వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘ఇండియా’కు బర్త్‌డే విషెస్: జాంటీ రోడ్స్‌ను సర్‌ప్రైజ్ చేసిన మోడీ

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ కూతురు ‘ఇండియా జియాన్నే’ పుట్టిన రోజున ఆమెకు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చాయి. ఆదివారం ‘ఇండియా’ తన రెండో పుట్టినరోజు జరుపుకుంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ కూతురు 'ఇండియా జియాన్నే' పుట్టిన రోజున ఆమెకు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చాయి. ఆదివారం 'ఇండియా' తన రెండో పుట్టినరోజు జరుపుకుంది. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ ఆ పాపకు మొత్తం భారతదేశం తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం విశేషం.

ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్‌ ద్వారా 'హ్యాపీ బర్త్‌డే ఇండియా ఫ్రమ్‌ ఇండియా' అని శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఇండియాకి ఏకంగా 1.2 బిలియన్‌ మంది సోషల్‌మీడియా ద్వారాపుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినట్లయింది. కాగా, తన కూతురు జన్మదినం సందర్భంగా జాంటీ రోడ్స్ ఒక ఫొటోను కూడా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

PM Modi’s ‘special’ birthday wishes to Jonty Rhodes' ‘India’

కాగా, ప్రధాని మోడీ 120కోట్ల మంది భారతీయుల తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలపడంతో జాంటీ రోడ్స్ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. మోడీ ట్వీట్ చేసిన 12గంటల్లోనే దాదాపు 6300సార్లకుపైగా ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేయడం గమనార్హం. ఈ సందర్భంగా మోడీకి.. రోడ్స్ ధన్యవాదాలు తెలిపారు.

జాంటీ సొంత ప్రాంతం దక్షిణ ఆఫ్రికానే అయినా అతనికి మన భారత సంస్కృతి సంప్రదాయాలన్నా ఎంతో ఇష్టం. అందుకే తన కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా జాంటీ ఇండియా పేరిట హోమం కూడా జరిపించాడు.

2015లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్ వ్యవహరిస్తున్న సమయంలోనే ఏప్రిల్ 23న ఇండియా ముంబైలో పుట్టింది. దీంతో జాంటీ మన భారతదేశంపై ఇష్టంతో కుమార్తెకు ఇండియా జియాన్నే అని పేరుపెట్టాడు.

English summary
Now, if you are wondering why Prime Minister Narendra Modi is wishing India on her 'birthday', as Independence Day is still a few months away, then hold on for a few seconds before you jump into any conclusions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X