ప్రధాని మోడీకి సెక్యూరిటీ వైఫల్యం: పంజాబ్ డీజీపీ, ఎస్ఎస్పీ సహా అధికారులు విచారణ
న్యూఢిల్లీ: పంజాబ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీకి భద్రతా వైఫల్యం కేంద్ర హోంశాఖ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ భద్రతా లోపంపై బటిండాకు ఎస్ఎస్పీ కేంద్ర హోంమంత్రిత్వశాఖ షోకాజ్ నోటీసు పంపింది. బటిండా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో కేంద్ర హోంమంత్రిత్వశాఖ విచారించింది.
ప్రధానమంత్రికి ఎస్కార్ట్‌గా ఉన్న కాన్వాయ్‌లో ఎక్కువగా బటిండా నుంచి పంజాబ్ పోలీసుల ఎస్కార్ట్ వాహనాలు ఉన్నాయి. పోలీసులు నేరుగా ఎస్పీజీకి వెళ్లే మార్గం గురించిన సమాచారాన్ని పంచుకున్నారు.

పంజాబ్ డీజీపీ, అధికారులను కేంద్ర హోంమంత్రిత్వశాఖ బృందం విచారణ
ఢిల్లీకి బయలుదేరే ముందు, ఫిరోజ్‌పూర్‌కు వెళ్లిన కేంద్ర హోంమంత్రిత్వశాఖ బృందం.. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న పంజాబ్ డీజీపీతో సహా అధికారులందరినీ విచారించింది.
ఫిరోజ్‌పూర్ కంట్రోల్ రూమ్‌లో వీఐపీ డ్యూటీని పర్యవేక్షిస్తున్న అధికారిని కూడా కేంద్ర హోంమంత్రిత్వశాఖ బృందం ప్రశ్నించింది.
కేంద్ర హోంమంత్రిత్వశాఖ బృందం నాలుగు జిల్లాల ఎస్ఎస్పీ, డ్యూటీ మేజిస్ట్రేట్, డిప్యూటీ కమిషనర్ ఏడీజీపీ, ఇద్దరు ఐజీలు, ఒక డీఐజీని కూడా ప్రశ్నించింది.(
ఫిరోజ్‌పూర్ పీఎస్‌లో 150 మంది గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు
ప్రధాని మోదీ కాన్వాయ్‌ను అడ్డుకున్నందుకు సంబంధించి ఫిరోజ్‌పూర్ పోలీస్ స్టేషన్ కుల్గర్హిలో 150 మంది నిరసనకారులపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
జనవరి 6న IPC సెక్షన్ 283 IPC (ప్రజా మార్గం లేదా నావిగేషన్ లైన్లో ప్రమాదం లేదా అడ్డంకి) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పంజాబ్ ప్రభుత్వం కేంద్రానికి తన నివేదికలో తెలిపింది.
పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ వద్ద ఫ్లైఓవర్‌పై కొందరు నిరసనకారులు అడ్డుకోవడంతో ప్రధాని మోడీ సుమారు 20 నిమిషాల పాటు ఇరుక్కుపోవడంతో పెద్ద రాజకీయ దుమారం చెలరేగిన విషయం విధితమే. ఈ ఘటనను భద్రతలో "పెద్ద లోపం" అని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.