వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్‌డౌన్ ఎత్తేద్దాం: సీఎంలతో మోదీ.. జోన్ల మార్పులు సులభతరం.. వలస కూలీలపై ప్రధాని వేదాంతం..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం లాక్ డౌన్ విధించి సోమవారానికి 48వ రోజు. ఇంకో ఆరు రోజుల్లో మూడో దశ లాక్ డౌన్ గడువు ముగియనుండగా.. మరిన్ని సడలింపులు ప్రకటించే దిశగా ప్రభుత్వాలు అడుగులేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వమైతే ఇప్పటికే రైల్వే టికెట్ల బుకింగ్ ప్రారంభించింది. మంగళవారం నుంచి పరిమిత స్థాయిలో రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈనెల 17 తర్వాత విమాన సేవల్ని కూడా పునరుద్ధరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా చచ్చుపడిపోయిన ఆర్థిక వ్యవస్థను తిరిగి నిలబెట్టాలంటే వ్యాపారాల పున:ప్రారంభం తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారు. సోమవారం ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లోనూ ఆయన ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కానీ..

Recommended Video

PM Modi Video Conference With CMs On Lockdown Exit, Modi Pitches For Easing Lockdown Curbs

ఐకియా స్టోర్‌లో మహిళ హస్తప్రయోగం.. వైరల్ వీడియోపై సంస్థ వివరణ.. శిక్షలు తెలిస్తే షాకవుతారు..ఐకియా స్టోర్‌లో మహిళ హస్తప్రయోగం.. వైరల్ వీడియోపై సంస్థ వివరణ.. శిక్షలు తెలిస్తే షాకవుతారు..

ఒళ్లు జలదరింపు..

ఒళ్లు జలదరింపు..

లాక్ డౌన్ విధించి 50 రోజులు కావస్తున్నా, వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదుసరికదా, సోమవారం కనీవినీ ఎరుగని స్థాయిలో ఒకే రోజు కొత్తగా 4,213 పాజిటివ్ కేసులు వెలుగులో రావడం అందరినీ జలదరింపజేసింది. ప్రధాని మోదీ సీఎంలతో భేటీలో ఉండగానే, కేంద్ర ఆరోగ్య సంస్థ తాజా లెక్కల్ని విడుదల చేసింది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తోన్న దరిమిలా లాక్ డౌన్‌ను మరింత కాలం పొడిగించే అంశంపైనా అధినేతలు చర్చలు జరిపారు. ముందు నుయ్యి-వెనుక గొయ్యి చందంగా.. కఠిన ఆంక్షలు అమలుచేస్తే ఎకానమీ పూర్తిగా చచ్చిపోయే ప్రమాదముంది, అలాగని సడలింపులు ప్రకటిస్తే వైరస్ మరింతగా వ్యాప్తి చెందే అవకాశముండటంతో ఏ విధంగా ముందుకెళ్లాలనేదానిపై సీఎం, సీఎంలు తలలు బద్దలు కొట్టుకున్నారు. చివరికి..

ఎత్తివేతకే మొగ్గు.. కానీ

ఎత్తివేతకే మొగ్గు.. కానీ

లాక్ డౌన్ నేపథ్యంలో ప్రధాని మోదీ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇది ఐదో సారి. గత సమావేశంలో కేవలం తొమ్మిది మంది సీఎంలకు మాత్రమే మాట్లాడే అవకాశమిచ్చి, మిగతావాళ్ల నుంచి లిఖితపూర్వక నివేదికలు తీసుకున్నారు. సోమవారం నాటి భేటీలో మాత్రం అందరు సీఎంలు ఫ్రీగా తమ భావాలను ప్రకటించే అవకాశం లభించింది. వైరస్ తన దిశను మార్చుకుంటున్న తీరు, కరోనా కేసుల నమోదు, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు, వైరస్‌పై ప్రపంచ సినారియో.. ఇలా అంశాలపైనా అధినేతలు సమాలోచనలు చేశారు. చివరికి అందరూ లాక్ డౌన్ ఎత్తివేతకే మొగ్గుచూపారు. అయితే ఆ పనిని ఒకేసారి కాకుండా దశల వారీగా చేపట్టాలని నిర్ణయించారు.

మరిన్ని సడలింపులు..

మరిన్ని సడలింపులు..

లాక్ డౌన్ ఎగ్జిట్ స్ట్రాటజీలో భాగంగా రెండో, మూడో దశ పొడగింపుల సమయంలో ఇచ్చినట్లే.. మే 17 తర్వాత కూడా కేంద్రం మరిన్ని సడలింపులు కల్పించనుంది. టెక్నికల్ గా ఇది లాక్ డౌన్ కొనసాగింపే అయినప్పటికీ.. మినహాయింపుల దృష్ట్యా దీనిని ఎగ్జిట్ గానే పరిగణించాలని కేంద్ర అధికారులు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఉన్న రెడ్ జోన్లను ఆరెంజ్ లేదా గ్రీన్ జోన్లుగా మార్చేసే ప్రక్రియను ఇకపై సులభతరం చేయనున్నారు. కలర్ మారిన జోన్లలో ఆల్టర్నేటివ్ పద్ధతిలో వారానికి మూడు రోజులు అన్ని రకాల దుకాణాలను తెరిచి ఉంచుతారు. అయితే ఫిజికల్ డస్టెన్సింగ్ నిబంధనలు మాత్రం కచ్చితంగా అమలు చేయాల్సిందేనని కేంద్రం కండిషన్ పెడుతోంది.

