వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో మెట్రో రైలును ప్రారంభించిన మోడీ, కేజ్రీవాల్‌కు అందని ఆహ్వనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని మెజెంటా మెట్రో లైనులో మెట్రో రైలును ప్రారంభించారు. నోయిడాలోని బొటానికల్ గార్డెన్ నుంచి కల్కాజీ మందిర్ వరకు ఈ మెట్రో రైలు నడవనుంది. అయితే ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మాత్రం ఆహ్వనం అందలేదు.

ఈ మెట్రో రైలును ప్రారంభించిన తర్వాత మెట్రో రైలులో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగితో పాటు పలువురు ప్రముఖులు మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ మెట్రో రైలు మార్గంతో నోయిడా, దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణించే సమయం సగానికి సగం తగ్గిపోతోంది.12.64 కి.మీ మేర ఈ రైలు మార్గం ఉంది.2017లో ప్రధానమంత్రి మోడీ ప్రారంభించిన ఈ మూడో మెట్రో లైన్‌గా రికార్డుల్లోకెక్కింది.

ఈ ఏడాది జూన్ మాసంలో కొచ్చి మెట్రో లైన్‌ను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఆ తర్వాత హైద్రాబాద్ మెట్రో లైన్‌ను ఈ ఏడాది నవంబర్ మాసంలో ప్రారంభించారు. తాజాగా ఇవాళ ఢిల్లీ మెట్రో రైలును ప్రారంభించారు మోడీ.

ఈ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఆహ్వానం అందలేదు.అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి తమకు అధికారికంగా ఆహ్వనం అందలేదని కేజ్రీవాల్ కార్యాలయవర్గాలు తెలిపాయి.

అయితే మెట్రో రైలులో ప్రయాణం సురక్షితంగా ఉండడంతో పాటు ప్రజలకు అందుబాటు ధరలో ఛార్జీలు ఉండాలనేది తమ విధానం కేజ్రీవాల్ ఆఫీసు వర్గాలు చెబుతున్నాయి.

2018 మార్చి నాటికి ఈ రైల్వే లేన్‌ను జనక్‌పురి వరకు పొడిగించనున్నారు.ఢిల్లీ మెట్రో రైలు ఆటోమెటిక్ ఫ్లాట్‌ఫామ్ సౌకర్యాన్ని కలిగి ఉంది. స్క్రీన్ డోర్లు ప్రతి స్టేషన్లో ఉంటాయని అధికారులు తెలిపారు.స్టేషన్ వద్దకు రైలు చేరుకొన్నప్పుడు మాత్రమే రైలు డోర్లు తెరుచుకోనున్నాయని అధికారులు తెలిపారు.డ్రైవర్ లేకుండానే ఈ రైలు నడుస్తోంది. అయితే తొలి రెండేళ్ళపాటు మాత్రం డ్రైవర్ సహయంతోనే ఈ రైళ్ళను నడపనున్నారు.

English summary
Prime Minister Narendra Modi on Monday inaugurated new Magenta Line of the Delhi Metro. Magenta Line the 12.64-km stretch is a part of the upcoming Botanical Garden (Noida)-Janakpuri West (Delhi) corridor has nine stations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X