వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నామినేషన్ వేసిన మోడీ డూప్ పాథక్, ఎమ్మెల్యేగా విజయంపై ధీమా, సీఎం అవుతానని..

|
Google Oneindia TeluguNews

బీహర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం మరింత హీటెక్కింది. ఈ నెల 28న ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే రెండో విడత కోసం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. డుప్ అభినానందన్ పాథక్ కూడా ఎన్నికల బరిలో నిలిచారు. ఈ మేరకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు.

ఈ-కామర్స్ సైట్ల పేరుతో దోపిడీ, వెలుగులోకి బీహర్ ముఠా నయా ఛీటింగ్ఈ-కామర్స్ సైట్ల పేరుతో దోపిడీ, వెలుగులోకి బీహర్ ముఠా నయా ఛీటింగ్

గోపాల్ గంజ్ జిల్లా హథువా నియోజకవర్గం నుంచి అభినానందన్ పోటీకి దిగారు. ఇక్కడినుంచి బీహర్ సామాజిక సంక్షేమ శాఖ మంత్రి రామ్ సేవక్ సింగ్ బరిలో దిగారు. వంజిత్ సమాజ్ పార్టీ నుంచి తాను బరిలోకి దిగానని అభినానందన్ తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ధనిక-పేద అభ్యర్థుల మధ్య పోటీ జరుగుతోందని ఆయన చెప్పారు.

హథువా నుంచి విజయం సాధిస్తే.. ముఖ్యమంత్రి అవుతానని విశ్వాసం వ్యక్తం చేశారు. తమ పార్టీ తరఫున తానే సీఎం క్యాండెట్ అని.. పార్టీ మెజార్టీ సీట్లలో విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. అచ్చం మోడీలా ఉన్న అభినానందన్ .. పోటీ చేయడమే కాదు గెలుస్తానని నమ్మకంతో ఉన్నారు. ఇక సీఎం అవుతానని కలలు కంటున్నారు.

ఇటు బీహర్‌లో బీజేపీ-జేడీయూ కూటమి కలిసి పోటీచేస్తోంది. ఎల్జీపీ ఒంటరిగా బరిలోకి దిగింది. రామ్ విలాస్ పాశ్వాన్ మృతి ఆ పార్టీకి తీరని లోటు.. మరి ఎన్నికలను చిరాగ్ ఎలా ఎదుర్కొని నిలబడతాడో చూడాలీ మరీ. నితీశ్ లక్ష్యంగా చిరాగ్ విమర్శలు చేయగా.. బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. తమ కూటమి కలిసి పోటీ చేస్తోందని అగ్ర నేతలు చెబుతున్నారు. దీంతో తన గుండెలో మోడీ ఉన్నాడని చిరాగ్ పాశ్వాన్ నెత్తి, నోరు బాదుకున్నా వినలేని పరిస్థితి నెలకొంది.

English summary
Prime Minister Narendra Modi’s doppelganger, Abhinanandan Pathak is all set to take the plunge into politics by contesting in Bihar elections 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X