వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వ్యాక్సిన్ కనిపెట్టింది మోదీనే -దేశీ ఉపాయాలతో టీకా -విదేశాలకూ పంపిణీ: బీజేపీ సీఎం బాంబు

|
Google Oneindia TeluguNews

సంచలన స్టేట్మెంట్లకు కేరాఫ్‌గా నిలిచే బీజేపీ నయా నేతల జాబితాలో త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్‌ ప్రధమ స్థానంలో నిలుస్తారన్నది సోషల్ మీడియా టాక్. ఇంకేం లేదనుకున్న ప్రతిసారి అనూహ్య వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బిప్లబ్ తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావిస్తూ మరో బాంబు పేల్చారు. నేపాల్, శ్రీలంకలో బీజేపీ సర్కారు ఏర్పాటుచేసేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్కెచ్ వేశారంటూ కలకలం రేపిన త్రిపుర సీఎం.. ఆ వ్యాఖ్యల వేడి చల్లాకముందే మోదీకి లేనిపోని కీర్తిని అంటగట్టేశారిలా...

వైఎస్ షర్మిలతో జగన్ మాజీ సలహాదారు -కేసీఆర్ ఆంధ్రోడేనంటూ రంగారెడ్డి సంచలనం -లోటస్‌పాండ్ నుంచి ఫోన్లువైఎస్ షర్మిలతో జగన్ మాజీ సలహాదారు -కేసీఆర్ ఆంధ్రోడేనంటూ రంగారెడ్డి సంచలనం -లోటస్‌పాండ్ నుంచి ఫోన్లు

 వ్యాక్సిన్ సృష్టికర్త మోదీ

వ్యాక్సిన్ సృష్టికర్త మోదీ

త్రిపుర సివిల్ సర్వీసెస్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్ కరోనా టీకాపై అనూహ్య వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ సృష్టికర్త ప్రధాని మోదీనే అని క్లెయిమ్ చేశారు. ''పూర్తిగా భారతీయ విధానాలు, ఉపాయాల ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వైరస్ కు విరుగుడు వ్యాక్సిన్ కనిపెట్టారు'' అని సీఎం సెలవిచ్చారు. అంతేనా..

భారతీయులకు భరోసా..

భారతీయులకు భరోసా..

కరోనా వైరస్ మహమ్మారి వల్ల ప్రజలు అనేక ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నారని, సామాజిక దూరాన్ని పాటించడం అందులో ముఖ్యమైన అంశమని త్రిపుర సీఎం అన్నారు. కొవిడ్ విలయకాలంలో భారత్ స్వావలంబనను సాధించగలిగిందన్న బిప్లబ్.. ప్రధాని మోదీ కరోనా టీకాను కనిపెట్టడంతో భారతీయుల భయాందోళనలు దూరమైపోయాయని చెప్పారు. ఇంకా..

బిప్లబ్‌కు బీజేపీ సమర్థన

బిప్లబ్‌కు బీజేపీ సమర్థన

భారతీయ విధానాలతో ప్రధాని నరేంద్ర మోదీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ను కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నదని, అదే టీకాను భారత్ మరో 25 దేశాలకు కూడా సరఫరా చేస్తున్నదని త్రిపుర సీఎం తెలిపారు. బిప్లవ్ తాజా కామెంట్లపై బీజేపీ స్పందించాల్సి ఉంది. కాగా, నేపాల్, శ్రీలంకలో బీజేపీ విస్తరణ, ప్రభుత్వ ఏర్పాటు దిశగా అమిత్ షా ప్రణాళికలు రూపొందిస్తున్నారంటూ ఇదే సీఎం బిప్లవ్ చేసిన కామెంట్లను బీజేపీ అధికారికంగా సమర్థించింది.

బీజేపీ సంచలనం: నేపాల్, శ్రీలంకలో ప్రభుత్వ ఏర్పాటుకు అమిత్ షా భారీ ప్లాన్ -త్రిపుర సీఎంకు పార్టీ సమర్థనబీజేపీ సంచలనం: నేపాల్, శ్రీలంకలో ప్రభుత్వ ఏర్పాటుకు అమిత్ షా భారీ ప్లాన్ -త్రిపుర సీఎంకు పార్టీ సమర్థన

English summary
In yet another controversial statement, Tripura chief minister Biplab Kumar Deb has claimed that Indian Prime Minister Narendra Modi invented the Covid-19 vaccine. “PM Narendra Modi has invented vaccine through the local method in India,” Biplab Kumar Deb said while addressing a programme at the Kamini Kumar Singha Memorial School in Agartala on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X