వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోహ్లీ ఫిట్నెస్ ఛాలెంజ్‌కి మోడీ యోగా రిప్లై(వీడియో): ప్రధానికి కుమారస్వామి కౌంటర్

|
Google Oneindia TeluguNews

Recommended Video

కోహ్లీ ఫిట్నెస్ ఛాలెంజ్‌కి మోడీ యోగా రిప్లై(వీడియో): ప్రధానికి కుమారస్వామి కౌంటర్

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఇచ్చిన ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రధాని నరేంద్ర మోడీ ఓ ఫిట్‌నెస్‌ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఉదయం వేళ యోగా చేస్తూ.. ప్రకృతిలో ఉండే పంచతత్వాలతో తాను ప్రేరణ పొందానని మోడీ వ్యాఖ్యానించారు.

రోజూ ఇలా చేయడం ద్వారా రీఫ్రెష్‌గా, ఉత్సాహంగా ఉంటుందని, శ్వాసకు సంబంధించి ప్రాణాయామం చేస్తానంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. మనం ఫిట్‌గా ఉంటేనే ఇండియా ఫిట్‌గా ఉంటుందన్నారు.

PM Modi takes up Virat Kohlis fitness challenge; nominates HD Kumaraswamy, Indian police force

కాగా, కర్ణాటక ముఖ్యమంత్రి, జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామికి ప్రధాని మోడీ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ విసిరారు. 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌లో పతకాలు సాధించిన మానికా బాత్రాతో పాటు 40 ఏళ్లకు పైగా వయసున్న ఐపీఎస్‌ అధికారులను 'హమ్‌ ఫిట్‌‌తో ఇండియా ఫిట్‌' ఛాలెంజ్‌కు ఆహ్వానించారు. ఇటీవల కోహ్లీ విసిరిన ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రధాని మోదీ.. తాజాగా తన ఫిట్‌నెస్‌ ప్రాక్టీస్‌ను పోస్ట్‌ చేశారు.

ఇటీవల కేంద్ర క్రీడలశాఖా మంత్రి రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ ప్రారంభించారు. 'హమ్‌ ఫిట్‌ తో ఇండియా ఫిట్‌'లో భాగంగా పుష్‌ అప్స్‌ చేస్తున్న వీడియోను ఫిట్‌నెస్‌ మంత్ర పేరుతో ట్విట్టర్‌లో ఆయన పోస్ట్‌ చేస్తూ విరాట్‌ కోహ్లీ, హృతిక్‌ రోషన్‌, సైనా నెహ్వాల్‌ను ట్యాగ్‌ చేశారు. అయితే దీనిపై స్పందిస్తూ విరాట్‌ తాను చేస్తున్న ఎక్సర్‌సైజ్‌ వీడియోను పోస్ట్‌ చేశాడు. అంతేకాకుండా తన భార్య అనుష్క శర్మ, ప్రధాని నరేంద్ర మోడీ, మహేంద్ర సింగ్‌ ధోనిలు ఈ ఛాలెంజ్‌ స్వీకరించాలంటూ ట్యాగ్‌ చేశాడు.

మోడీ ఛాలెంజ్‌కు కుమారస్వామి కౌంటర్

ఇది ఇలా ఉండగా, ప్రధాని నరేంద్ర మోడీ ఫిట్నెస్ ఛాలెంజ్‌కు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. తాను చాలా ఫిట్‌గా ఉన్నానని తెలిపారు. తాను రోజూ యోగా, ట్రెడ్ మిల్ చేస్తానంటూ చెప్పుకొచ్చారు. అయితే, తమ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించే తన ఆందోళన అని పేర్కొన్నారు. తమ రాష్ట్రానికి మీ సాయం కోరుతున్నట్లు ప్రధానికి సోషల్ మీడియాతో ద్వారా విన్నవించారు.

English summary
After a long wait, Prime Minister Narendra Modi on Wednesday finally posted a fitness challenge. He was challenged by India cricket captain Virat Kohli after the latter shared a video of him strengthening his core muscles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X