వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవభారత నిర్మాణానికి కృషి: బీజేపీ సభ్యత్వ నమోదులో మోడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : వచ్చే ఐదేళ్లలో ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడమే తమ లక్ష్యమన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇందుకోసం వ్యుహరచనతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. అన్నివర్గాల ఆకాంక్షలను అనుగుణంగా పనిచేస్తామని ఉద్ఘాటించారు. రైతు సంక్షేమం, రహదారుల నిర్మాణాలకు కీలక ప్రాధాన్యం ఇచ్చినట్టు గుర్తుచేశారు. దేశాభివృద్ధే తమ ధ్యేయమని స్పష్టంచేశారు.

సభ్యత్వ నమోదు ..
యూపీలోని వారణాసిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయాల మేరకు పనిచేస్తామని తెలిపారు. ముఖర్జీ ఆకాంక్షల మేరకు పనిచేస్తామని చెప్పి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశం ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్లకు చేరుకుంటుందని పునరుద్ఘాటించారు. దీంతో ప్రజల కోరికలకు అనుగుణంగా పనిచేస్తూ .. నవ భారతాన్ని నిర్మిస్తామని స్పష్టంచేశారు.

PM Modi launches BJPs membership drive in Varanasi, says will achieve $5 trillion economy goal

టార్గెట్ ..
బడ్జెట్‌కు సంబంధించి నిన్న టీవీల్లో, ఇవాళ పత్రికల్లో చదివి ఉంటారు. 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ నిర్మించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. బడ్జెట్ కోసం నిర్ణీత సమయంలో లక్ష్యం పెట్టుకున్నామని ఉదహరించారు. సాధారణంగా ప్రజలు చిన్న, మధ్య, పెద్ద కేక్ అని అంటారు కదా .. అలాగే ఆర్థిక వ్యవస్థకు కూడా 5 ట్రిలియన్ డాలర్ల టార్గెట్ పెట్టుకున్నామని పేర్కొన్నారు.

English summary
prime Minister Narendra Modi launched the Bharatiya Janata Party's countrywide membership drive in Uttar Pradesh's Varanasi on Saturday. Speaking at the drive's launch, PM Modi said his government will fulfil the dreams of Dr Syama Prasad Mookerjee, the founder of Bharatiya Jana Sangh, as the day marks his birth anniversary. PM Modi mentioned in his speech that earlier he had the honour to unveil a statue of former PM Lal Bahadur Shastri in the city. The PM also said that his government will achieve the $5 trillion economy goal which is connected to the dreams of a new India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X