వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రహస్యం బయటపెట్టిన మోదీ.. చర్మం కాంతివంతంగా మెరవడానికి కారణమదే.

|
Google Oneindia TeluguNews

తన చర్మం కాంతివంతంగా మెరవడం ఉండటం వెనుక రహస్యమేంటో ప్రధాని మోదీ బయటపెట్టారు. తాను బాగా కష్టపడుతానని, అందువల్ల శరీరం బాగా చెమట పడుతుందని.. ఆ సమయంలో ముఖాన్ని చెమటతోనే మసాజ్ చేస్తానని చెప్పారు. తద్వారా తన ముఖం కాంతివంతంగా మారుతుందన్నారు. చాలా రోజుల క్రితం ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం చెప్పినట్టు గుర్తుచేసుకున్నారు. రిపబ్లిక్ డే నేపథ్యంలో ఢిల్లీలో నిర్వహించిన సాహస బాలల అవార్డుల కార్యక్రమంలో మోదీ మాట్లాడారు.

ఈ సందర్భంగా చిన్నారులకు ఆయన పలు సలహాలు సూచనలు చేశారు. ప్రతీ చిన్నారి స్వేదం చిందించాలన్నారు. కనీసం రోజుకు నాలుగుసార్లు చెమట చిందించాలన్నారు. జీవితంలో ఎన్ని అవార్డులు పొందినా.. కష్టం పడి పనిచేయడం ఎప్పుడూ ఆపకూడదన్నారు. ఇక్కడ రెండు విషయాలున్నాయని.. కొంతమంది వ్యక్తులు తమ ప్రతిభకు తగ్గ అవార్డులు,గౌరవం పొందిన తర్వాత అహంకారిగా మారుతారని, పనిచేయడం మానేస్తారని అననారు. మరికొంతమంది మాత్రం ఎన్ని అవార్డులు పొందినా.. వాటిని ప్రోత్సహంగా స్వీకరించి మరింత ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి లేదా పనిచేయడానికి ప్రయత్నిస్తారన్నారు.

PM Modi Reveals Why His Skin Glows in children bravery awards program

అవార్డులు రాగానే ఇక సాధించాల్సింది ఏమీ లేదన్నట్టుగా భావించకూడదని, అవార్డులు జీవితానికి నాంది అని భావించాలని చిన్నారులకు మోదీ సూచించారు. అంతేకాదు, ఆ విధంగా ఇవాళ ఇక్కడ నేనో చట్టాన్ని పాస్ చేశానంటూ మోదీ జోక్ చేశారు. ఇంత చిన్న వయసులో మీరు అసామాన్య ప్రతిభ లేదా సాహసాలను ప్రదర్శించడం తనకు ఆశ్చర్యంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి పనులు చేసేందుకు ఇవి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. క్లిష్ట సందర్భాల్లో మీరు ధైర్య సాహసాలను ప్రదర్శించారని చిన్నారులను ఉద్దేశించి అన్నారు. అలాంటి వాటి గురించి విన్నప్పుడు తనకు కూడా స్ఫూర్తి,కొత్త శక్తి కలుగుతాయన్నారు.

కాగా,సాహస బాలల అవార్డు పొందినవారిలో మొత్తం 49 మంద చిన్నారులు ఉన్నారు. వీరిలో జమ్మూకశ్మీర్,అరుణాచల్ ప్రదేశ్,మణిపూర్ సహా ఆయా రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. కళలు,సంస్కృతీ,ఆవిష్కరణలు,సామాజిక సేవ,క్రీడలు,అకడమిక్స్ వంటి రంగాల్లో వీరికి సాహస బాలల అవార్డులు దక్కాయి.

English summary
Prime Minister Narendra Modi today shared the "secret of his radiance" with winners of children's bravery awards, in Delhi for the Republic Day parade. During a free-wheeling interaction with 49 recipients of the "Prime Minister National Children's Award 2020", PM Modi also gave them tips and life lessons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X