• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అర్డికల్ 370...రామమందిరం..తలాక్ రద్దు: ఇక..మిగిలింది ఆ రెండే : ప్రధాని మోదీ అసలు లక్ష్యం అదే..!

|

ప్రధాని మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత తొలి రోజు నుండే వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. సుదీర్ఘ కాలం దేశంలో వివాదాలుగా ఉన్న అంశాల పైన దృష్టి సారించారు. అందులో భాగంగా తొలుత జమ్ము కాశ్మీర్ లో 370..35ఏ అధికరణ రద్దుతో పాటుగా త్రిబుల్ తలాక్ రద్దు చేసారు. రెండో సారి అధికారంలోకి అధికారంలోకి వచ్చిన సమయం నుండి దేశంలో సుదీర్ఘ కాలంగా వివాదాలు కొనసాగుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వమూ చూపించని చొరవ చూపించి..తన మార్క్ సుస్దిరం చేసుకోవాలని మోదీ డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా తొలుత కీలకమైన హోం శాఖను తమ విధేయుడు అమిత్ షా కు అప్పగించారు. ఇక, ఇప్పుడు అయోధ్యలో రామాలయానికి అనుగుణంగా చట్ట బద్దంగా అనమతి లభించింది. ఇక, మోదీ ముందు మరో రెండు సమస్యలు ఉన్నాయి. వాటితో పాటుగా చరిత్రలో నిలిచిపోయే నిర్ణయంతో పాటుగా..అంతిమంగా రాజకీయ లక్ష్యం దిశగా మోదీ అడుగులు వేస్తున్నారు. దీంతో..ఇప్పుడు దేశం మొత్తం మోదీ తరువాతి అడుగులు ఏంటనే చర్చ మొదలైంది.

రెండో సారి అధికారంలోకి రాగానే..

రెండో సారి అధికారంలోకి రాగానే..

ప్రధాని మోదీ రెండో సారి అధికారంలోకి రాగానే పార్టీ నేతలు దశాబ్దాలుగా తమ లక్యాలుగా చెబుతూ వస్తున్న వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వెళ్తున్నారు. అందులో భాగంగా..370, 35 ఏ రద్దు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు తీసుకుంటే..ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో అనే ఆందోళనలకు ఎటువంటి బెరుకు లేకుండా.. తన దైన శైలిలో అమలు చేసారు. ముందస్తు కసరత్తు.. పక్కా ప్లానింగ్ తో వీటిని పరిష్కరించారు. ఇక, త్రిబుల్ తలాక్ కు ఆమోదం లభించింది. బీజేపీ చిరకాల నినాదం అయోధ్యలో రామ మందిరానికి ఇప్పుడ చట్ట బద్దంగా ఆమోదం లభించింది. ఈ సున్నిత అంశం పైన నిర్ణయం వెలువడితే ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో అనే ఉత్కంఠకు తెర దించారు. ముందస్తు జాగ్రత్తలతో ఎటువంటి వివాదాలు.. ఘర్ణణలకు చోటు లేకుండా సుప్రీం సంచల తీర్పు ఇచ్చింది. ఇది కూడా ఇప్పుడు బీజేపీకి రాజకీయంగా కలిసి వచ్చే అంశమే.

మోదీ ముందు మిగిలిన రెండు అంశాలు..

మోదీ ముందు మిగిలిన రెండు అంశాలు..

ప్రధానిగా రెండో సారి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత మోదీ..తరువాతి దృష్టి కీలకమైన రెండు అంశాల మీద ఫోకస్ అయ్యే అవకాశం ఉంది. బీజేపీ ఎప్పటి నుండో ప్రస్తావిస్తున్న ఉమ్మడి పౌర స్మ్రుతి, జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) కీలకంగా మారుతున్నాయి. ఇప్పటికే ఎన్నార్సీ అమలు చాప కింద నీరులా కొనసాగుతోంది. ఇక, ఉమ్మడి పౌర స్మ్రుతికి లా కమిషన్ సైతం మద్దతు పలకటంతో న్యాయ పరంగా ముందుకు అడుగు వేసే అవకాశం లభించింది. దీని అమలు దిశగా కేంద్ర న్యాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ రెండు ఇక.. చట్ట బద్దంగా అమలు చేయటానికి ఇప్పటికే..రాజకీయంగానూ వ్యూహాలు అమలు చేస్తున్నారు. లోక్ సభలో మెజార్టీకి ఇబ్బంది లేకపోవటంతో..రాజ్యసభలోనూ పూర్తి మెజార్టీ సాధించే క్రమంలో సభ్యులను తమ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తే..వారికి స్వాగతం పలుకుతున్నారు.

పీఓకే మీద మోదీ అసలు గురి..

పీఓకే మీద మోదీ అసలు గురి..

దశాబ్దాల కాలంగా వివాదాలుగా మారిన ఆర్టికల్ 370 రద్దు..అయోధ్య వివాదానికి ముగింపు లభించటంతో ఇక..అదే తరహాలో పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో విలీనం చేయటం మోదీ లక్ష్యంగా బీజేపీ నేతలు చెబుతున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ తరువాత బీజేపీ నేతలు అనేక మంది ఇదే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దౌత్య పరంగానూ మోదీ అంతర్జాతీయ స్థాయిలో తనకు మద్దతు సంపాదించుకున్నారు. ఇక, ఇదే సమయంలో జమ్ము కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు ఖరారు చేస్తూ భారత ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన భారత భౌగోళిక మ్యాపుల్లోనూ పీఓకేను భారత్ లో అంతర్భాగంగా చూపించటం ద్వారా..కేంద్రం తమ లక్ష్యాన్ని సుస్పష్టం చేసింది. దీని పైన పాక్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక, పీఓకే మీద సైతం మోదీ సమయం చూసి నిర్ణయం తీసుకోనున్నారు.

అంతిమంగా జమిలి ఎన్నికలు..

అంతిమంగా జమిలి ఎన్నికలు..

ఇక, 2019 ఎన్నికల తరువాత నుండే బీజేపీ జమిలి ఎన్నికల ప్రస్తావన పదే పదే తీసుకొస్తోంది. ప్రధాని మోదీ తొలి నెలలోనే అన్ని పార్టీల అధినేతలతో ఇదే అంశం పైన ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. మెజార్టీ పార్టీల మద్దతు కూడగట్టారు. 2024 నాటికి మోదీకి 75 ఏళ్లు పూర్తవుతాయి. బీజేపీ సిద్దాంతాల ప్రకారం ఆ వయసు దాటిన వారు కీలక పదవుల్లో ఉండకూడదు. ఆ లోగానే కాంగ్రెస్ రహిత భారత్ బీజేపీ అంతిమ లక్ష్యం. అందులో భాగంగా.. దేశ వ్యాప్తంగా తమకు అనుకూల వాతావరణం కల్పించి.. ఉత్తర భారత పార్టీగా ముద్ర పడిన బీజేపీని..దక్షిణాదిన విస్తరించి..కాషాయ జెండా ఎగుర వేయాలని.. తాను ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలోని సమస్యలను పరిష్కరించిన ముద్రతో పాటుగా..బీజేపీకి చెక్కు చెదరని ఆదరణ సంపాదించి పెట్టాలనేది మోదీ లక్ష్యం. దీంతో..రానున్న కాలంలో మోదీ వేయబోయే అడుగులు మరిన్ని సంచలన నిర్ణయాలకు కారణం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Prime Ministrer Modi moving strategiclly to clear the pending disputes in country as un solved. Modi in coming days may be concentrated on ccommon civil code and on NRC. BJP planning to go for one nation one election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more