మోదీపై సీఎంలఫైర్..

మోదీపై సీఎంలఫైర్..

లాక్ డౌన్ ఎగ్జిట్ స్ట్రాటజీలో భాగంగా మరిన్ని సడలింపులు కల్పిస్తానని చెప్పినప్పటికీ ప్రధాని మోదీపై కొందరు ముఖ్యమంత్రులు ఫైర్ అయిన దృశ్యాలు కాన్ఫరెన్స్ లో చోటుచేసుకున్నాయి. ప్రధానంగా మంగళవారం(12 నుంచే) రైళ్ల పున:ప్రారంభానికి కేంద్రం శ్రీకారం చుట్టనుండటం, ఆ విషయంలో రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకపోవడంపై తమిళనాడు, తెలంగాణ, ఏపీ, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రులు బాహాటంగానే మోదీని విమర్శించినట్లు తెలిసింది. ఒక్కసారి రాకపోకలు మొదలైతే, కేసుల గుర్తింపు కష్టతరమవుతుందని, అంచేత రైళ్లు నడపాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ సీఎంలు డిమాండ్ చేశారు. దీనికి మోదీ సమాధానం ఇవ్వనప్పటికీ.. ‘టికెట్ల బుకింగ్ యధావిధిగా కొనసాగుతుంది'అని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

వలస కూలీల వెతపై మోదీ..

వలస కూలీల వెతపై మోదీ..


లాక్ డౌన్ విధించి 50 రోజులు గడుస్తున్నా, ఇప్పటికీ వలస కూలీలు తమ సొంత ఇళ్లకు చేరలేక నానా అవస్థలు పడుతుండటం, కాలిబాటన ఊళ్లకు బయలుదేరడం, మధ్యలో ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోతుండటం అందరినీ కలిచివేస్తున్నది. వలస కూలీల తరలింపునకు శ్రామిక్ రైళ్లు ఏర్పాటు చేశామన్న కేంద్రం.. చార్జీల భారాన్ని రాష్ట్రాలపై మోపడం వివాదాస్పదమైంది. ఈ సమస్య గ్రౌడ్ లెవల్ లో పరిష్కారమయ్యే విధానాన్ని కేంద్రం ప్రకటించలేదు. పైగా, ‘‘కష్టకాలంలో సొంత ఊరికి వెళ్లాలనుకోవడం మానవ సహజం. అందుకే లాక్ డౌన్ ఆదేశాలు ఉల్లంఘించి మరీ వలస కూలీలు ఇంటిబాట పట్టారు..''అంటూ మోదీ వేదాంత ధోరణిలో మాట్లాడారు.

సడలింపులు సబబేనా?

సడలింపులు సబబేనా?

ఆర్థిక వ్యవస్థను కాపాడుకునే క్రమంలో ప్రభుత్వాధినేతలైన పీఎం, సీఎంలు లాక్ డౌన్ సడలింపుకు మొగ్గుచూపడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకదిక్కు కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతుండగా, జన సంచారాన్ని పెంచేలా రీఓపెనింగ్స్ ప్రకటించడం తగదనే సూచలు వస్తున్నాయి. అదృష్టవశాత్తూ ఇండియాలో వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ రాలేదని, లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడమే అందుకు కారణమని, అలాంటప్పుడు వైరస్ వ్యాప్తి కంట్రోల్ లోకి రాకముందే భారీగా సడలింపులు ప్రకటిస్తే అది పెను ప్రమాదానికి దారితీస్తుందని కొందరు ఉన్నతాధికారులే ఆందోళన వ్యక్తం చేశారు. రిస్ట్రిక్షన్లతో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చనుకున్న దేశాలన్నీ తర్వాతి కాలంలో పూర్తి స్థాయి లాక్ డౌన్ వైపునకు మళ్లిన అనుభవాన్ని వాళ్లు గుర్తుచేస్తున్నారు.

ఎకానమీపై రిపోర్టులు.. ఎల్లుండి ప్యాకేజీ?

ఎకానమీపై రిపోర్టులు.. ఎల్లుండి ప్యాకేజీ?

కరోనా విలయం కారంగా రాష్ట్రాల్లో ఏర్పడిన ఆర్థిక పరిస్థితులపై రిపోర్టులు సమర్పించాల్సిందిగా ముఖ్యమంత్రులను ప్రధాని మోదీ కోరారు. ఆర్థికంగా కోలుకోవాలంటే మళ్లీ వ్యాపారాలు ప్రారంభించాల్సిందేనని, అయితే పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే దుకాణాలకు అనుమతులివ్వాలని ప్రధాని సూచించారు. ఎకానమీ విషయాల్లో రాష్ట్రాలకు కేంద్రం అన్ని రకాలుగా సహాయపడుతుందని భరోసా ఇచ్చారు. మరోవైపు, లాక్ డౌన్ కారణంగా చితికిపోయిన పేదలు, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్ని ఆదుకొనడమే ధ్యేయంగా మోదీ సర్కార్ మరో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని రూపొందించింది. బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత దానిని ప్రకటించే అవకాశమున్నట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి.

English summary
Prime Minister Narendra Modi on Monday said it was human nature for people to want to go home, in an apparent reference to migrant workers and others stranded by the lockdown,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X