వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్ సీఈఓతో మోడీ భేటీ: ఎవరేమన్నారు?(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీపై సిలికాన్ వ్యాలీ టెక్నాలజీ దిగ్గజాలు ప్రశంసలు జల్లు కురిపించారు. అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో ప్రముఖ సంస్థల సీఈవోలతో ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ సహా ప్రముఖ సంస్థల సీఈవోలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సిలికాన్ వ్యాలీ టెక్నాలజీ దిగ్గజాలు ప్రధాని మోడీ దార్శనికత, ముందుచూపులను కొనియాడారు. మోడీ కలల స్వప్నమైన డిజిటల్ ఇండియా సాకారానికి తామంతా సహకరిస్తామని, అయితే, ఇండియాలో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని వారంతా కోరారు.

గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, అడోబ్ కంపెనీల ప్రతినిధులు తమ ప్రసంగాల్లో ఇదే నర్మగర్భంగా ప్రస్తావించారు. త్వరితగతిన అనుమతులు, పన్ను ప్రోత్సాహకాలు ఉంటే మరిన్ని కంపెనీలు పెట్టుబడులతో దేశానికి వస్తాయని వారు సూచించారు.

భవిష్యత్తులో భారత్‌ది కీలకపాత్ర: గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచ్చై

భవిష్యత్తులో భారత్‌ది కీలకపాత్ర: గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచ్చై

టెక్నాలజీ విభాగంలో భవిష్యత్తులో భారత్‌ది కీలకపాత్ర అని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్ అన్నారు. అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో ప్రముఖ సంస్థల సీఈవోలతో ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ సాంకేతికత దేశాభివృద్ధికి ఎంతో అవసరమని ప్రధాని మోడీ గుర్తించారన్నారు. భారత్‌లో 3వేలకు పైగా స్టార్టప్‌ ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. అన్ని భాషల్లో ఆండ్రాయిడ్‌ సేవలు అందిస్తున్నామన్నారు. స్టార్టప్‌లను ప్రోత్సహించటంలో భారత్‌ ముందుందన్నారు. త్వరంలో భారత్‌లో విద్యార్థులకు క్రోమ్‌ బుక్స్‌ అందుబాటులోకి తెస్తామన్నారు.

శ్రీకాకుళం జిల్లాలోని పాఠశాల స్కైప్‌ ద్వారా తరగతులు: సత్య నాదేళ్ల

శ్రీకాకుళం జిల్లాలోని పాఠశాల స్కైప్‌ ద్వారా తరగతులు: సత్య నాదేళ్ల

శ్రీకాకుళం జిల్లాలోని ఓ పాఠశాలలో స్కైప్‌ ద్వారా తరగతులు నిర్వహించటం నిజంగా అద్భుతమని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ప్రశంసించారు. అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో ప్రముఖ సంస్థల సీఈవోలతో ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాలకు తక్కువ ఖర్చుతో బ్రాడ్‌ బాండ్‌ సదుపాయం కల్పించాల్సిన అవసరముందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో డ్రాపవుట్స్‌ వివరాలు తెలుసుకునేందుకు టెక్నాలజీని వినియోగిస్తున్నారన్నారు. చిన్న వ్యాపారులకు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ఉపయోగపడుతుందని వివరించారు. ప్రపంచంలోని ప్రజలందరి సాధికారత దిశగా పని చేసేందుకు ఇది సమయమని సత్య నాదెళ్ల పేర్కొన్నారు.

మొబైల్ టెక్నాలజీ మన జీవితాలనే మార్చేస్తోంది: క్వాల్‌కామ్‌ సీఈవో పాల్‌ జాకబ్స్‌

మొబైల్ టెక్నాలజీ మన జీవితాలనే మార్చేస్తోంది: క్వాల్‌కామ్‌ సీఈవో పాల్‌ జాకబ్స్‌

మొబైల్‌ టెక్నాలజీ మన జీవితాలనే మార్చేస్తోందని క్వాల్‌కామ్‌ సీఈవో పాల్‌ జాకబ్స్‌ అన్నారు. అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో ప్రముఖ సంస్థల సీఈవోలతో ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పాల్‌ జాకబ్స్‌ మాట్లాడుతూ భారత్‌లో ప్రస్తుతం 121 మిలియన్ల వైర్‌లెస్‌ బ్రాండ్‌బాండ్‌ వినియోగదారులు ఉన్నారన్నారు. స్మార్ట్‌ ఫోన్ల వినియోగంలో భారత్‌ అతిపెద్ద మార్కెట్‌ అని వివరించారు.

భారత్‌లోని అపార మార్కెట్ తమ సంస్థకు అత్యంత ప్రధానం: టిమ్ కుక్

భారత్‌లోని అపార మార్కెట్ తమ సంస్థకు అత్యంత ప్రధానం: టిమ్ కుక్

అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో ప్రముఖ సంస్థల సీఈవోలతో ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఓ ఆసక్తికర విషయాన్ని మోడీకి వివరించారు. యాపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఇండియా పర్యటనల రహస్యాన్ని ఆయనకువ వివరించారు. భారత్ కు వెళ్లి వస్తే ఎంతో ప్రేరణ పొందవచ్చని, ఆ కారణంతోనే స్టీవ్ ఇండియా పర్యటనలు జరిపేవారని అన్నారు. ఇండియాతో తమకు ఎంతో అనుబంధముందని, భారత్‌లోని అపార మార్కెట్ తమ సంస్థకు అత్యంత ప్రధానమని, డిజిటల్ ఇండియాకు తమవంతు సహకారాన్ని అందిస్తామని తెలిపారు.

English summary
PM Narendra Modi on Sunday hosted a 'Digital India' dinner for top tech CEOs at San Jose, California in the US. At the dinner, some of the prominent leaders who met the Prime Minister were John Chambers (Executive Chairman of Cisco Systems), Sundar Pichai (Google CEO), Satya Nadella (Microsoft CEO) and Paul Jacobs (Executive Chairman of Qualcomm).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X