వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలో కరోనా పరిస్థితులపై మోదీ రివ్యూ మీటింగ్... కీలక సూచనలు,ఆదేశాలు...

|
Google Oneindia TeluguNews

దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం(జూలై 11) వర్చువల్ విధానంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో నెలకొన్న పరిస్థితులు, ఆయా రాష్ట్రాల సంసిద్ధత గురించి ప్రధాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక క్రమశిక్షణను పాటించాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించాల్సిన అవసరం ఉందన్నారు.

కరోనా నియంత్రణ చర్యలకు,ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిరంతర ప్రాధాన్యత ఇవ్వాలని... ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వద్దని మోదీ రాష్ట్రాలకు సూచించారు. ఢిల్లీలో కరోనా కట్టడికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు,స్థానిక అధికారులు తీసుకున్న చర్యలను మోదీ అభినందించారు. ఎన్‌సీఆర్ ప్రాంతంలో కోవిడ్ 19 నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ట్రాలు కూడా పాటించాల్సిన అవసరం ఉందన్నారు.

PM Modi review meeting over coronavirus situation in the country

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 'ధన్వంతరి రథ్' పేరుతో నిర్వహిస్తున్న మొబైల్ క్లినిక్‌ సేవలను కూడా మోదీ అభినందించారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇటువంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా టెస్టింగ్ పాజిటివిటీ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో జాతీయ స్థాయి పర్యవేక్షణ,మార్గదర్శకాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అమిత్ షా,హర్షవర్దన్,నీతి ఆయోగ్ సభ్యులు,కేబినెట్ సెక్రటరీ,సీనియర్ అధికారులు పాల్గొన్నారు. శనివారం(జూలై 11) రికార్డు స్థాయిలో ఒక్కరోజులోనే 27,114 కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో మోదీ ఈ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకూ భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 8లక్షల మార్క్‌ను దాటిన సంగతి తెలిసిందే. ఇందులో మహారాష్ట్ర,తమిళనాడు,ఢిల్లీ రాష్ట్రాల నుంచే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.

English summary
Prime Minister Narendra Modi on Saturday touched upon a host of issues while chairing a review meeting on Covid-19 pandemic preparations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X