వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

26/11 దాడుల కంటే భారీ ఉగ్ర కుట్ర భగ్నం: ప్రధాని మోడీ ఉన్నతస్థాయి భేటీ, జవాన్లపై ప్రశంసలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 26//11 ముంబై దాడి కంటే భారీ దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు గుర్తించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అత్యవసరంగా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జమ్మూకాశ్మీర్‌‍లో నగ్రోటాలో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమైన ఉగ్రవాదులు భారీ కుట్రను అమలు చేసేందుకు వచ్చినట్లు ఇంటెలీజెన్స్ వర్గాలు వెల్లడించాయి.

భారత జవాన్లను కొనియాడిన ప్రధాని మోడీ..

ఈ క్రమంలోనే ప్రధాని మోడీ పలువురు కేంద్రమంత్రులు, ఉన్నతస్థాయి అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టడాన్ని ప్రధాని అభినందించారు. భారత సైన్యానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. పేలుడు పదార్థాలతో భారీ దాడికి ప్రణాళికలు రచించిన ఉగ్రవాదులను భారత జవాన్లు ముందస్తుగానే కనిపెట్టి.. భారీ వినాశానాన్ిన అడ్డుకున్నారని ప్రధాని ప్రశంసించారు.

నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం..

జమ్మూకాశ్మీర్‌లోని నగ్రోటా టోల్‌ప్లాజా దగ్గర గురువారం నలుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను బారత బలగాలు హతమార్చిన విషయం తెలిసిందే. ముందుగా పోలీసులను చూసి ఉగ్రవాదులను తీసుకెళ్తున్న ట్రక్కు డ్రైవర్ పారిపోయాడు. వెంటనే పోలీసులు ఆ వాహనాన్ని చుట్టుముట్టడంతో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపి నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు.

Recommended Video

TDP Slams YSRCP Decision To Spend Rs 254 Crore On YSR Statue
ముంబై దాడుల కంటే భారీ దాడులకు ఉగ్ర కుట్ర

ముంబై దాడుల కంటే భారీ దాడులకు ఉగ్ర కుట్ర

కాగా, ఉగ్రవాదుల నుంచి 11 ఏకే రైఫిళ్లు, 3 పిస్టళ్లు, 29 గ్రనేడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 26/11 ముంబై దాడి కంటే భారీ కుట్రను అమలు చేసేందుకే ఈ పాక్ ఉగ్రవాదులు భారతదేశంలోకి సరిహద్దు గుండా ప్రవేశించినట్లు ఇంటెలీజెన్స్ వర్గాలు గుర్తించాయి. జమ్మూకాశ్మీర్ సరిహద్దు నిరయంత్రణ రేఖ వెంబడి సైనికులు ఉగ్రవేత కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మోడీ నేతృత్వంలో జరిగిన ఈ ఉన్నతస్థాయి సమావేశంలో కేంద్రమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లాతోపాటు ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

English summary
Prime Minister Narendra Modi on Friday held a review meeting with top security brass in the wake of the killing of four JeM terrorists in Jammu and Kashmir, and asserted that security forces have thwarted their efforts to wreak “major havoc and destruction”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X