• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏడు కొత్త రక్షణ సంస్ధల ప్రారంభించిన ప్రధాని మోడీ-దేశ సైనిక శక్తి భాండాగారాలని ప్రశంస

|
Google Oneindia TeluguNews

ఇవాళ విజయదశమి సందర్భంగా ప్రధాని మోడీ దేశంలో కొత్తగా స్ధాపించిన ఏడు రక్షణ సంస్ధలకు ప్రారంభోత్సవం చేశారు. దేశ సైనిక శక్తిలో ఇవి కీలకంగా మారబోతున్నాయని ప్రధాని తెలిపారు. ఉపఖండంలోని దేశాలతో సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో కొత్త రక్షణ సంస్ధల ఏర్పాటు ద్వారా భారత్ సామర్ధ్యాన్ని మరోసారి చాటుకున్నట్లవుతోంది.

ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ దసరా సందర్భంగా ఏడు కొత్త రక్షణ సంస్థల్ని ప్రారంభించారు. అవి భారతదేశ సైనిక శక్తికి భారీ స్థావరంగా ఉంటాయని ఆయన తెలిపారు. విజయ దశమి సందర్భంగా ఈ కంపెనీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని మోదీ, 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకోవడం, ఈ ఏడు కంపెనీలను ప్రారంభించడం ఈ తీర్మానంలో ఓ భాగమని తెలిపారు. ఈ నిర్ణయం గత 15-20 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉందని ప్రధాని గుర్తు చేశారు.

ఇవాళ ప్రారంభించిన ఏడు కొత్త కంపెనీలు - మునిషన్స్ ఇండియా లిమిటెడ్ (MIL); ఆర్మర్డ్ వెహికిల్స్ నిగమ్ లిమిటెడ్ (AVANI), అడ్వాన్స్‌డ్ వెపన్స్ అండ్ ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ (AWE ఇండియా), ట్రూప్ కంఫోర్ట్స్ లిమిటెడ్ (TCL), యంత్ర ఇండియా లిమిటెడ్ (YIL); ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ (IOL) మరియు గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్ (GIL). ఆయా సంస్ధలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ తో పాటు పారామిలటరీ బలగాలకు చెందిన రూ.65 వేల కోట్ల విలువైన 66 ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి.

pm modi launched 7 new defence companies on dussehra, says huge base for military power

గతంలో దేశంలోని ఆయుధ కర్మాగారాలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనవిగా ప్రధాని మోడీ అభివర్ణించారు. వీటిలో ఒక్కొక్కటీ 100 నుంచి 150 ఏళ్ల చరిత్ర కలిగినవి కూడా ఉన్నాయన్నారు. "ప్రపంచ యుద్ధ సమయంలో, భారతదేశం యొక్క ఆయుధ కర్మాగారాల బలాన్ని ప్రపంచం చూసింది. మనం మెరుగైన వనరులు, ప్రపంచ స్థాయి నైపుణ్యాలను కలిగి ఉండేవాళ్లం. స్వాతంత్య్రానంతరం, ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలను అప్‌గ్రేడ్ చేయాలి, కొత్త యుగం టెక్నాలజీని అవలంబించాల్సి ఉందన్నారు. కానీ అలా జరగలేదని ప్రధాని మోదీ అన్నారు. దేశ రక్షణ రంగంలో ఈ ప్రయాణంలో స్టార్టప్‌లు భాగం కావాలని ప్రధాని కోరారు. "మీరు మీ పరిశోధన గురించి ఆలోచించాలి, కంపెనీల పరస్పర సహకారంతో మన ఉత్పత్తులు ఒకదానికొకటి ప్రయోజనం పొందగలవని ప్రధాని మోడీ అన్నారు.

  T20 World Cup 2021 : India One Of The Strong Contenders To Win The World Cup - Brett Lee

  రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, రక్షణ రంగంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అగ్ర దేశాలలో ఒకటిగా నిలవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.. ఈ రోజు సంస్కరణల మార్పులో భాగంగా ఏడు కంపెనీలు జాతికి అంకితం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అటువంటి సంస్కరణల ద్వారా కొత్త లక్ష్యాల సాధనకు మంచి అవకాశం ఉంటుందని రాజ్ నాధ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, భారతదేశం యొక్క రక్షణ సంసిద్ధతలో స్వయంసమృద్ధిని మెరుగుపరచడానికి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్‌ను ప్రభుత్వ శాఖ నుండి ఏడు 100% ప్రభుత్వ యాజమాన్య కంపెనీలుగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది.

  English summary
  PM Narendra Modi on today launched 7 new defence companies and said they will be a massive base for India's military power.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X