ఇచ్చారు. గత నెలలో ఓ ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ .. శరద్ పవార్‌నుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. 'పవార్ మంచి వ్యక్తి, కానీ అతడిని కుటుంబ సభ్యలు ఇబ్బందికి గురిచేస్తున్నాయి, అతని మేనల్లుడు చేయిదాటిపోయాడు' అని మోదీ కామెంట్ చేశారు. మోదీ వ్యాఖ్యలపై పవార్ సోషల్ మీడియా ట్వీట్టర్ వేదికగా స్పందించారు.

నాకో ఫ్యామిలీ ఉంది, మరి నీకూ ?

నాకో ఫ్యామిలీ ఉంది, మరి నీకూ ?

'నా ఇంటిలో సమస్యలు ఉంటే మోదీకి ఏం ఇబ్బంది అని ప్రశ్నించారు పవార్. సమస్యలు ఉన్నా తనకు ఓ భార్య, కూతురు, అల్లుడు, మేనల్లుడు ఉన్నారని చెప్పారు. వారు తనను కలుస్తారని గుర్తుచేశారు. కానీ మోదీకి ఎవరు లేరని, అందుకే అలా మిగతావారి వ్యక్తిగత జీవితాల గురించి కూడా కామెంట్లు చేస్తారు‘ అని పవార్ మండిపడ్డారు.

కుటుంబాన్ని నడిపే విధానం తెలుసు

కుటుంబాన్ని నడిపే విధానం తెలుసు

శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య పొడచూపిన విభేదాలను మోదీ ప్రస్తావించగా .. ఓ కుటుంబాన్ని ఎలా నడపాలో మోదీకి ఏం తెలుసు అని ప్రశ్నించారు పవార్. తన ఇంటిని చక్కదిద్దుకోలేని మోదీ .. ఇతరుల గురించి ఎందుకు అని నిలదీశారు. ఆయన లాగే నేను కామెంట్లు చేయగలను, కానీ నేను అంతస్థాయికి దిగజారి మాట్లాడదలుచుకోలేదని పవార్ స్ఫష్టంచేశారు.

పవార్‌కు బాసటగా ..

పవార్‌కు బాసటగా ..

మోదీ కామెంట్లపై పవార్ ట్వీట్ చేయగా .. మిత్రపక్షం టీఎంసీ స్పందించింది. 'అతనికి ఎవరూ లేరు, ఆయనకు కుటుంబాన్ని ఎలా నడపాలో ఎలా తెలుస్తోంది‘ అని టీఎంసీ నేత డెరెక్ ఒబ్రెయిన్ ట్వీట్ చేశారు. మోదీకి పవార్ అంకుల్ పంచ్‌లు ఇచ్చారని అందులో ప్రస్తావించారు,

English summary
"Modi Ji says 'Pawar Sahab is a good man but has family issues. His nephews are out of his hands.' I wanted to ask him what does he have to do with issues at my home? But then I realised I have my wife, daughter; son-in-law, nephews visit us, but he has no one," Mr Pawar said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X