వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒబామాకు అరుదైన కానుక: 'మోడీనే బెస్ట్ లీడర్'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ ఆ దేశాధ్యక్షుడు బారక్ ఒబామాకు ఓ అరుదైన బహుమతిని ఇవ్వనున్నారు. ఈ నెల 28న ఒబామాను ప్రధాని మోడీ కలవనున్నారు. ఈ సందర్భంగా మోడీ సంతకం చేసిన భారత జాతీయ పతాకాన్ని ఒబామాకు అందివ్వనున్నారు.

మోడీ సంతకం చేసిన జాతీయ పతాకాన్ని ఫేమస్ చెఫ్ వికాస్ ఖన్నా చేతుల మీదగా అందజేయనున్నారు. అమెరికాలోని 47 ప్రముఖ కంపెనీల సీఈఓలతో సమావేశమై ప్రధాని మోడీ వారికి విందు ఇచ్చారు.

PM Modi Signs Flag to be Gifted to President Obama, Stirs Debate

ఈ విందులో కర్ణాటక తోటల నుంచి తెప్పించిన మేలు రకం గంధం, కాశ్మీర్ కుంకుమ పువ్వుల మేళవింపుతో తయారు చేసిన షర్బత్, పొమిగ్రనేట్ (దానిమ్మ) శాంగ్రియా కాక్ టైల్, తండూరీ పైనాపిల్, పనీర్ రవియోలీ, తాండై చికెన్, మిజోరాం బ్లాక్ రైస్ కిచడీ, షీర్ మాల్, మామిడి-అల్లం సూప్, కొబ్బరి అన్నం మెనూలో ఉన్నాయి.

వీటితో పాటు ఇడ్లీ, దోశ, ఊతప్పం వంటి పలు రకాల అల్పాహార వంటకాలు, వివిధ వెరైటీల స్వీట్స్‌లను విందులో పెట్టారు. ఈ విందులో ఉన్న అరుదైన వంటకాలను వికాస్ ఖన్నా ఆధ్వర్యంలో తయారుచేశారు. అయితే జాతీయ పతాకంపై మోడీ సంతకం చేయడం పతాక గౌరవానికి సంబంధించిన నియమాల ఉల్లంఘన కిందికి వస్తుందా? అనే విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ తలెత్తింది.

మరోవైపు అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోడీపై అంతర్జాతీయ మీడియా మొఘల్ రూపర్ట్ మర్డోక్ ప్రశంసలు కురిపించారు. మోడీ ఉత్తమ నాయకుడంటూ కొనియాడారు. భారత్‌లో మంచి పాలసీలను అమలు చేస్తున్నారంటూ మెచ్చుకున్నారు.

'భారత ప్రధాని నరేంద్ర మోడీని కలవడం చాలా ఆనందంగా ఉంది. భారత్‌కు స్వాతంత్ర్యం తర్వాత వచ్చిన నాయకుల్లో మోడీనే బెస్ట్. మంచి విధానాలతో ఆయన అత్యుత్తమ రాజకీయనాయకుడనిపించుకుంటున్నారు' అని రూపర్ట్ మర్డోక్ ట్వీట్ చేశారు. అమెరికా పర్యటనలో నరేంద్ర మోడీతో ఆయన భేటీ అయ్యారు.

English summary
Prime Minister Narendra Modi on Thursday signed an Indian flag to be gifted to US President Barack Obama.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X