వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ వారణాసి నుంచే బరిలోకి మోదీ : పూరీ నుంచి బరిలోకి దిగరని కమలదళం స్పష్టీకరణ

|
Google Oneindia TeluguNews

Recommended Video

PM Narendra Modi Is Likely To Contest From Varanasi In Uttar Pradesh | Oneindia Telugu

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్కడినుంచి పోటీచేస్తారు ? వారణాసి నుంచి బరిలోకి దిగుతారా ? లేదంటే మరో పుణ్యక్షేత్రం పూరీ నుంచి పోటీ చేస్తారా అనే చర్చ జరుగుతోంది. మోదీ పోటీ చేసే స్థానంపై ఊహాగానాలు నెలకొన్న తరుణంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు స్పందించింది. సార్వత్రిక ఎన్నికల్లో మోదీ వారణాసి నుంచి బరిలోకి దిగుతారని స్పష్టంచేసింది. పూరీ నుంచి పోటీచేయబోరని తేల్చిచెప్పింది.

<strong>మోదీ ఇలాకా నుంచే కాంగ్రెస్ క్యాంపెయిన్ .. ప్రియాంక, హర్థిక్ రాకతో శ్రేణుల్లో జోష్</strong>మోదీ ఇలాకా నుంచే కాంగ్రెస్ క్యాంపెయిన్ .. ప్రియాంక, హర్థిక్ రాకతో శ్రేణుల్లో జోష్

ఈసారి కూడా రెండోస్థానంలో పోటీ ?

ఈసారి కూడా రెండోస్థానంలో పోటీ ?

గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో మోదీ పోటీ చేసి గెలుపొందారు. తన సొంత రాష్ట్రం గుజరాత్ లోని వడోదర, ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసి నుంచి బరిలోకి దిగారు. తర్వాత వడోదర ఎంపీ పదవీకి రాజీనామా చేశారు. ఈ సారి కూడా రెండు స్థానాల్లో పోటీ చేస్తారా అనే సందేహం కలుగుతోంది. వారణాసితోపాటు జగన్నాథుడి ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరీ నుంచి పోటీచేస్తారని ఊహాగానాలు వినిపిస్తోన్నాయి. దీనికి బలం చేకూరేందుకు ఇటీవల పూరీలో పలు అభివృద్ధి పనులు జరుగడమే. ఈ విషయాన్నే మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా .. మోదీ వారణాసి నుంచే పోటీ చేస్తారు. ఒకవేళ రెండోస్థానం నుంచి పోటీచేయాలని భావిస్తే అది మాత్రం పూరీ అవుతోందని సంకేతాలిచ్చింది.

పూరీ వైపు చూపు ఎందుకంటే ..?

పూరీ వైపు చూపు ఎందుకంటే ..?

గత ఎన్నికల్లో రెండుచోట్ల గెలిచిన మోదీ యూపీలోని వారణాసి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది. కానీ ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది. దీంతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో అధికారం చేతులు మారింది. ఈ క్రమంలోనే యూపీ నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి మోదీని బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తోంది. ఒడిశా, బెంగాల్, ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయించాలని యోచిస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో ఓటు బ్యాంకు పెరిగి .. బీజేపీ సీట్లు పెరిగి మళ్లీ తిరిగి అధికారం చేపట్టేందుకు దోహదపడుతుందని లెక్కలు వేస్తోంది.

ఊహగానాలను విశ్వసించొద్దు ..?

ఊహగానాలను విశ్వసించొద్దు ..?

మీడియాలో జరుగుతోన్న ఊహగానాలను బీజేపీ తోసిపుచ్చింది. టీవీ స్టూడియోలో కూర్చొని పార్లమెంట్ స్థానాల అభ్యర్థులను ఖరారు చేస్తారా అని ప్రశ్నించింది. ఈ వారంలో బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం జరగుతోందని .. ఏయే స్థానాల్లో ఎవరూ పోటీ చేస్తారనే అంశంపై స్పష్టత వస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా తెలిపారు.

English summary
Prime Minister Narendra Modi is likely to contest from Varanasi in Uttar Pradesh, the parliamentary seat he retained after winning two seats in the 2014 election. There has been speculation that in the April-May national election, the Prime Minister may opt for another temple town, Puri, but top party sources say he is likely to stick with Varanasi. The BJP parliamentary board is apparently strongly in favour of a PM Modi encore in Varanasi. It is not clear, however, whether he will contest from a second seat and whether that seat will be Puri. BJP's assessment is that having PM Modi as a candidate shored up its tally in Uttar Pradesh, where it won a staggering 71 of 80 seats in 2014. With recent disappointments in UP (by-polls) and other big northern states Rajasthan and Madhya Pradesh - the party lost both to the Congress - the BJP sees more potential in Odisha, Bengal and other states in the region, say sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X