వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐన్ స్టీన్ ఛాలెంజ్ చేస్తున్న మోడీ .. ఏమన్నారంటే

|
Google Oneindia TeluguNews

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఐన్ స్టీన్ చాలెంజ్ చేశారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలు భావితరాలకు గుర్తుండిపోయేలా చేసేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన చాలెంజ్ పై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అసలు ఇంతకీ ఐన్ స్టీన్ ఛాలెంజ్ ఏంటంటే ఒక సందర్భంలో ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త ఐన్ స్టీన్ భూమి మీద గాంధీ లాంటి వ్యక్తి జీవించి ఉండేవారంటే భావితరాలు నమ్మరని అభిప్రాయపడ్డారు. గాంధీ జయంతి సందర్భంగా ఇక ఈ విషయాన్ని ప్రస్తావించిన ప్రధాని నరేంద్ర మోడీ గాంధీజీ సిద్ధాంతాలను ముందుతరాల గుర్తుంచుకునేలా చేయడం ఎలా అన్నది ప్రస్తుతం మన ముందున్న పెద్ద సవాల్ అని ఆయన పేర్కొన్నారు.

ప్రపంచం వినింది..కానీ జైశంకర్ వినలేదు: ట్రంప్ గురించి మోడీ ఆ స్లోగన్ ఇవ్వలేదా ?ప్రపంచం వినింది..కానీ జైశంకర్ వినలేదు: ట్రంప్ గురించి మోడీ ఆ స్లోగన్ ఇవ్వలేదా ?

అందుకే గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని న్యూయార్క్ టైమ్స్ పత్రికకు రాసిన వ్యాసంలో పలు అంశాలను ప్రస్తావించిన ప్రధాని నరేంద్ర మోడీ ఐన్ స్టీన్ చాలెంజ్ చేశారు. గాంధీజీ అహింసా సిద్ధాంతం భారతదేశంలోనే కాక ప్రపంచ దేశాల్లోనూ స్ఫూర్తిదాయకంగా నిలిచిందని ఆయన తన వ్యాసంలో పేర్కొన్నారు. భారత్లో రూపుదిద్దుకున్న అహింసాసిద్ధాంతం అమెరికా వంటి దేశాలు లోనూ అనేక ఉద్యమాలకు దారి చూపిందని ఆయన పేర్కొన్నారు. గాంధీజీ అహింసాయుత పోరాటమే ఆఫ్రికా దేశానికి కొత్త ఆశలు చిగురింప చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి మహాత్మాగాంధీ ధైర్యం ఇస్తున్నారన్నారు.

PM Modis Einstein Challenge..

మానవ సమాజంలో ఉన్న భారీ వైరుధ్యాలకు వారధిగా గాంధీజీ సిద్ధాంతాలు పనిచేస్తాయని పేర్కొన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆయన సిద్ధాంతాన్ని జనాల్లోకి తీసుకువెళ్లడానికి ఆలోచనాపరులు, పారిశ్రామికవేత్తలు, ఐటి దిగ్గజాలు, సామాజిక కార్యకర్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇక దీనినే ఛాలెంజ్ గా ఆయన పేర్కొన్నారు. గాంధీ వంటి వాడు భూమ్మీద జీవించి ఉండేవాడు అంటే భావితరాలు నమ్మరని ఐన్ స్టీన్ చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకొని ఆయన సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చి గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని ఐన్ స్టీన్ ఛాలెంజ్ విసిరారు.

English summary
on the occasion of Gandhi's 150th birth anniversary Quoting Albert Einstein, PM Modi proposed the "Einstein Challenge" to ensure that ideals of the Mahatma are remembered by future generations."As a tribute to Gandhi, I propose what I call the Einstein Challenge... How do we ensure the ideals of Gandhi are remembered by future generations? I invite thinkers, entrepreneurs and tech leaders to be at the forefront of spreading Gandhi's ideas through innovation," .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X