భారత్ లో పదేళ్లలో 6జీ సేవలు-పని మొదలుపెట్టిన టాస్క్ ఫోర్స్- ప్రధాని మోడీ వెల్లడి
భారత్ లో ఇప్పటికే 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. త్వరలో 6జీ సేవల్ని కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు జరుగుతున్న ప్రయత్నాల్ని ప్రధాని మోడీ ఇవాళ జరిగిన ట్రాయ్ సమావేశంలో వెల్లడించారు. భారత్ వచ్చే పదేళ్లలో 6జీ సేవల్ని ప్రారంభించేందుకు సంసిద్ధంగా ఉండాలన్నారు.
రానున్న దశాబ్దంన్నర కాలంలో భారత ఆర్థిక వ్యవస్థకు 5జీ టెక్నాలజీ 450 బిలియన్ డాలర్లను అందించనుందని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ వెల్లడించారు. వచ్చే పదేళ్లలో 6జీ సేవలను ప్రారంభించేందుకు భారత్ సిద్ధంగా ఉండాలని, ఇందుకోసం ఇప్పటికే టాస్క్‌ఫోర్స్ తన పనిని ప్రారంభించిందని చెప్పారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు.
"భారత ఆర్థిక వ్యవస్థకు 5G సాంకేతిక పరిజ్ఢానం 450 బిలియన్ డాలర్లను అందించనుందని, కేవలం ఇంటర్నెట్ వేగమే కాదు, 5G ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన వేగాన్ని కూడా పెంచుతుందన్నారు. ఈ దశాబ్దం చివరి నాటికి, మనం 6G సేవలను ప్రారంభించగలమని , టాస్క్‌ఫోర్స్ దానిపై పని చేయడం ప్రారంభించిందని మోడీ తెలిపారు.

2G యుగం అవినీతి విధానాలతో మసకబారిందని మోడీ అన్నారు. 2G యుగం అవినీతి, విధాన పక్షవాతంతో విమర్శల పాలైందని, దేశం పారదర్శకంగా 4Gకి, ఇప్పుడు 5Gకి మారిందని మోడీ తెలిపారు. భారతదేశంలో మొబైల్ తయారీ యూనిట్లు 2 నుండి 200కి పైగా విస్తరించాయని, దేశం ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ తయారీ కేంద్రంగా ఉందని ఆయన తెలిపారు.
ఐఐటి మద్రాస్ నేతృత్వంలోని మొత్తం ఎనిమిది ఇన్స్టిట్యూట్లు బహుళ-ఇనిస్టిట్యూట్ సహకార ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేసిన స్వదేశీ 5G టెస్ట్ బెడ్‌ను కూడా ప్రధాని మోడీ ఇవాళ ప్రారంభించారు. టెస్ట్ బెడ్‌ను టెలికాం పరిశ్రమ, స్టార్టప్‌లు, పరిశోధకులు 5Gలో తమ ప్రోటోటైప్లను నిర్ధారించడానికి వాడుకోవచ్చు.