వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓఎల్ ఎక్స్ లో అమ్మకానికి ప్రధాని మోడీ కార్యాలయం ... రేటు రూ .7.5 కోట్లు .. నలుగురు నిందితుల అరెస్ట్

|
Google Oneindia TeluguNews

ఓఎల్ఎక్స్ .. ఏవైనా సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మకాలు, కొనుగోలు సాగించే డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ ఫామ్. ఇక అటువంటి మార్కెటింగ్ ప్లాట్ ఫాం లో ఏకంగా ప్రధాని మోడీ కార్యాలయాన్నే అమ్మకానికి పెట్టారు కొందరు ప్రబుద్ధులు . పోలీసులకు అడ్డంగా దొరికి ఇప్పుడు కటకటాలపాలయ్యారు .

కరోనాను వదలని కరెప్షన్ కింగ్స్ .. కేంద్రానికి 40వేల దాకా ఫిర్యాదులు , నివేదిక కోరిన మోడీ !!కరోనాను వదలని కరెప్షన్ కింగ్స్ .. కేంద్రానికి 40వేల దాకా ఫిర్యాదులు , నివేదిక కోరిన మోడీ !!

క్లాసిఫైడ్స్ వెబ్‌సైట్ ఓఎల్ఎక్స్ లో ప్రధాని మోడీ కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టిన ఘనులు

క్లాసిఫైడ్స్ వెబ్‌సైట్ ఓఎల్ఎక్స్ లో ప్రధాని మోడీ కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టిన ఘనులు

క్లాసిఫైడ్స్ వెబ్‌సైట్ ఓఎల్ఎక్స్ లో ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టిన ప్రకటన అందరినీ షాక్ కి గురి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క వారణాసి కార్యాలయాన్ని రూ .7.5 కోట్ల ధరకు గుర్తు తెలియని అగంతకులు అమ్మకానికి పెట్టారు. పోలీసులకు ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టడం పై ఫిర్యాదు అందడంతో వారణాసి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆన్లైన్ ప్రకటనల వెబ్‌సైట్ ప్రకటన చూసిన పోలీసులు ఖంగు తిన్నారు .

 7 కోట్ల 50 లక్షల రూపాయలకు అమ్మకానికి.. ఫోటోలు పెట్టి మరీ ప్రకటన

7 కోట్ల 50 లక్షల రూపాయలకు అమ్మకానికి.. ఫోటోలు పెట్టి మరీ ప్రకటన

అగంతకులు వారణాసిలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయాన్ని అమ్ముతున్నట్లుగా మోదీ కార్యాలయ వివరాలు ఫోటోలను ప్రచురిస్తూ, దానిని ఒక విల్లా గా జాబితా చేశారు . 4 గదులు , 4 బాత్రూమ్‌లతో 6,500 చదరపు అడుగుల కార్పెట్ విస్తీర్ణంతో విల్లాగా 7 కోట్ల 50 లక్షల రూపాయలకు అమ్మకానికి పెట్టిన ప్రకటనను చూసిన పోలీసులు వెంటనే ఆ ప్రకటన తొలగించి, ఓఎల్ఎక్స్ లో పోస్ట్ పెట్టిన నలుగురిని పట్టుకున్నారు . ఓఎల్ఎక్స్ ప్రకటనలో ఈ భవనానికి సంబంధించిన విక్రేత గా లక్ష్మీకాంత్ ఓజా అనే వ్యక్తి పేరు ఇచ్చారు. అతని ఐడీ ద్వారా మోడీ కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టిన నలుగురిని అరెస్టు చేశారు వారణాసి పోలీసులు.

 భేలుపూర్‌లోని జవహర్ నగర్ కాలనీలోని కార్యాలయం ఫోటోలు ఓఎల్ఎక్స్ లో పెట్టిన నలుగురు అరెస్ట్ ..

భేలుపూర్‌లోని జవహర్ నగర్ కాలనీలోని కార్యాలయం ఫోటోలు ఓఎల్ఎక్స్ లో పెట్టిన నలుగురు అరెస్ట్ ..

అరెస్టయినవారు భేలుపూర్‌లోని జవహర్ నగర్ కాలనీలోని ప్రధానమంత్రి కార్యాలయం యొక్క ఛాయాచిత్రాలను క్లిక్ చేసి, ఆ ప్రకటనను ఓఎల్ఎక్స్ లో పోస్ట్ చేసినట్లు వారణాసి ఎస్‌ఎస్‌పి అమిత్ కుమార్ పథక్ తెలియజేశారు. నిందితులను ప్రశ్నిస్తున్నామని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. వారణాసి నుండి ప్రజా ప్రతినిధిగా ఎన్నిక కాబడిన ప్రధాని నరేంద్ర మోడీకి భేలూపూర్ లోని జవహర్ నగర్ కాలనీలో పార్లమెంటరీ కార్యాలయం ఉంది. దీనిని ఆగస్టు 2014 లో హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు.

గతంలో ఓఎల్ ఎక్స్ లో భారత యుద్ధ విమానం మిగ్ 23 కూడా ..

గతంలో ఓఎల్ ఎక్స్ లో భారత యుద్ధ విమానం మిగ్ 23 కూడా ..

ఇప్పుడు ఆ కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టడం అందరినీ షాక్ కి గురి చేసింది. గతంలో కూడా కొందరు అగంతకులు భారతదేశ యుద్ధ విమానాన్ని ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టటం హాట్ టాపిక్ అయింది. అలీగఢ్ ముస్లింవర్సిటీలో ప్రదర్శనకు ఉన్న మిగ్- 23 యుద్ధ విమానాన్ని అమ్ముతామని ఓఎల్ఎక్స్ లో పెట్టేశారు. దాని ధర 9.99 కోట్ల రూపాయలని అందులో పేర్కొన్నారు. ఇప్పుడు ఏకంగా ప్రధాని కార్యాలయాన్నే అమ్మేస్తామని ఓఎల్ ఎక్స్ లో పెట్టారు .

English summary
An advertisement on classifieds website OLX put up Prime Minister Narendra Modi’s Varanasi office on sale at a price of Rs 7.5 crore with details and photos of the establishment. Police have now brought down the ad and lodged an FIR. 4 accused arrest . The OLX ad has listed PM Modi’s Parliamentary office in Varanasi as a villa with 4 rooms and 4 bathrooms with a carpet area of 6,500 sqft.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X