భారత్ అమెరికాల మధ్య జరగనున్న వాణిజ్య సదస్సుపై ప్రధాని నరేంద్ర మోడీ ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో భారత్ అమెరికా దేశాలకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు కూడా పాల్గొన్నారు. వాణిజ్యరంగంలో భవిష్యత్తులో ఇరు దేశాలు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అదే సమయంలో వాణిజ్యం, పెట్టుబడులపై కూడా ప్రధాని మాట్లాడారు. అంతేకాదు కోవిడ్-19కు ముందు కోవిడ్-19కు తర్వాత పరిస్థితి ఎలా మారిందనే అంశంపై కూడా ప్రధాని మోడీ ఫోకస్ చేశారు.
ఇక విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా ఈ సమావేశంలో ప్రసంగించారు.ఇప్పటికే తను ప్రసంగించబోయేదానిపై ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. బుధవారం రాత్రి 9 గంటలకు తన ప్రసంగం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో, వర్జీనియా సెనేటర్, ఐక్యరాజ్యసమితికి అమెరికా మాజీ దౌత్యాధికారి నిక్కీ హేలీలు కూడా పాల్గొన్నారు. ఇక భారత్- అమెరికా వాణిజ్య సంబంధాలు, ప్రధాని ప్రసంగం పై మినిట్-టూ-మినిట్ హైలైట్స్
Newest FirstOldest First
9:18 PM, 22 Jul
ఈ కష్టసమాయన్ని అవకాశంగా మలుచుకోవాలని సూచించిన ప్రధాని మోడీ
9:17 PM, 22 Jul
కరోనావైరస్ కష్టాల నుంచి తేరుకుని అభివృద్ధి వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చిన ప్రధాని మోడీ
9:17 PM, 22 Jul
అమెరికా భారత్ దేశాలు వాణిజ్య పరంగా సహజ మిత్రులు: ప్రధాని మోడీ
9:16 PM, 22 Jul
కీలక రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా అమెరికా ఇన్వెస్టర్లకు ఆహ్వానం పలికిన ప్రధాని మోడీ
9:15 PM, 22 Jul
వైమానిక రంగంలో అద్భుతమైన అవకాశాలున్నాయి:ప్రధాని మోడీ
9:14 PM, 22 Jul
విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం: ప్రధాని మోడీ
9:13 PM, 22 Jul
డిఫెన్స్ అంతరిక్ష రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరిన ప్రధాని మోడీ
9:13 PM, 22 Jul
డిఫెన్స్ అంతరిక్ష రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరిన ప్రధాని మోడీ
9:10 PM, 22 Jul
మంచి భవిష్యత్తు కోసం ఇరు దేశాలు కలిసి పనిచేయాలి: ప్రధాని మోడీ
9:05 PM, 22 Jul
ఆర్థిక వ్యవస్థ బాగుండాలంటే సంస్కరణలు తీసుకురావాలి: ప్రధాని మోడీ
9:03 PM, 22 Jul
వృద్ధిలో పేద ప్రజల అజెండా ముందుండాలి: ప్రధాని మోడీ
9:02 PM, 22 Jul
ఈజ్ ఆఫ్ లివింగ్ ఈజ్ ఆఫ్ బిజినెస్‌తో సమానంగా ఉండాలి:ప్రధాని మోడీ
9:02 PM, 22 Jul
ప్రపంచం బంగారు భవిష్యత్తు కోసం ఎదురుచూస్తోంది. ఇందుకోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి: ప్రధాని మోడీ
9:01 PM, 22 Jul
అమెరికా భారత్ బిజినెస్ సమ్మిట్‌లో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు: ప్రధాని మోడీ
8:59 PM, 22 Jul
కాసేపట్లో ప్రసంగించనున్న ప్రధాని మోడీ
8:54 PM, 22 Jul
కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా విస్తృతం చేయాలని చూస్తున్నందున భారత్‌కు లాభం చేకూరుతుందని యుఎస్ఐబిసి అధ్యక్షుడు అన్నారు.
7:58 PM, 22 Jul
జీ 7 సమావేశాల్లో పాల్గొనాల్సిందిగా భారత ప్రధాని మోడీని ఆహ్వానించాం.ప్రపంచ శాంతికోసం పనిచేస్తాం: మైక్ పాంపియో
7:00 PM, 22 Jul
ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాంకింగ్ , స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా మంచి డివిడెండ్లు వస్తాయి: నితిన్ గడ్కరీ
6:58 PM, 22 Jul
భారత్ అతివేగంగా పుంజుకుంటున్న ఆర్థిక వ్యవస్థ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
4:47 PM, 22 Jul
కరోనావైరస్ తర్వాత ప్రపంచం వాణిజ్యపరంగా ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై చర్చ
4:44 PM, 22 Jul
అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు
4:43 PM, 22 Jul
విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ కూడా ఈ సదస్సులో ప్రసంగిస్తారు