వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశమే ఫస్ట్ భేష్ : అద్వానీ అభిప్రాయంతో ఏకీభవించిన మోదీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఎల్కే అద్వానీ బ్లాగులో రాసుకొన్న దేశం ఫస్ట్ తర్వాతే పార్టీ అనే నినాదాన్ని ప్రధాని మోదీ కొనియాడారు. చివరన సొంత ప్రయోజనాలు అని చెప్పి దేశం పట్ల తనకున్న విశ్వసనీయతను వెలిబుచ్చారని ప్రశంసించారు. బ్లాగులో అద్వానీ చెప్పిన అంశం నూటికి నూరుపాళ్లు నిజం, ఓ బీజేపీ కార్యకర్తగా గర్వపడుతున్నానని పేర్కొన్నారు. అద్వానీ లాంటి నేతలు బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు శాయశాక్తుల కృషిచేశారని పేర్కొన్నారు.

PM Modi praises LK Advanis blog

తొలిసారి స్పందించిన అద్వానీ ..

అద్వానీ ప్రాతినిధ్యం వహిస్తున్న గాంధీనగర్ నుంచి అమిత్ షా పోటీచేస్తున్న నేపథ్యంలో .. అద్వానీ తొలిసారి బ్లాగులో స్పందించారు. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బ్లాగులో అద్వానీ రాసిన సంగతి తెలిసిందే. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గతాన్ని ఓసారి మననం చేసుకొని, ముందుకుసాగాలని అద్వానీ పిలుపునిచ్చారు.

ఆత్మవలోకనం
ఇది బీజేపీ శ్రేణులకు ముఖ్యమైన రోజు, ఆత్మపరిశీలనతోపాటు గత జాపకాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచించాల్సిన రోజని పేర్కొన్నారు. బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరిగా దేశ ప్రజలతోపాటు కోట్లాది మంది బీజేపీ శ్రేణులతో అభిప్రాయాలను పంచుకోవాలని భావిస్తున్నానని తెలిపారు. రాజకీయ జీవితంలో జన సంఘ్, బీజేపీతో ఏడు దశాబ్దాలుగా విడదీయలేని అనుబంధం ఉందని బ్లాగులో రాసుకొన్నారు అద్వానీ. తొలుత దేశం, తర్వాత పార్టీ, చివర సొంత ప్రయోజనాలు అనే స్పూర్తిదాయక సూత్రాన్ని జీవితంలో అన్ని పరిస్థితుల్లో పాటించానని అద్వానీ ఉద్ఘాటించారు. అలాగే రాజకీయంగా విభేదించేవారిని ఎప్పుడూ శత్రువులుగా చూడలేదని పేర్కొన్నారు.

English summary
Prime Minister Narendra Modi on veteran BJP leader LK Advani said, "Advani Ji perfectly sums up the true essence of BJP, most notably the guiding mantra of 'Nation First, Party Next, Self Last'. Proud to be a BJP karyakarta [BJP worker] and proud that great leaders like LK Advani ji have strengthened it."LK Advani's blog has the headline 'Nation first, party next, self last'. This is the first comment LK Advani has made after the BJP fielded party president Amit Shah from Gandhinagar, a Lok Sabha seat represented by Advani.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X