• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారతదేశపు తొలి డ్రైవర్ రహిత రైలును ప్రారంభించిన ప్రధాని మోడీ .. రవాణా రంగంలో స్మార్ట్ శకానికి శ్రీకారం

|

భారతదేశపు తొలి డ్రైవర్ రహిత రైలును ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ప్రారంభించారు. ఢిల్లీ మెట్రో మెజెంటా లైన్లో ఇండియాలో తొలిసారిగా డ్రైవర్ రహిత ట్రైన్ సర్వీసును ప్రారంభించారు. దేశంలో మొదటిదిగా ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్ మొట్టమొదటి డ్రైవర్ రహిత ట్రైన్ సర్వీస్ ను ప్రారంభించిన ఘనతను దక్కించుకుంది. మొదటి డ్రైవర్ రహిత మెట్రో రైలు ప్రారంభోత్సవం స్మార్ట్ విధానం వైపు భారతదేశం ఎంత వేగంగా పయనిస్తుందో అందరికీ అర్థమయ్యేలా చెప్తుంది అని నేడు వర్చువల్ విధానంలో ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

  2025 సంవత్సరానికి దేశంలో 1700 కి.మీల‌కు మెట్రో విస్తరణ-ప‌్ర‌ధాని మోడీ

  మమతా బెనర్జీ పై ప్రధాని మోడీ ధ్వజం .. ఆమె భావజాలం వల్లే బెంగాల్‌ నాశనం, రైతులకు నష్టం

   నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ ను ప్రారంభించిన పీఎం మోడీ

  నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ ను ప్రారంభించిన పీఎం మోడీ

  అంతేకాకుండా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డిఎంఆర్సి) మెట్రో ప్రయాణానికి పూర్తిస్థాయిలో పనిచేసే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్‌సిఎంసి) ను ఢిల్లీ నుండి ద్వారకా సెక్టార్ 21 వరకు 23 కిలోమీటర్ల పొడవైన విమానాశ్రయం ఎక్స్‌ప్రెస్ లైన్‌లో ప్రధాని నరేంద్ర మోడి ప్రారంభించారు. ఇదిఎన్‌సిఎంసి ఆటోమేటిక్ ఛార్జీలు సేకరణ వ్యవస్థ అని పేర్కొన్నారు. ఈ సదుపాయంతో, ప్రయాణీకులు దాని కారిడార్లలోని మెట్రో స్టేషన్‌లోకి ప్రవేశించడానికి లేదా నిష్క్రమించడానికి మొబైల్ ఫోన్‌ను కూడా ఉపయోగించవచ్చు.

  వన్ ఇండియా స్పెషల్ పేజ్: మీ ఫ్రెండ్స్‌కు ఈ - గ్రీటింగ్స్‌తో న్యూఇయర్ విషెస్ చెప్పండి.. అంతేకాదు ఆఫర్లు కూడా చూడండి

  ఢిల్లీ మెట్రోలోని మెజెంటా లైన్ లో డ్రైవర్ రహిత రైలు ప్రారంభం

  ఢిల్లీ మెట్రోలోని మెజెంటా లైన్ లో డ్రైవర్ రహిత రైలు ప్రారంభం

  ‘వన్ నేషన్ వన్ కార్డ్' అని పిలువబడే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్, ఇంటర్-ఆపరేబుల్ ట్రాన్స్ పోర్ట్ కార్డ్ అని ప్రయాణీకులకు మెట్రో మరియు బస్సు సేవలతో సహా పలు రకాల రవాణా ఛార్జీలను సాధారణ కార్డు ద్వారా చెల్లించడానికి ప్రారంభించబడిందని చెప్పారు. ఢిల్లీ మెట్రోలోని మెజెంటా లైన్ (జనక్‌పురి వెస్ట్-బొటానికల్ గార్డెన్) లో భారత తొలి డ్రైవర్‌లేని రైలు కార్యకలాపాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన తరువాత ఈ విధానం నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్) యొక్క నివాసితులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కోసమేనని మోడీ చెప్పారు .

  డ్రైవర్ లేకుండా నడిచే ట్రైన్లు ప్రపంచ వ్యాప్తంగా 7 శాతం మాత్రమే.. అందులో ఇండియాకు స్థానం

  డ్రైవర్ లేకుండా నడిచే ట్రైన్లు ప్రపంచ వ్యాప్తంగా 7 శాతం మాత్రమే.. అందులో ఇండియాకు స్థానం

  డ్రైవర్ లేకుండా నడిచే ట్రైన్లు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 7 శాతం మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఇండియా కూడా ఆ జాబితాలో చేరింది . ఢిల్లీ మెట్రో యొక్క మెజెంటా లైన్‌లో డ్రైవర్‌లేని రైళ్లను ప్రారంభించడంతో ఢిల్లీ మెట్రో యొక్క మరో ప్రధాన కారిడార్ అయిన 37 కిలోమీటర్ల పొడవైన మెజెంటా లైన్ (జనక్‌పురి వెస్ట్ - బొటానికల్ గార్డెన్) లో డ్రైవర్‌లేని సేవలను ప్రారంభించిన తరువాత, 57 కిలోమీటర్ల పొడవైన పింక్ లైన్ (మజ్లిస్ పార్క్ - శివ్ విహార్) లో కూడా డ్రైవర్‌ రహిత మెట్రో సర్వీసులను 2021 లో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

   తర్వాత దశలో పింక్ లైన్ లో కూడా .. నూతన అధ్యాయానికి శ్రీకారం

  తర్వాత దశలో పింక్ లైన్ లో కూడా .. నూతన అధ్యాయానికి శ్రీకారం

  తర్వాత దశలో పింక్ లైన్ లో కూడా మానవ రహిత ట్రైన్స్ ప్రారంభం జరిగితే ఢిల్లీ మెట్రోలో డ్రైవర్‌లెస్ నెట్‌వర్క్ పొడవు సుమారు 94 కిలోమీటర్లు ఉంటుంది, ఇది ప్రపంచంలోని మొత్తం డ్రైవర్‌లెస్ మెట్రో నెట్‌వర్క్‌లో సుమారు తొమ్మిది శాతం ఉంటుంది.

  మానవ తప్పిదాలను నివారించటం, మెరుగైన ప్రయాణ సౌకర్యంతో పాటు రవాణా శకంలో నూతన అధ్యాయానికి నేడు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు . అందులో భాగంగానే డ్రైవర్ రహిత రైలు సర్వీస్ ను ప్రారంభించి డిజిటల్ విధానంలో ఇండియా సైతం ముందు ఉందని నిరూపించారు .

  English summary
  Prime Minister Narendra Modi today inaugurated India's first driver-less train on Delhi Metro's Magenta Line. He also launched the National Common Mobility Card, an inter-operable transport facility that allows users to pay for travel, toll duties, retail shopping, and withdraw money using one card.The inauguration of the first driverless metro train shows how fast India is moving towards smart systems," Prime Minister Modi said inaugurating the ground-breaking project today during a virtual function.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X