వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

70 ఏళ్లుగా ఇజ్రాయెల్ వెయిటింగ్, మోడీ అడుగు: చైనా దూకుడు ఎఫెక్ట్..

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్‌ చేరుకున్నారు. బెన్‌ గురియన్‌ విమానాశ్రయంలో ఆయన రాక సందర్భంగా ప్రత్యేక ఆహ్వాన ఏర్పాట్లు చేశారు. రెడ్ కార్పెట్ పరిచి మోడీకి సాదర స్వాగతం పలికారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్‌ చేరుకున్నారు. బెన్‌ గురియన్‌ విమానాశ్రయంలో ఆయన రాక సందర్భంగా ప్రత్యేక ఆహ్వాన ఏర్పాట్లు చేశారు. రెడ్ కార్పెట్ పరిచి మోడీకి సాదర స్వాగతం పలికారు.

ఆ దేశ అధ్యక్షుడు బెంజమిన్‌ నేతన్యాహు ప్రధాని మోడీకి సాదర స్వాగతం పలికారు. 70 ఏళ్లుగా వేచి చూస్తున్నామని నేతన్యాహు అన్నారు. భారత్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఇజ్రాయెల్ సందర్శించిన తొలి ప్రధాని మోడీయే.

భారత్‌తో యుద్ధం రావొచ్చు, కానీ: చైనా నిపుణులు, రష్యా వార్నింగ్ భారత్‌తో యుద్ధం రావొచ్చు, కానీ: చైనా నిపుణులు, రష్యా వార్నింగ్

క్రైస్తవ మత ప్రధాన గురువు పోప్‌, అమెరికా దేశాధ్యక్షుడికి మాత్రమే దక్కే ప్రత్యేకమైన స్వాగతం ఇజ్రాయెల్‌లో అందుకున్న తదుపరి వ్యక్తి మోడీ కావడం విశేషం.

ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఏర్పాటు చేసే ప్రత్యేక ఆహ్వాన కార్యక్రమంలో ఇరు దేశాధ్యక్షులూ మీడియాతో మాట్లాడుతారు. మోడీ రాక సందర్భంగా నేతన్యాహు ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఇజ్రాయెల్ నుంచి ఆయుధాలు.. చైనా దూకుడు

ఇజ్రాయెల్ నుంచి ఆయుధాలు.. చైనా దూకుడు

ఇజ్రాయెల్ అంటేనే ఆధునిక టెక్నాలజీకి మరో పేరు. ముఖ్యంగా ఆయుధాలను తయారు చేయడంలో ఆ దేశానిది ఓ చరిత్ర. రష్యా తర్వాత మన దేశం ఎక్కువ ఆయుధాలు కొనుగోలు చేస్తోంది ఇజ్రాయెల్ నుంచే. మనం ఇప్పటిదాకా కొనుగోలు చేసిన వాటిలో క్షిపణులు, డ్రోన్లు, వివిధ రకాల ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి. తాజాగా మన పొరుగు దేశం చైనా సరిహద్దుల్లో దూకుడు పెంచుతోంది. సిక్కిం రాష్ట్రంలో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారత్, చైనా సైనికులు ఏకంగా తోపులాటకే దిగుతున్నారు.

యుద్ధానికి సిద్ధమంటూ..

యుద్ధానికి సిద్ధమంటూ..

1962లో చైనాతో జరిగిన యుద్ధంలో భారత్ ఓడిపోయింది. ఇదే విషయాన్ని ఇటీవల భారత్‌కు చైనా గుర్తు చేసి, హెచ్చరికలు జారీ చేసింది. దీనికి భారత్ కూడా దీటుగా స్పందించారు. ఇప్పుడున్న భారత్ 1962 నాటిది కాదనే విషయం గుర్తుంచుకోవాలని జైట్లీ ఘాటుగా స్పందించారు. తద్వారా, చైనాతో యుద్ధానికి కూడా తాము సిద్ధమేనని, ఈ సారి యుద్ధం జరిగితే చైనాకు తగిన శాస్తి తప్పదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో చైనా హిందూ మహాసముద్రంలోకి యుద్ధనౌకలను పంపించింది. మన నేవీ విభాగం చైనా యుద్ధనౌకల ప్రయాణాన్ని నిశితంగా గమనిస్తోంది.

ఇజ్రాయెల్లో మోడీ అడుగు

ఇజ్రాయెల్లో మోడీ అడుగు

ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. చైనాను ఎదుర్కోవడానికి భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది. ఈ క్రమంలో మన ఆర్మీని మరింత బలోపేతం చేసేందుకు భారత ప్రభుత్వం శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పలు దేశాలతో రక్షణ ఒప్పందాలు చేసుకున్న ప్రధాని మోడీ ఇప్పుడు ఇజ్రాయెల్లో అడుగు పెట్టారు.

చైనాను ఇరుకున పడేసేనా?

చైనాను ఇరుకున పడేసేనా?

మోడీ, నెతన్యాహు భేటీలో రక్షణ ఒప్పందాలే కీలకం కానున్నాయి. చైనా దూకుడు నేపథ్యంలో ఇజ్రాయెల్ నుంచి 250 బిలియన్ డాలర్ల వ్యయంతో పెద్ద ఎత్తున క్షిపణులను కొనుగోలు చేసే ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేయనున్నాయి. ఇప్పటికే స్పైక్, బరాక్ 8 క్షిపణుల కొనుగోలుకు ఆమోదం లభించింది. ఈ క్షిపణులన్నీ మన అమ్ముల పొదిలోకి చేరితే చైనా మరింత ఇరకాటంలో పడటం ఖాయమని అంటున్నారు.

English summary
PM Narendra Modi has become the first Indian Prime Minister to visit Israel - a fact that assumes huge significance and the importance of which can never be overstated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X