• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తమిళనాడులో మోడీ "షో" : మహాబలిపురంలో బాహుబలి వేసిన కొత్త స్కెచ్ ఏంటి ?

|

భారత పర్యటన కోసం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తమిళనాడుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక అనధికారిక సమావేశం పేరుతో మోడీ జిన్‌పింగ్‌ల సమావేశం జరిగింది. ఇందుకు వేదికగా నిలిచింది మహాబలిపురం. అయితే మహాబలిపురంనే వేదికగా ఎంచుకోవడం వెనక చైనాకు మహాబలిపురంకు మధ్య కనెక్షన్ ఉందని బయటకు చెబుతున్నప్పటికీ కాస్త లోతుగా విశ్లేషిస్తే దీని వెనక మోడీ రాజకీయం కూడా ఉందనే విషయం స్పష్టం అవుతోంది. ఇంతకీ మోడీ వ్యూహం ఏమిటి..? ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

అమెరికాలో మోడీకి జేజేలు

అమెరికాలో మోడీకి జేజేలు

ప్రధాని నరేంద్ర మోడీ... రాజకీయ అపర చాణక్యుడు. పాచిక వేశారంటే అది పారాల్సిందే. పక్కాగా వ్యూహాలు అమలు చేయడంలో దిట్ట. సరైన సమయంలో పావులు కదిపి రాజకీయంగా తన మార్క్‌ను కచ్చితంగా నిలుపుకునే వ్యక్తిత్వం మోడీది. ఒకప్పుడు అగ్రరాజ్యం అమెరికా ఆయనకు వీసా నిరాకరిస్తే.. ఆ దేశమే ఎర్రతివాచీ పరిచి మరీ స్వాగతం పలికేలా చేస్తానని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చెప్పిన మోడీ దాన్ని నేరవేర్చి చూపించారు. ఇప్పుడు మోడీకి అమెరికాలో నివసిస్తున్న భారతీయులతో పాటు అమెరికన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఒక అగ్రదేశం అమెరికాను ఆకట్టుకున్న మోడీ ఇప్పుడు మరో అగ్రదేశం చైనాపై కన్నేసినట్లుగా తెలుస్తోంది. ఆదేశంతో స్నేహహస్తం అందిస్తూనే ఇక్కడ పాకిస్తాన్‌కు చెక్ పెట్టాలనే యోచనలో మోడీ అతి జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు.

తమిళ వస్త్రధారణలో మోడీ

తమిళ వస్త్రధారణలో మోడీ

అమెరికా పర్యటన సందర్భంగా మోడీ తమిళంతో పాటు పలు భాషల్లో మాట్లాడి ఆకట్టుకున్నారు. అదే సమయంలో ఆబ్‌ కీ బార్ ట్రంప్ సర్కార్ అనే నినాదం చేసి అగ్రదేశపు అధ్యక్షుడు ట్రంప్‌ను సైతం ఆకట్టుకున్నారు. దీంతో భారత్ అమెరికాకు నిజమైన మిత్రదేశం అని ట్రంప్ చెప్పారు. ఇది ఇలా ఉంటే... ఇక చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను మహాబలిపురంలో సమావేశమయ్యారు. ఇక్కడే మోడీ తన రాజకీయం షురూ చేసినట్లుగా కనిపిస్తోంది. తమిళ వస్త్రధారణ ధరించి ఆయన జిన్‌పింగ్‌తో కలియతిరగడం పలువురిని ఆకట్టుకుంది. అక్కడ తమిళ ప్రజలు కూడా మోడీని ఆ గెటప్‌లో చూసి ఎంతో సంబరపడ్డారు. ఒక్క డీఎంకే తప్ప మిగతా అన్ని తమిళ పార్టీలు మోడీ వస్త్రధారణపై హర్షం వ్యక్తం చేశాయి.

 తమిళనాడును ప్రపంచానికి పరిచయం

తమిళనాడును ప్రపంచానికి పరిచయం

ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను మహాబలిపురంకు తీసుకొచ్చి ఆ ప్రాంతం, లేదా తమిళనాడు రాష్ట్రం ఏమిటో ప్రపంచానికి తెలిసేలా చేశారు. ప్రపంచం మొత్తం వీరిద్దరి కలయికను చాలా ఆసక్తితో తిలకించింది. అంతేకాదు వచ్చిన అతిథి జిన్‌పింగ్‌కు తమిళ రుచులను తినిపించారు. రాత్రి భోజనంలో తక్కళి రసం, అరచవిట్ట సాంబార్,కడాయ్ కుర్మా,కవనరసి హల్వా వంటి తమిళ వంటకాలను వడ్డించారు. ఇక తమిళనాడుకు ఒక ప్రపంచంలోని అగ్రదేశ నాయకుడు ఒకరు ఇంతకుముందెప్పుడూ రాలేదు. అలా ఒక నాయకుడిని తీసుకొచ్చి ఆయనకు తమిళ వంటలు రుచి చూపించి మొత్తానికి తమిళ ప్లేవర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లారు మోడీ.

 రాజకీయ ప్రయోజనం లేకుండా అడుగు ముందుకు వేయని మోడీ

రాజకీయ ప్రయోజనం లేకుండా అడుగు ముందుకు వేయని మోడీ

రాజకీయ ప్రయోజనం లేకుండా అడుగు కూడా ముందుకు వేయని మోడీ ఇప్పుడు ఈ అడుగులు వెనుక కారణం అందరినీ ఆలోచింపజేస్తోంది. ప్రధాని మోడీ ఇలాంటి అద్భుతమైన ఘట్టంను తమిళనాడులో ఆవిష్కరించడంతో అక్కడ బీజేపీ బలపడేందుకు దోహదపడుతుందా అనేది ఆసక్తిగా మారింది. తమిళ ప్రజలు జాతీయ పార్టీ వైపు మొగ్గు చూపుతారా అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ప్రతీకార రాజకీయాలు..నాస్తికత్వం..మూస కట్టుబాట్లతో కొట్టుమిట్టాడే తమిళుల్లో కొత్త తరాన్ని ఆకట్టుకోవటానికే మోడీ వ్యూహాత్మకంగా పావులు కదిపి ఉంటారనేది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి దక్షిణ భారత దేశంపై కన్నేసిన ప్రధాని మోడీ ఈ అవకాశాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకున్నారనే మాట వినిపిస్తోంది. ప్రధాని మోడీకి ఇది కచ్చితంగా కలిసొచ్చే అంశమే అవుతుందని పలువురు పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు. ఇక దక్షణాదిన తనదైన శైలిలో ప్రధాని మోడీ రాజకీయం ప్రారంభించారనేది స్పష్టమవుతోంది.

English summary
By getting one of the world's powerful leader the Chinese President Jinping to Tamilnadu, analysts are putting their opinion that Prime Minister Modi had made a move in conquering the south.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X