వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

6వసారి: మోడీ విక్టరీ సింబల్, బీజేపీ సంబరాలు: సోనియాతో రాహుల్ భేటీ

|
Google Oneindia TeluguNews

Recommended Video

Narendra Modi flashes victory sign : మోదీ విక్టరీ సైన్ !

న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి రెండు రాష్ట్రాల్లోనూ స్పష్టమైన మెజార్టీ రావడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

సోనియాకి అహ్మద్ పటేల్‌లా: రాహుల్ వెనకుండి నడిపించేది ఈయనే, 'కాంగ్రెస్ చాణక్యుడు'సోనియాకి అహ్మద్ పటేల్‌లా: రాహుల్ వెనకుండి నడిపించేది ఈయనే, 'కాంగ్రెస్ చాణక్యుడు'

ఢిల్లీ బీజేపీ కార్యాలయంతోపాటు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల కార్యాలయాల్లో బీజేపీ శ్రేణులు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని బీజేపీ శ్రేణులు కూడా ఈ సంబరాలను కొనసాగిస్తున్నాయి.

 విక్టరీ సింబల్ చూపుతూ..

విక్టరీ సింబల్ చూపుతూ..

కాగా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు దాదాపు ఖరారవడంతో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఉదయం11గంటల ప్రాంతంలో పార్లమెంటుకు చేరుకున్నారు. కారు దిగి విజయ చిహ్నం చూపుతూ లోనికి వెళ్లారు. కాగా, మోడీతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భేటీ అయ్యారు.

 6వ సారీ బీజేపీనే..

6వ సారీ బీజేపీనే..

కాగా, తాజా ఫలితాలతో గుజరాత్ రాష్ట్రంలో వరుసగా ఆరోసారి బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుండటం విశేషం. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు ఊహించిందనేని అన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని అన్నారు. ఈ గెలుపుతో ప్రధాని మోడీకి మరోసారి ప్రజలు తమ మద్దతును తెలియజేశారని అన్నారు.

 సోనియాతో రాహుల్ భేటీ.. ఫలితాలపై చర్చ

సోనియాతో రాహుల్ భేటీ.. ఫలితాలపై చర్చ

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఫలితాలు రాకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు కొంత నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. కాగా, సోమవారం ఫలితాలు వెలువడుతుండగానే.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన తల్లి, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. తాజా ఫలితాలపై వీరు చర్చించుకుంటున్నట్లు సమాచారం.

పోటీ ఇచ్చిన కాంగ్రెస్, అక్కడ మాత్రం

పోటీ ఇచ్చిన కాంగ్రెస్, అక్కడ మాత్రం

గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వచ్చినప్పటికీ కాంగ్రెస్ మాత్రం ఇంతకుముందు కంటే మెరుగైన స్థాయిలో పోటీ ఇవ్వడం గమనార్హం. ఒక సమయంలో నువ్వానేనా? అనే స్థాయికి కూడా చేరింది. కానీ, ఆ తర్వాత మళ్లీ బీజేపీ పుంజుకుంది. 182స్థానాలున్న గుజరాత్‌లో మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం కాంగ్రెస్ ఎలాంటి పోటీ ఇవ్వకపోవడం గమనార్హం. బీజేపీ ఇక్కడ సునాయాస విజయం సాధించిందనే చెప్పాలి.

English summary
PM Narendra Modi on Monday showed victory symbol after BJP leading in Gujarat and Himachal Pradesh assembly elections results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X