• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బీజేపీలోకి మెగాస్టార్ మిథున్ చక్రవర్తి -ప్రధాని మోదీ తొలి సభలోనే సంచలనం -బెంగాల్ సీఎం అభ్యర్థి?

|

తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నువ్వా-నేనా అన్నట్లుగా తలపడుతోన్న వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బాలీవుడ్, బెంగాల్ సినీ రంగాల్లో మెగాస్టార్ గా వెలుగొందుతోన్న ప్రముఖ నటుడు, టీఎంసీ కీలక నేత, డిస్కో కింగ్ మిథున్ చక్రవర్తి ఆదివారం కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.

వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్న తొలి సభ వేదికపైనే మిథున్ దాదా బీజేపీలో చేరారు. బీజేపీ బెంగాల్ వ్యవహారాల ఇన్‌చార్జి కైలాస్ విజయ వర్గీయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని మోదీ స్వయంగా కండువా కప్పి, పార్టీలోకి ఆయన్ను ఆహ్వానిస్తారని భావించినా, మోదీ రాకముందే మిథున్ పార్టీలో చేరిపోవడం గమనార్హం.

viral video: బాలుణ్ని మింగిన భారీ మొసలి -దాన్ని బంధించి, పొట్ట చీల్చి చూడగా...

pm modi in west bengal: Actor Mithun Chakraborty Joins BJP in a massive Rally In Kolkata

2014లో తృణమూల్ కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ఎన్నికైన మిథున్ చక్రవర్తి.. శారద చిట్ ఫండ్ కుంభకోణం తర్వాత పదవికి రాజీనామా చేశారు. నాలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన శారద సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ అయిన మిథున్.. తర్వాతి కాలంలో ఆ సంస్థకు ప్రకటనలు చేసినందుకు లభించిన రూ.1కోటిపైగా మొత్తాన్ని ఈడీకి చెల్లించేశారు. గతంలో నక్సలైట్లతోనూ తనకు సంబంధాలున్నాయని ప్రకటించిన మిథున్.. ఇవాళ రైట్ వింగ్ పార్టీలో చేరుతుండటం విశేషం. కాగా..

viral video: జగన్ సీటుకు ఎసరు -సాయిరెడ్డి పెద్ద బేకార్ -ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలనం

pm modi in west bengal: Actor Mithun Chakraborty Joins BJP in a massive Rally In Kolkata

కోల్‌కతాలోని ప్రఖ్యాత బ్రిగేడ్ మైదానం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఆ సభా వేదికపైనే మిథున్ చక్రవర్తి బీజేపీలో చేరారు. మోదీ సభకు ఇసుకేస్తే రాలనంతగా జనం హాజరయ్యారు. ఇదే మైదానంలో వారం రోజుల కిందట కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీలు నిర్వహించిన తొలి సభకు కూడా ఇదే రీతిలో జనం హాజరయ్యారు. కాగా, 70 ఏళ్ల మిథున్ చక్రవర్తిని బెంగాల్ సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది..

English summary
Popular Bengali and Bollywood actor Mithun Chakraborty today joined the BJP, a little ahead of Prime Minister Narendra Modi's rally at the city's Brigade Parade Ground. The move comes weeks ahead of the state Assembly polls scheduled for March-April. The party's state in-charge Kailash Vijayavargiya had met up with the star yesterday at his residence in the state capital's Belgachia locality, sparking much speculation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X