"అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు": భారత్ స్థానం మారింది - ప్రధాని మోడీ

ప్రపంచ దేశాల దృష్టిలో భారత్ స్థానం గత కొన్నేళ్లుగా గణనీయంగా మారిందని ప్రధాని మోడీ కొనియాడారు. ఈ మేరకు దేశ రాజధాని New Delhiలో నిర్వహించిన What India Thinks Today సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నేడు భారత్ టెక్నాలజీ వినియోగదారుడి స్థాయి నుంచి ఉత్పత్తిదారుగా (Producer) ఎదిగిందని స్పష్టం చేశారు. అంతే కాకుండా దేశ ఆర్థిక ప్రగతి, అంతర్జాతీయ సంబంధాలు, సాంకేతిక రంగాల్లో భారత స్థానం గురించి విశదీకరించారు.

కాగా గత కొన్ని సంవత్సరాల్లో ప్రపంచ దేశాల దృష్టిలో భారత్ స్థానం గణనీయంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఒకప్పుడు టెక్నాలజీ వినియోగదారుడిగా ఉన్న భారత్, ఇప్పుడు ఉత్పత్తిదారుగా, ఇన్నోవేషన్ కేంద్రంగా ఎదుగుతోందన్నారు. రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం, సంస్కృతి వంటి అన్ని రంగాల్లో భారత్ ప్రభావం విస్తరిస్తోందని ఆయన స్పష్టం చేశారు. భారత్ టెక్నాలజీ స్వీకరణలో అగ్రగామిగా నిలుస్తోందని ప్రధాని పేర్కొన్నారు. డిజిటల్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు చేరడం, ఆన్‌లైన్ లావాదేవీలు పెరగడం, స్టార్టప్‌ల వృద్ధి జరుగుతున్నాయని వివరించారు. ముఖ్యంగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు.

pm-modi-interesting-comments-about-indian-development-at-what-india-thinks-today-meet-in-new-delhi

అంతర్జాతీయ సంబంధాల్లో భారత్ బలం..

అంతే కాకుండా "వసుధైవ కుటుంబకం" అనే భారతీయ భావజాలంతో ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు. మొత్తంగా ప్రపంచ రాజకీయాల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని ఈ సదస్సు స్పష్టం చేసింది. మరోవైపు ఈ కార్యక్రమంలో పాల్గొన్న Jupally Ramarao మాట్లాడుతూ.. ప్రపంచం "పాలీ క్రైసిస్" వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ మాత్రం సుమారు 7% వృద్ధిరేటుతో ముందుకు సాగుతోందన్నారు. త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

విదేశీ పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధి ఈ వృద్ధికి ప్రధాన కారణాలన్నారు. భారత్‌కు ఉన్న అతిపెద్ద బలం యువ జనాభా అని జూపల్లి రామారావు తెలిపారు. ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ (STEM) రంగాల్లో ప్రతిభ ఉన్న యువత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. దీంతో భారత్ గ్లోబల్ టాలెంట్ హబ్‌గా ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+