వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వ్యాక్సిన్‌పై ప్రధాని మోదీ సమీక్ష సమావేశం... కీలక అప్‌డేట్స్ ఇవే...

|
Google Oneindia TeluguNews

భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన స్ట్రాటజీపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఉన్నతాధికారులతో శుక్రవారం(నవంబర్ 20) ఆన్‌లైన్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యాక్సినేషన్ స్ట్రాటజీతో పాటు వ్యాక్సిన్ అభివృద్దిలో ఎదురువుతున్న సమస్యలు,వ్యాక్సిన్ అనుమతులు,కొనుగోళ్లపై చర్చించినట్లు ప్రధాని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Recommended Video

COVID-19 Vaccine : భారత్‌ లో కరోనా వ్యాక్సిన్‌ కు సంబంధించిన స్ట్రాటజీపై PM Modi ఏమన్నారంటే..!

అలాగే వ్యాక్సిన్ మొదట ఎవరికి ఇవ్వాలి... హెల్త్ కేర్ వర్కర్స్‌కు వ్యాక్సిన్‌ను ఎలా చేర్చాలి... కోల్డ్ చైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వసతులను పెంచడం,వ్యాక్సిన్ కంపెనీలను టెక్ ప్లాట్‌ఫామ్స్‌తో ఎలా అనుసంధానించాలి వంటి తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు మోదీ తెలిపారు.

PM Modi Holds Review Meet on Indias Covid Vaccination Strategy

ప్రస్తుతం భారత్‌లో ఐదు వ్యాక్సిన్లు ప్రయోగాత్మక అభివృద్ది దశలో చాలా ముందున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఐదింటిలో నాలుగు ప్రస్తుతం రెండో దశ,మూడో దశ ప్రయోగాల్లో ఉండగా... ఒక వ్యాక్సిన్ మొదటి,రెండో దశ ప్రయోగాల్లో ఉన్నట్లు పేర్కొంది. వ్యాక్సిన్ అభివృద్ది,వాడకం కోసం బంగ్లాదేశ్,మయన్మార్,ఖతార్,స్విట్జర్లాండ్,బహ్రెయిన్,ఆస్ట్రియా,సౌత్ కొరియా దేశాలు భారత్‌తో టైఅప్ అయ్యేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిపింది. హెల్త్ కేర్,ఫ్రంట్ లైన్ వర్కర్స్ జనాభా,కోల్డ్ చైన్స్‌ను పెంచడం,సిరంజీలు,సూదులు తదితర మెడికల్ సామాగ్రి కొనుగోళ్లు తదితర డేటాను సిద్దం చేస్తున్నట్లు పేర్కొంది.

కాగా,గడిచిన 24గంటల్లో భారత్‌లో 45,882 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90,04,365కి చేరింది. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా మర 584 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకూ మొత్తం 1,32,162 మంది మృతి చెందారు. కరోనా బారినపడినవారిలో ఇప్పటివరకూ 84.28లక్షల మంది కోలుకున్నారు. జాతీయ రికవరీ రేటు 93.6శాతానికి చేరింది. ప్రస్తుతం 4,43,794 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి.

English summary
Prime Minister Narendra Modi on Friday held a virtual meeting with top officials including those from the centre's think-tank NITI Aayog on India's strategy for developing a COVID-19 vaccine and making it accessible to the masses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X