వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లదాక్‌లో మోదీ..అబద్దాలు చెప్పిందెవరు?.. చైనా పేరెత్తని ప్రధాని.. స్థానికుల మాటిది.. రాహుల్ ఫైర్

|
Google Oneindia TeluguNews

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మిక లదాక్ పర్యటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సరిహద్దులో చైనాతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నవేళ మోదీ సడెన్ గా ఫ్రంట్ లైన్ లో ప్రత్యక్షమై, గంటలపాటు అక్కడే గడిపి, సైనికుల్లో ధైర్యం నూరిపోశారు. నేరుగా చైనా పేరును ప్రస్తావించకుండా 'విస్తరణవాదులు' అంటూ డ్రాగన్ దేశంపై మండిపడ్డారు. మోదీ లదాక్ లో పర్యటిస్తున్న సమయంలోనే విపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ అనూహ్య వీడియోను తెరపైకి తెచ్చారు.

చైనా ఆక్రమణ నిజం..

చైనా ఆక్రమణ నిజం..

వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి గత రెండు నెలలుగా ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. లదాక్ రీజన్ లో కీలకమైన గాల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సు వద్ద చైనా ఆక్రమణలకు ప్రయత్నించిందని, భారత బలగాలు దాన్ని తిప్పికొట్టాయని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. అయితే, స్థానిక లదాకీలు మాత్రం ఇందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. సరిహద్దు వెంబడి చాలా ప్రాంతాలను చైనా ఆక్రమించిందని, ఈ విషయంలో జాతీయ మీడియా సహా అందరూ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారంటూ లదాకీ యువత సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వాటన్నింటినీ క్రోడీకరించిన వీడియోను కాంగ్రెస్ నేత రాహుల్ శుక్రవారం షేర్ చేశారు.

చైనాపై ప్రధాని మోదీ పంచముఖ వ్యూహం.. లదాక్ ఎందుకు వెళ్లారంటే.. ఇక డ్రాగన్ పని అయినట్లే..చైనాపై ప్రధాని మోదీ పంచముఖ వ్యూహం.. లదాక్ ఎందుకు వెళ్లారంటే.. ఇక డ్రాగన్ పని అయినట్లే..

అబద్ధాలు చెబుతున్నదెవరు?

అబద్ధాలు చెబుతున్నదెవరు?

‘‘చైనా మన భూభాగాన్ని ఆక్రమించిందని లదాక్ స్థానికులు చెబుతున్నారు. మన ప్రధాని మోదీ మాత్రం చైనా మన భూభాగాన్ని ఏవరూ తీసుకోలేదని, ఎవరి ఆక్రమణలోనూ లేదని ఘంటాపథంగా చెబుతున్నారు. దీన్ని బట్టి ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు నిజాన్ని దాస్తున్నట్లున్నారు. ఇద్దరిలో అబద్ధాలు చెబుతున్నదెవరు?'' అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. సరిహద్దు వివాదాన్ని మోదీ సరిగా డీల్ చేయడం లేదంటూ మొదటి నుంచీ విమర్శలు గుప్పిస్తోన్న రాహుల్.. గాల్వాన్ లోయలో హింసాత్మక ఘర్షణల తర్వాత ప్రశ్నల తీవ్రతను పెంచారు. గడిచిన రెండు నెలల్లోగానీ, ఇవాళ్టి లదాక్ పర్యటనలోగానీ మోదీ ‘చైనా' పేరు ఎత్తకపోవడాన్ని ఆయన తప్పుపడుతున్నారు. చైనాకు సరెండర్ అయ్యారు కాబట్టే మోదీ భయపడుతున్నారని రాహుల్ గతంలో వ్యాఖ్యానించారు.

ప్రపంచమంతటా ఇదే హాట్ టాపిక్..

ప్రపంచమంతటా ఇదే హాట్ టాపిక్..


లదాక్ లో మోదీ ఆకస్మిక పర్యటన ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. దాదాపు అన్ని దేశాలూ మోదీ పర్యటన తాలూకు వార్తలు, విశ్లేషణలు రాసుకొచ్చాయి. యాంటీ చైనా వేవ్ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న క్రమంలో సరిహద్దులో డ్రాగన్ దురాగతాలపై భారత్ స్పందిస్తున్న తీరును అంతర్జాతీయ సమాజం నిశితంగా గమనిస్తున్నది. హాకాంగ్ అంశంపై అమెరికా, బ్రిటన్ లు ఇప్పటికే చైనాను తీవ్రంగా హెచ్చరించాయి. టెర్రరిస్టులకు చైనా ఆయుధాలు, నిధులు సమకూర్చుతోందంటూ మయన్మార్ ఆధారాలను బటయటపెట్టింది. కరోనా.. చైనీస్ ప్లేగ్ అని, డ్రాగన్ దేశం వల్లే ఇవాళ ప్రపంచం ఇబ్బందుల్లో పడిందని, దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. చైనాతో సరిహద్దు వివాదంలో తాము భారత్ వైపే ఉంటామని అమెరికా సహా పలు దేశాలు ఇప్పటికే స్పష్టం చేశాయి.

Recommended Video

PM Modi In Leh : China పై ప్రధాని Modi పంచముఖ వ్యూహం.. Ladakh ఎందుకు వెళ్లారంటే..! | Oneindia Telugu
స్ట్రాంగ్ వార్నింగ్..

స్ట్రాంగ్ వార్నింగ్..


లదాక్ పర్యటనలో భాగంగా ఫ్రంట్ లైన్ సైనికులతో మాట్లాడిన ప్రధాని మోదీ.. వారి సేవలను, అకింతభావాన్ని, ధైర్యసాహసాలను కొనియాడారు. ‘‘విస్తరణ వాద శకం ముగిసింది. ఇది అభివృద్ధి శకం. విస్తరణవాదులు మట్టికరిచినట్లు చరిత్ర చెబుతోంది..''అని చైనా పేరెత్తకుండా డ్రాగన్ దేశానికి ఆయన వార్నింగ్ ఇచ్చారు. లదాక్ ను విడగొట్టేందుకు జరుగుతోన్న ప్రయత్నాలను స్థానికులే తిప్పికొట్టారని, దేశానికి లదాక్ శిరస్సు లాంటిదని మోదీ అన్నారు.

English summary
On the day Prime Minister Narendra Modi made an unannounced trip to a forward post in Ladakh, congress leader rahul Gandhi also shared the voices of some Ladakhis in a video alleging that the Chinese have occupied Indian territory in Ladakh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X