వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ జ్యోతి ప్రజ్వలన.. సంస్కృత శ్లోకంతో ఫోటోలు షేర్ చేసిన ప్రధాని

|
Google Oneindia TeluguNews

కరోనాపై పోరులో మరోసారి యావత్ భారతం జాగృతమైంది. దేశ సమైక్యతను,సంఘీభావాన్ని చాటిచెప్పేందుకు దీప కాంతులు,టార్చి లైట్లను వెలిగించింది. సరిగ్గా ఆదివారం రాత్రి 9గంటలకు 9 నిమిషాల పాటు దేశ ప్రజలంతా ఇంటి ముందు వాకిళ్లల్లో,బాల్కనీల్లో దీపాలను వెలిగించారు. ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆ ఫోటోలను ట్విట్టర్‌లో పంచుకున్న మోదీ.. ఓ సంస్కృత శ్లోకాన్ని కూడా జతచేశారు. 'దేశం ఆయురారోగ్యాలతో,సుఖ సంపదలతో విరాజిల్లాలి. శత్రు బుద్ది వినాశనం జరగాలి' అని ఆ శ్లోకం ద్వారా చెప్పారు.

Recommended Video

Light Lamps: Watch PM Modi lights diyas And BJP bigwigs illuminate diyas, candles

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం ప్రకటించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన నివాసంలో దీపాలను వెలిగించారు. ఆ ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేసిన ఆయన.. ఈ సంక్లిష్ట సమయంలో చీకటి నుంచి వెలుగు వైపు పయనించడానికి ఈ దీప కాంతులు ఒక నమ్మకాన్ని కల్పిస్తాయని పేర్కొన్నారు. ఇక సామాన్యులు మొదలు సినీ,రాజకీయ,పారిశ్రామిక ప్రముఖుల వరకు ప్రతీ ఒక్కరూ ఇందులో పాలుపంచుకున్నారు.

 PM Modi Shares Photos of His Lights Out Moment With Sanskrit Shloka

ఇదిలా ఉంటే,ఇప్పటివరకు దేశంలో 3588 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 99 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రాలవారీగా పరిశీలిస్తే.. మహారాష్ట్రలో అత్యధికంగా 748 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 571,ఢిల్లీలో 503,కేరళలో 314,ఉత్తరప్రదేశ్‌లో 278,తెలంగాణలో 272,రాజస్తాన్‌లో 254,ఆంధ్రప్రదేశ్‌లో 252 కేసులు నమోదయ్యాయి.

English summary
People across the country joined Prime Minister Narendra Modi's call to light up lamps on Sunday night in an effort to display the country's collective resolve to fight coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X