వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లంచం కేసులో సీబీఐ అధికారుల వార్: రంగంలోకి ప్రధాని నరేంద్ర మోడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సీబీఐ ఇష్యూ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకున్నారు. రూ.కోట్ల లంచానికి సంబంధించి సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాల మధ్య వివాదం ప్రకంపనలు సృష్టిస్తోంది. రాకేష్ ఆస్థానా ప్రధాని మోడీకి సన్నిహితుడిగా భావిస్తారు.

<strong>సీబీఐలో లంచం...దేశంలోనే సంచలనం:తమ అధికారి రాకేశ్‌ అస్థానాపైనే సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు</strong>సీబీఐలో లంచం...దేశంలోనే సంచలనం:తమ అధికారి రాకేశ్‌ అస్థానాపైనే సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు

దీంతో రాజకీయ రంగు పులుముకుంది. దీంతో స్వయంగా ప్రధాని మోడీ రంగంలోకి దిగారు. నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఇద్దరు కలిసి తన వద్దకు రావాలని ఆయన సమన్లు జారీ చేశారు. తనను కలిసి వివరణ ఇవ్వాలని చెప్పారు.

PM Modi Intervenes In Big CBI War, Summons Top Two Officers

కాగా, మాంసం ఎగుమతి వ్యాపారం చేసే మొయిన్ ఖురేషీపై మనీలాండరింగ్ కేసు మాఫీ కోసం రాకేష్ ఆస్థానా రూ.కోట్ల లంచం తీసుకున్నారంటూ సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇదే కేసు విషయంలో అలోక్ వర్మ లంచం తీసుకున్నారంటూ కేంద్ర కేబినెట్ కార్యదర్శికి ఆస్థానా రెండు నెలల క్రితం లేఖ రాశారు. ఇప్పుడు ఎదురు తిరిగి ఆస్థానా పైనే సీబీఐ కేసు నమోదయింది.

మరోవైపు, రాకేష్ ఆస్థానాతో కలిసి పని చేసిన అధికారి దేవేంద్ర కుమార్‌ను కూడా సీబీఐ సోమవారం అరెస్టు చేసింది. చీఫ్ పైన అవాస్తవ ఆరోపణలు చేసినందుకు అదుపులోకి తీసుకున్నారు.

English summary
Intervening in a massive fight within the country's main investigating agency CBI, Prime Minister Narendra Modi today summoned the agency's top two officers, Director Alok Verma and Special Director Rakesh Asthana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X