వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎక్కడో ఎర్నాకుళంలో ఉండి... ఈశాన్య భారతం కోసం... విద్యార్థులపై మోదీ ప్రశంసలు...

|
Google Oneindia TeluguNews

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. శనివారం(అగస్టు 1) సాయంత్రం 4.30గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 'స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2020' గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో హ్యాకథాన్‌ని నిర్వహించడం సవాల్‌తో కూడుకున్నదే అన్నారు. అయినప్పటికీ ఆ సవాళ్లను అధిగమించి హ్యాకథాన్‌ని నిర్వహించడం అద్భుతమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పోటీని నిర్వహించడమే మీరు పరిష్కరించిన మొదటి సవాల్ అని నిర్వాహకులను మోదీ ప్రశంసించారు.

విద్యార్థులతో ముచ్చటించిన మోదీ...

విద్యార్థులతో ముచ్చటించిన మోదీ...


ఈ సందర్భంగా మోదీ విద్యార్థులతో ముచ్చటించారు. శాటిలైట్ సహాయంతో వర్ష సూచనను అంచనా వేసే నమూనా ఒకటి తయారుచేసే ప్రయత్నం జరుగుతోందని ఓ ఫైనలిస్ట్ పేర్కొన్నారు. దీనికి మోదీ ఆ ఫైనలిస్టును అభినందించారు. అలాంటి ఒక ప్రక్రియ అందుబాటులోకి వస్తే రైతులకు పెద్ద మేలు జరుగుతుందన్నారు.ప్రభుత్వం ప్రజలకు అందించే సదుపాయాలను మరింత ప్రభావవంతంగా,స్నేహపూర్వకంగా,పరస్పర సహకారంతో నిర్వహించడానికి ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ గొప్పగా ఉపయోగపడుతుందన్నారు. వరదల సమయంలో ఆనకట్టలు తెగకుండా శ్రీ కృష్ణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఓ పరిష్కార మార్గం కనిపెట్టినట్లుగా తన దృష్టికి వచ్చిందన్నారు. దానికి సంబంధించిన ట్రైనింగ్ మాడ్యుల్‌ను కూడా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

రీయూజ్ శానిటరీ నాప్కిన్స్‌పై...

రీయూజ్ శానిటరీ నాప్కిన్స్‌పై...

'ప్రస్తుతం ప్రభుత్వం కేవలం రూ.1కే శానిటర్స్ పాడ్స్ అందిస్తోంది. రీయూజ్ చేయదగిన శానిటరీ నాప్కిన్స్‌ను తీసుకురావడం ద్వారా మహిళలకు పెద్ద మేలు చేసినట్లవుతుంది. ఇలాంటి ఆలోచనను అమలులో పెట్టేందుకు పనిచేస్తున్న విద్యార్థిని నేను అభినందిస్తున్నాను.' అని ఓ విద్యార్థిని ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి బృందం మెడికల్ పరికరాల కోసం తాము తాము అభివృద్ది చేసిన వర్చువల్ అసిస్టెంట్ గురించి ప్రధాని మోదీకి వివరించారు. దేశంలోని అత్యంత వెనుకబడిన,మారుమూల ప్రాంతాలకు సహాయపడేలా డేటా-ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్‌లో ఆవిష్కరణల అవసరాన్ని ఈ సందర్భంగా ప్రధాని నొక్కి చెప్పారు.

ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్...

ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్...

ఎంఎల్ఆర్ఐటీకి చెందిన ఓ విద్యార్థి రియల్ టైమ్ ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ని అభివృద్ది చేసినట్లు ప్రధానికి వివరించారు. ఈ కొత్త టెక్నాలజీతో ముఖాన్ని ముసుగుతో కప్పుకున్నా సరే.. కళ్లను ఇది గుర్తుపడుతుందని చెప్పారు. కనెక్టివిటీ సమస్యలకు సంబంధించి ఓ విద్యార్థి సూచించిన పరిష్కారంపై ప్రధాని మోదీ బదులిస్తూ... ఎర్నాకుళంలో కూర్చుని ఈశాన్య రాష్ట్రాల ప్రజల సమస్యల కోసం మీరు ఆవిష్కరణలు,ఉత్పత్తులు అభివృద్ది చేస్తున్నారని కేరళ విద్యార్థులను ఉద్దేశించి అభిప్రాయపడ్డారు. ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ నినాదానికి ఇది బలం చేకూరుస్తుందన్నారు.

ప్రజలతో మమేకమైతేనే యూజర్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్...

ప్రజలతో మమేకమైతేనే యూజర్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్...


ఎంఎల్ఆర్ ఇనిస్టిట్యూట్‌కి చెందని ఓ విద్యార్థి పోలీసులకు ఉపయోగపడే ఓ ప్రొడక్ట్‌ను రూపొందించినట్లు ప్రధాని మోదీకి వివరించారు. దీనిపై మోదీ స్పందిస్తూ... ఐపీఎస్‌ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌ను నిన్ను సంప్రదించాల్సిందిగా కోరుతానని చెప్పారు. అక్కడ నీవు నీ ప్రజెంటేషన్‌ని ఇవ్వవచ్చునన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమవడం ద్వారానే యూజర్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ తయారుచేయగలుగుతామని... కాబట్టి విద్యార్థులు ఆ దిశగా ఆలోచించాలని సూచించారు.

Recommended Video

Ayodhya Ram Temple Groundbreaking : అమెరికాలోని ప్రఖ్యాత Times Square లో 3D లో రామాలయ నమూనా!
హ్యాకథాన్ 2020..

హ్యాకథాన్ 2020..

విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందించేందుకు 2017 నుంచి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌ను నిర్వహిస్తున్నారు.తొలి ఏడాది ఈ కార్యక్రమంలో 42వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. 2019లో 2లక్షల మంది విద్యార్థులు పాల్గొనగా.. ఈసారి తొలి రౌండ్‌కే 4.5లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రాండ్ ఫినాలేలో లక్ష మంది పాల్గొననున్నారు. 37 కేంద్ర ప్రభుత్వ విభాగాలు,17 రాష్ట్ర ప్రభుత్వాలు,20 పరిశ్రమలు పంపిన పలు సమస్యలకు తుది రౌండ్‌లో విద్యార్థులు పరిష్కార మార్గాలను సూచించనున్నారు.

English summary
Prime Minister Narendra Modi addressed the grand finale of Smart India Hackathon on Saturday via video conferencing and also interact with students on the occasion, according to an official statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X