వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్: జీ-7కు ఆహ్వానం, కీలక చర్చలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జీ-7 గ్రూపులో చేరాలంటూ ఆహ్వానించిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత ప్రధాని నరేంద్ర మోడీతో మంగళవారం ఫోన్‌లో మాట్లాడారు. జీ-7 సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోడీకి ట్రంప్ ఆహ్వానం పలికారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం కూడా ధృవీకరించింది.

Recommended Video

Donald Trump Invites PM Narendra Modi To G-7 Summit In U.S

అమెరికాలో జరిగే తదుపరి జీ-7 సదస్సుకు హాజరు కావాల్సిందిగా మోడీని ట్రంప్ కోరినట్లు తెలిపింది. అలాే ఇరు దేశాల్లో కరోనా పరిస్థితి, ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న అల్లర్లు, జీ-7 కూటమి సదస్సు, భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితులతోపాటుగా పలు కీలక అంశాలు ఇరువురు నేతల మధ్య చర్చకు వచ్చినట్లుగా పేర్కొంది.

 PM Modi speaks to Donald Trump on India’s inclusion in G-7

కాగా, ట్రంప్‌తో ఫోన్ సంభాషణపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా ట్వీట్ చేశారు. తన స్నేహితుడు ట్రంప్‌తో కీలక అంశాలపై చర్చించినట్లు మోడీ తెలిపారు. జీ-7 సదస్సు, కరోనా మహమ్మారి, ఇతర కీలక అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. భారత్-చైనా సరిహద్దులో పరిస్థితులు, ప్రపంచ ఆరోగ్య సంస్థలో సంస్కరణలు లాంటి అంశాలపైనా చర్చించారు.

కరోనా అనంతరం ప్రపంచ నిర్మాణంలో అమెరికా-భారత్ సంబంధాలు కీలకంగా మారనున్నాయన్నారు ప్రధాని మోడీ. కాగా, మంగళవారం ఫోన్ సంభాషణ సందర్భంగా అమెరికాలో జరగనున్న జీ-7 సమావేశానికి మోడీని ట్రంప్ ఆహ్వానించారు. ట్రంప్ ఆహ్వానానికి మోడీ ఓకే చెప్పినట్లు తెలిసింది.

ఇటీవల జీ-7 కూటమిని విస్తరించాలని ట్రంప్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. భారత్ సహా మరో మూడు దేశాల(రష్యా, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా)ను చేర్చి జీ-10 లేదా జీ-11 దేశాల కూటమిగా తీర్చిదిద్దాలని సూచించారు. జూన్‌లో నిర్వహించాల్సిన జీ-7 దేశాల సదస్సును సెప్టెంబర్‌కి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు జీ-7లో యూఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, కెనడా, జపాన్ దేశాలు ఉన్నాయి.

English summary
Prime Minister Narendra Modi Tuesday spoke to US President Donald Trump on the latter’s proposal to include India in the G-7 club of advanced economies. Trump has already extended an invitation to PM Modi to attend the next G-7 Summit that the US is hosting this time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X