• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రధాని మోదీ సడన్ సర్‌ప్రైజ్ -చాలా ఆనందించారు కదా -సీబీఎస్ఈ పరీక్షల రద్దుపై విద్యార్థులతో ముచ్చట

|

అప్పుడప్పుడూ రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి సందేశమిస్తూ ప్రధాని మోదీ సర్ ప్రైజ్ ఇవ్వడం తెలసిందే. ప్రతిసారి సామాన్యులకు మల్లే ఈసారి ఆశ్చర్యపోవడం విద్యార్థుల వంతైంది. వెబినార్ స్క్రీన్ పై సడెన్ గా ప్రత్యక్షమైన ప్రధాని మోదీ.. సీబీఎస్ఈ విద్యార్థులను ఉద్దేశించి ''నా నిర్ణయంతో మీరంతా చాలా ఆనందించారు కదా..'' అంటూ సందడి చేశారు.

వైఎస్సార్ పిల్లలకు ఆ రాత లేదేమో-షర్మిల పేరు లేకుండా తెలంగాణలో కొత్త పార్టీ- YSRTPపై ఈసీ కీలక ప్రకటనవైఎస్సార్ పిల్లలకు ఆ రాత లేదేమో-షర్మిల పేరు లేకుండా తెలంగాణలో కొత్త పార్టీ- YSRTPపై ఈసీ కీలక ప్రకటన

గతంలో ఎన్నడూ లేని విధంగా సీబీఎస్ఈ పరీక్షల తేదీలపై ప్రధానమంత్రి స్థాయిలో జోక్యం చేసుకోవడం, పరీక్షల నిర్వహణపై స్వయంగా మోదీనే ఉన్నత స్థాయి రివ్యూ నిర్వహించడం, అంతకు ముందు కేంద్రమే తీసుకున్న(పరీక్షల్ని నిర్వహిస్తామనే) నిర్ణయాన్ని వీటో చేస్తూ, కరోనా కారణంగా పరీక్షలు మొత్తాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రధామంత్రే ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపర్చింది. అదే అంశంపై ప్రధాని మరోసారి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్ని సర్ ప్రైజ్ చేశారు..

 PM Modi Surprise CBSE Students, Parents by Online Interaction, says You Seem Overjoyed

స్కూళ్లలో, కాలేజీల్లో 'టీం స్పిరిట్' గురించి బోధించేవారని, కరోనా సమయంలో దీనిని స్పష్టంగా చూశామని, మహమ్మారిని ఎదుర్కొంటామని అందరూ ధీమాగా ఉన్నారని ప్రధని మోదీ వ్యాఖ్యానించారు. సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో కేంద్ర విద్యా శాఖ గురువారం సాయంత్రం విద్యార్థులు, తల్లిదండ్రులతో వెబినార్ నిర్వహించింది. ఈ వెబినార్‌కు ప్రధాని మోదీ హఠాత్తుగా హాజరయ్యారు.. నిజానికి

రఘురామ ఇష్యూలో ట్విస్ట్: పార్లమెంట్‌కు ఏపీ సీఐడీ ఉదంతం -షాకైన ఎంపీలు -జగన్‌ను హిట్లర్‌తో పోల్చుతూరఘురామ ఇష్యూలో ట్విస్ట్: పార్లమెంట్‌కు ఏపీ సీఐడీ ఉదంతం -షాకైన ఎంపీలు -జగన్‌ను హిట్లర్‌తో పోల్చుతూ

  New IT Rules : Facebook తగ్గినా WhatsApp Court Plea | Indian Government || Oneindia Telugu

  విద్యార్థులతో ఆన్ లైన్ ఇంటరాక్షన్ కార్యక్రమం ప్రధాని షెడ్యూల్ లో లేకపోయినా, స్పేస్ తీసుకుని మరీ ఆయన పిల్లల్ని పలకరించారు. విద్యార్థులందరూ దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారన్న నమ్మకంతో ఉన్నానని, ఎప్పుడూ భవిష్యత్ గురించి ఆలోచించాలని మోదీ హితవు పలికారు. జూన్ 1 వ తేదీ వరకూ పరీక్షల గురించి ఆలోచించేవారని మోదీ అనగా, ఓ విద్యార్థిని స్పందిస్తూ.. ''సార్... మీరు పరీక్షలను ఓ పండగలా భావించాలని గతంలో చెప్పారు. అందుకే మాకు పరీక్షలంటే భయమే లేదు'' అని బదులిచ్చింది. విద్యార్థులతో ప్రధాని ఇంటరాక్షన్ ఆద్యాంతం సందడిగా సాగింది.

  English summary
  Prime Minister Narendra Modi conducted a surprise interactive session with students as he joined a virtual meeting with students of a CBSE-affiliated school. He also interacted with student’s parents and addressed issues related to the class 12 board exam cancellation. He asked students if they are happy with the board examination cancellation considering the pandemic situation adding that they should never be tensed about exams. He also asked the students how they will be spending time since the exams have been canceled. “India’s youth is positive as well as practical," he said.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X