• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మనందరి ఫోన్లలో మోదీ ఆయుధం -పెగాసస్ నిఘా కుట్రపై రాహుల్ సంచలనం -కేంద్రంపై 14 పార్టీల పోరు

|

బీజేపీ మంత్రులు సహా విపక్ష నేతలు, న్యాయ, మీడియా రంగాలకు చెందిన ప్రముఖుల మొబైల్ ఫోన్లపై కేంద్ర ప్రభుత్వమే నిఘా ఉంచిందన్న పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. పెగాసస్ స్పైవేర్ అంశంపై పార్లమెంటులో చర్చ జరగాల్సిందేనని విపక్షాలు పట్టు పడుతున్నాయి. బుధవారం ఢిల్లీలో 14 విపక్ష పార్టీలు సమావేశమై, పెగాసస్ పై పోరును ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు..

జగన్ వేడుకున్నా వినని ప్రధాని మోదీ -మరో లేఖాస్త్రం -ఏపీలో 3వ వేవ్ భయాలు -కరోనాపై సీఎం కీలక ఆదేశాలుజగన్ వేడుకున్నా వినని ప్రధాని మోదీ -మరో లేఖాస్త్రం -ఏపీలో 3వ వేవ్ భయాలు -కరోనాపై సీఎం కీలక ఆదేశాలు

ఉగ్రవాదులను, ఉగ్ర చర్యలను నిరోధించడానికి ఉపయోగించే పెగాసస్‌ స్పైవేర్‌ను మోదీ సర్కారు ఇప్పుడు సాధారణ ప్రజలందరి మొబైల్ ఫోన్లలోకి కూడా జొప్పించిందని, ఈ అంశంపై పార్లమెంటులో చర్చ చేపట్టకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. పెగాసస్‌ స్పైవేర్ తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై బుధవారం నాడు రాహుల్‌ నేతృత్వంలో 14 పార్టీలకు చెందిన విపక్ష నేతలు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయనీ కామెంట్లు చేశారు.

pm modi sent a weapon in your phone, Hit Soul Of Democracy by Pegasus: Rahul Gandhi

''పెగాసస్‌ స్పైవేర్‌ను ఉగ్రవాదులకు వ్యతిరేకంగా వాడాలి. కానీ నరేంద్ర మోదీజీ ఈ ఆయుధాన్ని మన ఫోన్లలోకి పంపించారు. నా ఫోన్‌తో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి, అనేక మంది ప్రముఖ రాజకీయ నేతలు, మీడియా వ్యక్తుల ఫోన్లను హ్యాక్‌ చేశారు. మేం ప్రభుత్వాన్ని అడిగేది ఒక్కటే.. పెగాసస్‌ను కొనుగోలు చేశారా?.. ప్రజాస్వామ్య వ్యవస్థలపై ఉపయోగించారా? పెగాసస్‌.. నా వ్యక్తిగత అంశం కాదు.. దేశ భద్రతకు సంబంధించిన విషయం. దీనిపై కేంద్రం జవాబు చెప్పి తీరాలి. ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను సజావుగా సాగనివ్వడం లేదని కేంద్రం చెబుతోంది. కానీ మేం పార్లమెంట్‌ను అడ్డుకోవడం లేదు. కేవలం మా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం. భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగించిన ఈ ఆయుధం(పెగాసస్‌)పై చర్చ జరగాల్సిందే'' అని రాహుల్ పేర్కొన్నారు. ఇక,

జగన్ బెయిల్ రద్దుకు సీబీఐ సిఫార్సు చేసింది: ఎంపీ రఘురామ క్లెయిమ్, సజ్జలపై తీవ్ర అవినీతి ఆరోపణలుజగన్ బెయిల్ రద్దుకు సీబీఐ సిఫార్సు చేసింది: ఎంపీ రఘురామ క్లెయిమ్, సజ్జలపై తీవ్ర అవినీతి ఆరోపణలు

కాంగ్రెస్ సహా 14 పార్టీలు పెగాసస్ పై పోరును తీవ్రతరం చేయాలని నిర్ణయించుకున్నాయి. రాహుల్ తర్వాత శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ మీడియాతో మాట్లాడుతూ.. దేశ భద్రత, సాగు చట్టాలకు సంబంధించిన అంశాలపై ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోరాడతాయని తెలిపారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే మాట్లాడుతూ.. ''పార్లమెంట్‌ను నడపాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ పెగాసస్‌పై చర్చ చేపట్టకుండా కేంద్రం తప్పుకుంటోంది'' అని విమర్శించారు.

English summary
The Prime Minister "inserted a weapon in our phones", used it to "hit the soul of India's democracy" and now the government is trying to silence opposition demands for a discussion in Parliament, Congress MP Rahul Gandhi said Wednesday. Mr Gandhi was addressing reporters after a meeting of 14 opposition parties - a meeting to chalk out a strategy to take on the government over the Pegasus phone-hacking scandal, which has triggered protests in, and forced repeated adjournments of, the monsoon session of Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X