వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాంధీ, వాజ్‌పేయికి నివాళులర్పించిన మోడీ

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజార్టీ సాధించిన నరేంద్రమోడీ రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సాయంత్రం 7గంటలకు రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో మోడీ గురువారం ఉదయం మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని వాజ్‌పేయ్‌లకు నివాళులర్పించారు. అమిత్ షాతో కలిసి తొలుత రాజ్ ఘాట్‌కు చేరుకున్న ఆయన.. మహాత్మాగాంధీకి అంజలి ఘటించారు. అనంతరం అటల్ బిహారీ వాజ్‌పేయి సమాధి వద్దకు వచ్చి నివాళులు అర్పించారు.

గాంధీ, వాజ్‌పేయిలకు నివాళులర్పించిన అనంతరం నరేంద్రమోడీ నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించారు. అమర జవాన్లకు నివాళులు అర్పించారు. నేషనల్ వార్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచిన అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. బీజేపీ నేత నిర్మలాసీతారామన్, ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా, ఎయిర్‌ఫోర్స్ వైస్ చీఫ్ మార్షల్ ఆర్‌ కే ఎస్ బహదురాయ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రభుత్వంలో కొనసాగాలంటూ అరుణ్ జైట్లీ ఇంటికి వెళ్లి చర్చించిన ప్రధాని నరేంద్ర మోడీ...ప్రభుత్వంలో కొనసాగాలంటూ అరుణ్ జైట్లీ ఇంటికి వెళ్లి చర్చించిన ప్రధాని నరేంద్ర మోడీ...

PM Modi Pays Tribute to mahatma gandhi and vajpayee
English summary
The memorial of Mahatma Gandhi at Rajghat was one of the first places PM Modi visited in the national capital at 7 am. He also paid his respects at the memorial of late Prime Minister Atal Bihari Vajpayee. He then visited the National War Memorial near India Gate. The monument, spread over 40 acres, is dedicated to soldiers killed in service of the country over the decades.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X