వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈవీఎంలపై సందేహాలా ? ఈసీని ప్రశంసించాలే తప్ప అనుమానిస్తారా .. రాజ్యసభలో మోడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఈవీఎంల వినియోగం, ఓకే దేశం ఓకే ఎన్నికపై రాజ్యసభలో ప్రసంగించారు ప్రధాని నరేంద్ర మోడీ. 17వ లోక్‌సభ కొలువుదీరిన తర్వాత తొలిసారి రాజ్యసభలో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగానికి ఎగువసభలో ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఈవీఎంలు, ఒకే దేశం ఒకే ఎన్నికల గురించి సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈవీఎంల గురించి విపక్షాలు లేవనెత్తిన సందేహాలు సత్యదూరమని .. ఈసీ సమావేశానికి ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు.

సందేహం తీర్చుకొండి ..
ఎన్నికల ప్రక్రియ ముగిసాక కొన్ని పార్టీలు ఈవీఎంలపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. ఇది సరికాదన్నారు మోడీ. ఈవీఎంల గురించి ఉన్న సందేహాల తెలుపాలని ఎన్నికల సంఘం కోరితే కేవలం సీపీఐ, ఎన్సీపీ పార్టీల ప్రతినిధులు మాత్రమే పాల్గొన్నారని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని ఆ పార్టీలు కోరుకున్నాయని .. మిగతా పార్టీల వైఖరి అలా లేదన్నారు. సమస్యలను ఈసీ దృష్టికి తీసుకొచ్చాయని కితాబిచ్చారు మోడీ. మిగతా పార్టీలు తమ ప్రతినిధులను పంపకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కానీ వాటికి ఈవీఎంల గురించి అప్పుడు సమావేశానికి రారు కానీ .. ఎన్నికలయ్యాక అస్థిత్వాన్ని ప్రశ్నిస్తారని పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ఈవీఎంల ద్వారా చాలా ఎన్నికలు జరిగాయని మోడీ గుర్తుచేశారు. ఈవీఎంల ద్వారా విజయం సాధించిన ప్రతినిధులు .. రాజ్యసభకు కూడా సభ్యులను ఎన్నుకున్నారని గుర్తుచేశారు.

pm modi speak on evms

మెరుగైన ఎన్నికల ప్రక్రియ ...
గత కొన్నేళ్ల నుంచి ఎన్నికల ప్రక్రియ మెరుగైందని గుర్తుచేశారు. దీనిని మనం అభినందించాలే తప్ప .. అనుమానించకూడదని గుర్తుచేశారు. 1950లో ఎన్నికల ప్రక్రియ ముగిసేందుకు రోజులు పట్టేదని .. ఇప్పుడు ఒకరోజులో పోలింగ్ ముగుస్తోందని చెప్పారు. అంతేకాదు అప్పుడు పోలింగ్ కేంద్రాల్లో వివిధ అంశాలపై హింస కూడా ఎక్కువేనని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ మూలంగా పరిస్థితి మారిపోయిందని గుర్తుచేశారు. గతంలో తమ పార్టీకి ఇద్దరు ఎంపీలు ఉండేవారని .. కానీ తమ పార్టీ కోసం నేతలు, కార్యకర్తల కృషితో ఆ సంఖ్య 300 పైచిలుకు చేరిందని పేర్కొన్నారు.

English summary
Election Commission had invited parties on the issue of EVMs but just two parties accepted- CPI and NCP. I appreciate them for going to EC to learn more about the issue. But, why did the rest of the parties questioning the EVMs not even bother to go, they should answer
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X