వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా విలయం: మోదీ సంచలనం.. సుదీర్ఘ లాక్‌డౌన్‌కు సంకేతాలు.. సీఎంల డిమాండ్లకు తలొగ్గిన కేంద్రం

|
Google Oneindia TeluguNews

ఒకటీ రెండు కాదు.. ఏకంగా ఆరుగంటలకుపైగా సాగిన కీలక భేటీలో ఎన్నెన్నో మలుపులు.. తొలుత కేంద్రం ఆలోచన.. ఆపై రాష్ట్రాల వాదన.. ఒక దశలో హీటెక్కించిన విమర్శలు, ప్రత్యారోపణలు.. చివరికి మోస్ట్ ప్రాబబుల్ పరిష్కార మార్గంపై మోదీ తుదిపలుకులు.. ఇదీ.. ప్రధానమంత్రి సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ఔట్ లైన్. సీఎంల వాదనను సావధానంగా విన్న ప్రధాని.. కరోనా కేసుల తీవ్రను కూడా పరిగణలోకి తీసుకుని చివరికి సంచలన సంకేతాలిచ్చారు...

కరోనా: కేంద్ర-రాష్ట్రాల డిష్యుం డిష్యుం.. లాక్‌డౌన్‌పై నిర్ణయాధికారం కావాలన్న సీఎంలు..మోదీపై ఫైర్కరోనా: కేంద్ర-రాష్ట్రాల డిష్యుం డిష్యుం.. లాక్‌డౌన్‌పై నిర్ణయాధికారం కావాలన్న సీఎంలు..మోదీపై ఫైర్

దిగజారిన పరిస్థితి..

దిగజారిన పరిస్థితి..

కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు కేంద్రం విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ సోమవారం నాటికి 48వ రోజుకు చేరింది. ఈ గడువులో వైరస్ వ్యాప్తి తగ్గకపోగా, రోజురోజుకూ విస్తరిస్తూ సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో కొత్తగా 4,213 మందికి సోకింది. ఈ దెబ్బతో మొత్తం కేసుల సంఖ్య 70వేలకు దగ్గరగా వచ్చింది. వైరస్ వ్యాప్తి ఇంకా పీక్ దశకు చేరలేదన్న నిపుణుల వాదన ప్రకారం జూన్ రెండో వారం దాకా కరోనా ప్రభావం కొనసాగే అవకాశముంది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలకుండా జోన్ల వారీగా మినహాయింపులు ప్రకటించిన కేంద్రం.. మే 17 తర్వాత ఏం చేయాలనేదానిపై ప్రధాని.. సీఎంలతో సంప్రదింపులు జరిపారు..

సీఎంల డిమాండ్‌తో మారిన స్వరం

సీఎంల డిమాండ్‌తో మారిన స్వరం


సీఎంలతో కాన్ఫరెన్స్ లో ప్రధాని మోదీ తొలుత లాక్ డౌన్ ఎగ్జిట్ వైపే మొగ్గుచూపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆర్థిక కలాపాలు పున:ప్రారంభం కావాల్సిందేనని, అందు కోసం భారీగా సడలింపులు కూడా ప్రకటిస్తామని, జోన్ల నిర్ధారణ ఇకపై సులభతరం చేస్తామని చెప్పారు. కేంద్రం తన వంతు ఇనిషియేటివ్ గా రైళ్ల రాకపోకలు ప్రారంభించిందని గుర్తుచేశారు. లాక్ డౌన్ ను ఎకేసారి ఎత్తేయకున్నా.. దశలవారీగా భారీ ఎత్తున సడలింపులు కల్పిస్తూ ముందుకు వెళదామనే అర్థంలో మాట్లాడారు. కానీ మెజార్టీ సీఎంలు ఈ వాదనతో విభేధించడంతో మోదీ స్వరం మార్చుకోక తప్పలేదు..

సుదీర్ఘ లాక్‌డౌన్..

సుదీర్ఘ లాక్‌డౌన్..


ఆరు గంటల సుదీర్ఘ సమావేశంలో చివరికి కేంద్రం.. రాష్ట్రాల వాదనకు తలొగ్గినట్లు తెలిసింది. మెజార్టీ సీఎంలు కోరినదానికంటే ఎక్కువగా సుదీర్ఘకాలం దేశంలో లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు ప్రధాని మోదీ సంకేతాలిచ్చారు. ‘‘మే 17 తర్వాత కూడా మనం లాక్ డౌన్ ను కొనసాగించాల్సిందే..''అని స్పష్టం చేశారు. అదే సమయంలో నాన్ కంటైన్ మెంట్ జోన్లలో, అంటే గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిస్థాయిలో పున:ప్రారంభం అయ్యేలా చర్యల తీసుకుంటామని, తద్వారా ఆర్థిక వ్యవస్థను కాపాడుకోగలమని ప్రధాని భరోసా ఇచ్చారు.

15లోగా లిస్ట్ ఇవ్వండి..

15లోగా లిస్ట్ ఇవ్వండి..

అనేక ములుపులు తిరుగుతూ ఆరు గంటలపాటు సాగిన సీఎంల భేటీలో అందరి వాదనలు విన్న ప్రధాని మోదీ.. ముగింపు ఉపన్యాసంలో కీలక అంశాలను ప్రస్తావించారు. మే 17తో లాక్ డౌన్ ముగిసిపోదంటూనే.. ఆయా రాష్ట్రాల్లో ప్రారంభిచతలపెట్టిన పనులు, ఎకనామిక్ యాక్టివిటీల వివరాల జాబితాను మే 15 లోగా కేంద్రానికి పంపాలని ముఖ్యమంత్రుల్ని కోరారు. మరికొంత కాలం కరోనాతో జీవించక తప్పదని, ఆమేరకు అందరం ప్రపేర్ కావాలని ఆయన కోరారు. కరోనాకు ముందు, ఆ తర్వాత అన్నట్లుగా మన దేశంలో కల్చర్ కూడా మారిపోవాలని అభిలాషించారు.

Recommended Video

Vande Bharat Mission : 118 Indian citizens from San Francisco arrive in Hyderabad
సీఎంల వాదనకే మొగ్గు..

సీఎంల వాదనకే మొగ్గు..


దేశవ్యాప్త లాక్ డౌన్ ఎత్తేసే దిశగా మరిన్ని సడలింపులకు కేంద్రం రెడీ అయినా, మెజార్టీ రాష్ట్రాలు లాక్ డౌన్ పొడగింపునకే మొగ్గు చూపడంతో మోదీ కూడా నిర్ణయాన్ని మార్చుకోక తప్పలేదు. మహారాష్ట్ర, బీహార్, పంజాబ్, ఒడిశా, కేరళ, ఛత్తీస్ గఢ్, తెలంగాణ ముఖ్యమంత్రులు పొడగింపువైపే మొగ్గుచూపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు మాత్రం.. కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. మిగతా రాష్ట్రాలు కూడా తమకే నిర్ణయాధికారం కావాలని వాదించాయి. ఈనెల 13న (బుధవారం) జరగనున్న కేంద్ర కేబినెట్ భేటీలో లాక్ డౌన్ పొడగింపునకు సంబంధించి నిర్ణయం తీసకుని, అదే రోజు ప్రకటించే అవకాశముంది.

English summary
Prime Minister Narendra Modi on Monday said the nationwide lockdown to control coronavirus will have to continue beyond May 17, He asks the states to give suggestion on what economic activities should be allowed and how to go about it
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X