వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిజిటల్ ఇండియా: మోడీతో సహా ఎవరేమన్నారు?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో 'డిజిటల్‌ ఇండియా' పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు. అనంతరం డిజిటల్ ఇండియాకు సంబంధించిన పుస్తకాన్ని విడుదల చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని రెండు గ్రామ పంచాయతీల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ ఈ పథకాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ కలల సాకారానికి డిజిటల్ ఇండియా కొత్త అడుగు అని అన్నారు. సేవల రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని చెప్పారు. సదుపాయాల్లో అంతరం మరింత పెరుగుతందని అన్నారు.

ఈ పోటీ ప్రపంచంలో ముందడుగు వేయకపోతే వెనకబడి పోతామని పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా ప్రాజెక్టుకు పారిశ్రామికవేత్తలు ఇస్తున్న మద్దతు కొత్త ఆశలు రేకిత్తిస్తోందన్నారు. కమ్యూనికేషన్స్ ఉన్న చోటే నగరాలు ఏర్పడుతున్నాయని చెప్పారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అరుణ్‌ జెట్లీ, రవిశంకర్‌ ప్రసాద్‌, నిర్మలాసీతారామన్‌, భాజపా అగ్రనేత అద్వానీ తదితరులతో పాటు ఆర్ఐఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ, టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ, విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రే‌మ్‌జీ తదితరులు హాజరయ్యారు.

రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ:

డిజిటల్ ఇండియా పారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర ఐటీ సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ డిజిటల్ ఇండియా గొప్ప మార్పుని తీసుకొస్తుందని చెప్పారు. 'మేక్‌ఇన్‌ ఇండియా' లేకుంటే 'డిజిటల్‌ ఇండియా' అసంపూర్తిగా మిగిలిపోతుందన్నారు.

డిజిటల్ ఇండియా ద్వారా అవినీతి నిర్మూలన సాధ్యమని అన్నారు. దేశంలో 975 మంది మిలియన్ల మొబైల్‌ వినియోగదారులున్నారని చెప్పారు. డిజిటల్‌ ఇండియాలో అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ ప్రాజెక్టులో పారిశ్రామికవేత్తలు పాల్గొనాలని అన్నారు.

PM Modi launches Digital India project

ముకేశ్ అంబానీ మాట్లాడుతూ..

డిజిటైలేజేషన్ ప్రారంభం ఓ గొప్ప ముందుడగు అంటూ ఆయన అభివర్ణించారు. డిజిటల్ ఇండియాతో భారతీయుల జీవన విధానం మారుతుందని ఆర్ఐఎల్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. ఈ డిజిటల్ ఇండియా పథకంలో రూ. 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా ద్వారా 5 లక్షల మందికి ఉద్యోగఅవకాశాలు వస్తాయన్నారు. అంతేకాక సామాజిక మార్పునుకు డిజిటల్ ఇండియా ఎంతోగానూ దోహదపడుతుందని చెప్పారు.

కుమార మంగళం బిర్లా మాట్లాడుతూ...

బ్రాడ్‌ బ్యాండ్‌ నెట్‌వర్క్‌, వైఫై అభివృద్ధిలో ఆదిత్యా బిర్లా గ్రూప్‌ భారీగా పెట్టుబడులు పెడుతుందని ఆదిత్యా బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా అన్నారు. ఐడియా నెట్ వర్క్ ఇప్పటికే 16.5 కోట్ల మందిని అనుసంధానం చేస్తోంది కుమార మంగళం బిర్లా చెప్పారు.

అనిల్‌ అంబానీ మాట్లాడుతూ....

భారత ప్రధాని నరేంద్రమోడీ డిజిటల్‌ ప్రపంచంలో ఎంతో ప్రజాదరణ ఉన్న వ్యక్తి అని అడాగ్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ కొనియాడారు. ట్విట్టర్‌లో ప్రధాని మోడీని 80 లక్షల మంది అనుసరిస్తున్నారని చెప్పారు.

అజీమ్‌ ప్రేమ్‌జీ మాట్లాడుతూ....

భారత్‌ను శక్తి వంతంగా మలిచేందుకు మోడీ కలలు కంటున్నారని అదే డిజిటల్ ఇండియా అని పేర్కొన్నారు. ఆర్ధిక పౌర సేవల్లో డిజిటల్ ఇండియాతో విప్లవం తెస్తుందని విప్రో ఛైర్మన్‌ అజీమ్‌ప్రేమ్‌జీ అన్నారు. ప్రతి గడపకూ డిజిటల్ సేవలు అందించడం ద్వారా అగ్రదేశాల సరసన భారత్ నిలుపుతుందని చెప్పారు. వైద్య సేవల కోసం విప్రో చిన్న మధ్య తరహా సంస్థలను ఆన్‌లైన్‌లోకి తెచ్చిందని చెప్పారు.

సైరస్‌ మిస్త్రీ మాట్లాడుతూ....

డిజిటిల్ ఇండియా చేయాలన్న ప్రధాని ముందు చూపు గొప్ప లక్ష్యమని సైరస్ మిస్త్రీ అన్నారు. డిజిటైజేషన్‌లో ముందున్న దేశాలను అధిగమించాలన్న లక్ష్యంతో భారత్‌ అడుగులేస్తోందని మిస్త్రీ పేర్కొన్నారు.

English summary
Prime Minister Narendra Modi’s pet project ‘Digital India’ is all set to be launched today. The week-long mega event, called ”Digital India Week’ — which is expected to attract 10,000 people — will be be flagged off at the Indira Gandhi stadium, New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X