• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
LIVE

ప్రధానితో ముగిసిన ఆల్‌పార్టీ మీటింగ్: డీలిమిటేషన్ నుంచి ఎన్నికల ప్రక్రియ వరకు చర్చ

|

ఢిల్లీ: ప్రధాని మోడీ నేతృత్వంలో గురువారం ఆల్‌పార్టీ మీటింగ్ జరగుతుంది. ఇందుకోసం అన్ని ప్రధాన పార్టీలను ప్రధాని మోడీ ఆహ్వానించారు. ఇక జమ్మూ కశ్మీర్ నుంచి కూడా పలు పార్టీలను ఆహ్వానించడంతో గురువారం సమావేశంపై ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్దరించాలనే అంశంపై చర్చ జరిగే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే జమ్మూ కశ్మీర్‌కు చెందిన నేతలంతా ఢిల్లీకి పయనమయ్యారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలన్న అంశంపై ఎన్నో వ్యూహాత్మకమైన చర్చలు జరిగాయి. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కొనసాగించాలని సమావేశంలో ఒత్తిడి తీసుకొస్తామని మెహబూబా ముఫ్తీ చెప్పారు.

ఇక గురువారం ఢిల్లీలో అఖిలపక్ష పార్టీల సమావేశం నేపథ్యంలో ఇటు ఢిల్లీలోను అటు జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లోను గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సరిహద్దుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర బలగాలు మోహరించాయి. ఇక ఆల్‌పార్టీ మీటింగ్‌కు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

PM Modis Meeting With Jammu and Kashmir Leaders Live Updates in Telugu

Newest First Oldest First
8:07 PM, 24 Jun
ఆర్టికల్ 370 రద్దుపై జమ్మూ కశ్మీర్ విభజనపై ప్రజలు అసంతృప్తితోను ఆగ్రహంగాను ఉన్నారని రాజ్యాంగబద్దంగా అది జరగలేదని ప్రధాని దృష్టికి తీసుకొచ్చాను: పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ
8:04 PM, 24 Jun
ఈ రోజు సమావేశం చాలా సహృదభావ వాతావరణంలో జరిగింది. అన్ని పార్టీల నేతలు తమ అభిప్రాయాలను వివరించారు: హోంశాఖ మంత్రి అమిత్ షా
7:20 PM, 24 Jun
మూడు గంటలకు పైగా సమావేశం సాఫీగా సాగిందంటే సత్ఫలితాన్ని ఇస్తుందనే అర్థం చేసుకోవాలి: బీజేపీ నేత రాంమాధవ్
7:08 PM, 24 Jun
అందరి అభిప్రాయాలను ప్రధాని మోడీ కూలంకుశంగా విన్నారు
7:05 PM, 24 Jun
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఆర్టికల్ 370ని రద్దు చేయొచ్చు: ముజఫర్ బేగ్
7:05 PM, 24 Jun
ఆర్టికల్ 370 సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి:ఎన్సీ నేత ముజఫర్ బేగ్
7:05 PM, 24 Jun
ఆర్టికల్ 370 సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి:ఎన్సీ నేత ముజఫర్ బేగ్
7:04 PM, 24 Jun
హద్దులు పరిమితులపై కేంద్రం హామీ ఇవ్వాలి:గులాంనబీ ఆజాద్
7:01 PM, 24 Jun
ప్రజాస్వామ్య ప్రక్రియలోనే అన్ని జరిపేందుకు కట్టుబడి ఉన్నాం: ప్రధాని మోడీ
7:00 PM, 24 Jun
ప్రజాస్వామ్యంను బలపర్చడంపైనే ఈ సమావేశం ప్రధాన అజెండా: గులాంనబీ ఆజాద్
6:59 PM, 24 Jun
జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని కోరాం: గులాం నబీ ఆజాద్
6:59 PM, 24 Jun
ఆగష్టు 2019 తర్వాత అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని కోరాం: గులాం నబీ ఆజాద్
6:58 PM, 24 Jun
కశ్మీరీ పండిట్‌లకు పునరావాసం కల్పించాలని కోరాం: గులాం నబీ ఆజాద్
6:58 PM, 24 Jun
రాష్ట్ర హోదా పునురుద్ధరణ మొదటిది. రాష్ట్ర హోదా పునురుద్దరించేందుకు ఇదే మంచి సమయం : గులాం నబీ ఆజాద్
6:57 PM, 24 Jun
కేంద్రం ముందు కాంగ్రెస్ తరుపున నుంచి 5 డిమాండ్లు ముందుంచాం
6:54 PM, 24 Jun
కాంగ్రెస్ నుంచి సమావేశంలో ముగ్గురం పాల్గొన్నాం: గులాం నబీ ఆజాద్
6:53 PM, 24 Jun
మంచి నిర్ణయం వస్తుందని భావిస్తున్నాం: సజద్ లోన్
6:52 PM, 24 Jun
డీలిమిటేషన్‌కు ఇది రోడ్‌మ్యాప్ అని ప్రధాని అన్నారు: అల్తాఫ్ బుఖారీ
6:52 PM, 24 Jun
ప్రధాన మంత్రి మోడీ దాదాపు మూడున్నర గంటల పాటు తాము చెప్పిన విషయాలని విన్నారు.ప్రజల గొంతుకను సమావేశంలో వినిపించాం: అల్తాఫ్ బుఖారీ
6:51 PM, 24 Jun
అన్ని పార్టీలు తమ అభిప్రాయాలను ప్రధాని ముందు ఉంచాయి: అల్తాఫ్ బుఖారీ
6:49 PM, 24 Jun
జమ్మూ కశ్మీర్‌లో త్వరలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది: అల్తాఫ్ బుఖారీ
6:48 PM, 24 Jun
డీలిమిటేషన్ నుంచి ఎన్నికల ప్రక్రియ వరకు అన్ని విషయాలు చర్చించడం జరిగింది: అల్తాఫ్ బుఖారీ
6:47 PM, 24 Jun
మోడీతో సమావేశం చాలా సాఫీగా సాగింది. సహృదమైన వాతావరణంలో సమావేశం జరిగింది: అల్తాఫ్ బుఖారీ
6:46 PM, 24 Jun
జమ్మూ కశ్మీర్ అభివృద్ది గురించి చర్చించడం జరిగింది:ఎన్సీ నేత ముజఫర్ బేగ్
6:46 PM, 24 Jun
ప్రధాని మోడీ మా విన్నపాలను విన్నారు: ఎన్సీ నేత
6:44 PM, 24 Jun
దాదాపు మూడున్నర గంటల పాటు జరిగిన సమావేశం
6:43 PM, 24 Jun
ప్రధాని నివాసంలో ముగిసిన ఆల్‌పార్టీ సమావేశం
6:01 PM, 24 Jun
కశ్మీర్ రాష్ట్ర హోదా తీసివేయాల్సిన అవసరం ఏమొచ్చింది: మమతా బెనర్జీ
5:59 PM, 24 Jun
కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్న కశ్మీర్ నేతలు
5:13 PM, 24 Jun
ఆర్టికల్ 370 రద్దు చేయడంతో దేశం ఇమేజ్ మసకబారిపోయింది: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
READ MORE

English summary
Live Updates from PM Narendra Modi's all-party meeting with Jammu and Kashmir leaders in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X