వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్వే: మోడీని మించిన లీడర్ లేరు, ఎన్నికలు వస్తే బిజెపిదే గెలుపు

ప్రధాని నరేంద్ర మోడీ హవా ఇంకా తగ్గలేదు. ఇండియా టుడే చేసిన 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఇప్పటికీ భారత్‌లో అత్యంత ప్రాచుర్యం కలిగిన నేత మోడీనే అని సర్వేలో తేలింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ హవా ఇంకా తగ్గలేదు. ఇండియా టుడే చేసిన 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఇప్పటికీ భారత్‌లో అత్యంత ప్రాచుర్యం కలిగిన నేత మోడీనే అని సర్వేలో తేలింది.

చదవండి: నోట్ల రద్దు తర్వాత మోడీ హవా: ఎన్నికలొస్తే 360 సీట్లు

ఇప్పుడు ఎన్నికలు వస్తే ఎన్డీయేకు 349 లోకసభ స్థానాలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ 47 సీట్లకు మించదని సర్వేలో తేలింది. ఇండియా టుడే గ్రూప్ కార్వీ.. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో పోల్ నిర్వహించింది.

ఎన్డీయేకు 349 సీట్లు

ఎన్డీయేకు 349 సీట్లు

ఇప్పుడు ఎన్నికలు వస్తే ఎన్డీయేకు 349 సీట్లు వస్తాయి. 2017 జనవరిలో చేసిన సర్వే కంటే 11 తక్కువ సీట్లు వస్తాయని తాజా సర్వేలో తేలింది. మొత్తానికి ఎన్డీయే 300కు పైగా స్థానాలను గెలుచుకోనుంది.

ప్రధానిగా మోడీకి ఎక్కువ మంది మద్దతు పలికారు. మోడీ పాపులారిటీ రోజు రోజుకు పెరుగుతోంది. 2014 ఆగస్టులో మోడీ కంటే ఇందిరా గాంధీ పాపులారిటీలో 12 పాయింట్ల ముందుండగా, ఇప్పుడు మోడీనే ఆమె కంటే 16 పాయింట్లు ముందున్నారు.

దక్షిణాదిన పాపులారిటీ తక్కువ

దక్షిణాదిన పాపులారిటీ తక్కువ

ప్రధాని నరేంద్ర మోడీకి దక్షిణాదిన పాపులారిటీ చాలా తక్కువగా ఉంది. సర్వేలో పాల్గొన్న వారిలో 63 శాతం మంది మోడీ పాలన బాగుందని, చాలా చాలా బాగుందని చెప్పారు. కానీ ఇటీవల జనవరిలో చేసిన సర్వేలో కంటే మాత్రం 6 శాతం తగ్గింది. గ్రామీణ భారతంలో కంటే పట్టణ భారతంలో ప్రధాని మోడీకి పాపులారిటీ ఎక్కువ.

నోట్ల రద్దుతో

నోట్ల రద్దుతో

నోట్ల రద్దు వల్ల జరిగిన లాభం కంటే దాని వల్ల ఇబ్బందులే ఎక్కువగా వచ్చాయని చాలామంది అభిప్రాయపడ్డారు. చిన్న చిన్న వ్యాపారులు, రైతులపై ప్రభావం చూపడంతో పాటు కొందరి ఉద్యోగాలు కూడా పోయాయి.

మోడీ ప్రభుత్వం సాధించిన విజయాల్లో నల్లధనం అణిచివేతకు తీసుకున్న చర్యలు, కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్, నోట్ల రద్దు, స్వచ్ఛ భారత్, సర్జికల్ స్ట్రయిక్స్, జిఎస్టీ తదితరాలు ఉన్నాయని చెప్పారు.

తగ్గుతున్న రాహుల్ గాంధీ ప్రతిష్ట

తగ్గుతున్న రాహుల్ గాంధీ ప్రతిష్ట

కాంగ్రెస్ పార్టీ ఉఫాధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రతిష్ట క్రమంగా తగ్గుతోందని సర్వేలో తేలింది. ప్రధానిగా రాహుల్‌కు 25 శాతం మంది ఓటేశారు. గతంలో కంటే ఇది ఐదు శాతం తక్కువ. కాంగ్రెస్ పార్టీని ఎవరు కాపాడగరనే ప్రశ్నకు.. 43 శాతం మంది సమాధానం చెబుతూ.. కాంగ్రెస్‌లోని వ్యక్తే, కానీ గాంధీ కుటుంబంలోని వ్యక్తి కాకుండా ఉండాలని, అలాంటి వారు కాపాడగలరని పేర్కొన్నారు.

మమతా బెనర్జీ, నితీష్ కుమార్‌లు బెస్ట్ సీఎంలు

మమతా బెనర్జీ, నితీష్ కుమార్‌లు బెస్ట్ సీఎంలు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌లు బెస్ట్ సీఎంల వరుసలో ముందున్నారు.

English summary
Prime Minister Narendra Modi has proven he is still the tallest leader in India, according to the Mood of the Nation (MOTN) survey. If elections were to be held today the ruling NDA will bag 349 seats. Congress is not expected to cross 47 seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X