వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నకిలీ అకౌంట్ల దెబ్బకు వేల సంఖ్యలో ఫాలోవర్లను పోగొట్టుకున్న మోడీ,రాహుల్

|
Google Oneindia TeluguNews

ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ట్విటర్‌పై ఉన్న ఫాలోవర్లు సంఖ్య చాలా తగ్గిపోయిందని ప్రముఖ ఆంగ్లదినపత్రిక బిజినెస్ స్టాండర్డ్స్ ఓ నివేదికలో తెలిపింది. ఇందుకు కారణం మోడీ, రాహుల్ పేరుతో నకిలీ ప్రొఫైల్‌లు పెద్దసంఖ్యలో రావడమే అని ఆ పత్రిక తెలిపింది. ప్రధాని మోడీ దాదాపు లక్షమంది ఫాలోవర్లను కోల్పోగా... రాహుల్ గాంధీ 9వేల మంది ఫాలోవర్లను కోల్పోయారు.

ట్విట్టర్ అకౌంట్ తెరిచిన ప్రియాంక గాంధీ, గంటల్లో వేలాదిమంది ఫాలోవర్లు ట్విట్టర్ అకౌంట్ తెరిచిన ప్రియాంక గాంధీ, గంటల్లో వేలాదిమంది ఫాలోవర్లు

2014 ,2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో సోషల్ మీడియా ఎలాంటి పాత్ర పోషించిందనే దానిపై ఇంద్రప్రస్త ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశోధన చేసింది. ఇందులో భాగంగా 925 రాజకీయనాయకులకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించినట్లు రిపోర్ట్ వెల్లడించింది. ఇందులో ప్రధాన రాజకీయ పార్టీల యూజర్ అకౌంట్లు, ప్రముఖ రాజకీయనాయకుల అకౌంట్లను స్టడీ చేసింది. మోడీ, రాహుల్ గాంధీల తర్వాత కిరణ్ రిజిజూ, భూపేందర్ యాదవ్, అనురాగ్ ఠాకూర్ల ఫాలోవర్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయినట్లు పరిశోధనలో తేలింది.

PM Modi,Rahul lose thousands of Twitter followers after crackdown on fake profiles:report

2014 లెక్కలతో 2019ని ఇప్పుడే పోల్చడం సరికాదనే వాదన కూడా వినిపిస్తోంది. అప్పటికీ ఇప్పటికీ చూస్తే ట్విటర్‌లో రాజకీయనాయకుల సంఖ్య పెరిగిపోయింది. 925 మంది రాజకీయనాయకుల ట్విటర్ హ్యాండిల్‌ను స్టడీ చేస్తుండగా ఇప్పటికే 500 మంది అకౌంట్లు వెరిఫై అయినట్లు తెలిపారు ఐఐటీ ఢిల్లీ, హైదరాబాదులో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న పొన్నురంగం కుమార్ గురు. గతేడాది జూలైలో చేపట్టిన పరిశోధనలో మోడీ ఫాలోవర్ల సంఖ్య మూడులక్షలకు చేరుకోగా రాహుల్ గాంధీ 17వేల మంది ఫాలోవర్లను కోల్పోయినట్లు నివేదిక వెల్లడించింది.

English summary
Prime Minister Narendra Modi and Congress President Rahul Gandhi have lost thousands of followers on Twitter after the microblogging platform's severe action against fake profiles in November, Business Standard reported, citing a Twitter study.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X