వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీ ముందు ఆర్మీ చరిత్రను తెలుసుకుని మాట్లాడాలి : పంజాబ్ సీఎం

|
Google Oneindia TeluguNews

ప్రధాని నరేంద్రమోడీపై చరిత్రపై అవగహానలేకనే సర్జికల్స్ స్ట్ర్రైక్స్ పై ఎక్కువగా మాట్లాడుతున్నారని పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ ప్రధాని మోడీపై ఫైర్ అయ్యారు. సర్జికల్స్ స్ట్ర్రైక్స్ పై ముందుగా నరేంద్రమోడీ చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. బాలకోట్ సర్జికల్ స్ట్ర్రైక్ తర్వాత ఎన్నికల్లో జరగుతున్న పరిణామాల నేపథ్యంలో సర్జికల్ స్ట్ర్త్రైక్స్ పై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి.

ముఖ్యంగా గతంలో ఇలాంటీ సర్జికల్ స్ట్ర్ర్రైక్స్ అసలు జరగనేలేదన్నట్టుగా విపరీతంగా బీజేపీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ,బీజేపీల మధ్య పోలిటికల్ వార్ జరగుతుంది. దేశ రక్షణలో బీజేపీ ప్రముఖ పాత్ర పోషిస్తుందని ,ఇందుకోసం బీజేపీని మరోసారి ఎన్నుకోవాలని ఆపార్టీ ప్రచారం చేస్తోంది. ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రచారాన్ని తిప్పికొడుతోంది. తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ సైతం సర్జికల్స్ స్ట్ర్రైక్స్‌పై చరిత్ర తెలుసుకుని మోడీ మాట్లాడాలని అన్నారు.

 వందల సర్జికల్ స్ట్ర్రైక్స్ జరిగాయి

వందల సర్జికల్ స్ట్ర్రైక్స్ జరిగాయి

అమరిందర్ సింగ్ ఆర్మీలో ఉన్నప్పుడు పాకిస్థాన్ బోర్డర్ వెంబడి వంద సర్జికల్ స్ట్ర్రైక్స్ జరిగాయని ఓ జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన వెల్లడించారు.ముఖ్యంగా ఆర్మీ చరిత్ర గురించి తెలిసిన వారికి ఈ విషయం తెలుస్తుందని అన్నారు. అయితే బీజేపీ అలాంటీ దాడులకు కొత్తగా సర్జికల్ స్ట్ర్రైక్స్ అని పేట్టారని వాటిని తాము ''క్రాస్ బోర్డర్ రైడ్స్" అని పిలిచేవాళ్లమని అన్నారు. కాగా అమరిందర్ సింగ్ 1963 నుండి 1966 వరకు అమరిందర్ సింగ్ ఇండియన్ ఆర్మీలో కెప్టెన్ గా విధులు నిర్వహించారు.

దాడుల వివరాలు ఎందుకు ఇవ్వడం లేదు..

దాడుల వివరాలు ఎందుకు ఇవ్వడం లేదు..

మరోవైపు గతంలో జరిగిన పలుయుద్దాల్లో పీఎం గా ఎవరున్నారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హాయాంలో ఎన్నో దాడులు జరిగాయని కాని వాటిని ఏనాడు బయటపెట్టలేదని తెలిపారు. మరోవైపు బీజేపీ మంత్రులు కూడ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. బాలకోట్ దాడిలో మిలిటెంట్స్‌పై దాడి జరిగనప్పుడు దానికి సంబంధించి మోడీ ప్రభుత్వం ఎందుకు వివరాలు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.

పాకిస్థాన్‌తో మాకు 500 కి.మీ సరిహద్దు ఉంది. యుద్దాన్ని కోరుకోవడం లేదు

పాకిస్థాన్‌తో మాకు 500 కి.మీ సరిహద్దు ఉంది. యుద్దాన్ని కోరుకోవడం లేదు

కాగా పంజాబ్ రాష్ట్ర్రం యుద్దం కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. పాకిస్థాన్ బార్దర్ కు పంజాబ్ రాష్ట్ర్రం పాకిస్థాన్ 540 కిలోమీటర్ల సరిహద్దు కల్గిఉన్నామని తెలిపారు. ఆయా గ్రామాల ప్రజలు ఇదే అభిప్రాయంతో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.అయితే ఎయిర్ ఫోర్స్ దాడులపై అనుమానాలు అక్కరలేదని అయిదే ఎం జరిగిందనే నిజాలను తెలుసుకోవాలని కోరుకుంటారని అన్నారు.

English summary
Punjab Chief Minister Amarinder Singh hit out at Prime Minister Narendra Modi over the BJP's claim that the Narendra Modi government was the first conduct surgical strikes on terrorists across the border in Pakistan. Mr Singh said PM Modi needed "history lessons".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X