వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళలపైనా మమత వేధింపులు -బీజేపీతోనే ‘బంగారు బంగ్లా’ -కోల్‌కతా మెగా ర్యాలీలో ప్రధాని మోదీ

|
Google Oneindia TeluguNews

మార్పు తెస్తానంటూ గద్దెనెక్కిన మమతా బెనర్జీ బెంగాలీల విశ్వాసాన్ని వమ్ము చేశారని, ఆమె చేతిలో మోసపోయిన జనం ఇప్పుడు బీజేపీని ఆదరిస్తున్నారని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుతం టీఎంసీ, లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలు ఒకవైపు ఉంటే, బెంగాల్ ప్రజలంతా మరోవైపు నిలబడి ఉన్నారని పేర్కొన్నారు.

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మోదీ తొలిసారి రాష్ట్రంలో ప్రచారానికి ఆదివారం వచ్చారు. కోల్ కతా నగరంలోని ప్రఖ్యాత బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, బంగారు బంగ్లా నిర్మాణం బీజేపీతో సాధ్యమని అన్నారు..

రౌడీలకే రౌడీని, బట్టలిప్పడం ఖాయం -విజయవాడలో చంద్రబాబు నిప్పులు -పెద్దిరెడ్డి, కొడాలి నానికి వార్నింగ్రౌడీలకే రౌడీని, బట్టలిప్పడం ఖాయం -విజయవాడలో చంద్రబాబు నిప్పులు -పెద్దిరెడ్డి, కొడాలి నానికి వార్నింగ్

PM Modi Targets Mamata Banerjee At Kolkata Rally, Promises Sonar Bangla

బెంగాల్ ప్రజలు మార్పు కోరుతూ మమతా బెనర్జీని నమ్మారని, ఆమె మాత్రం విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని, తనపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని మమత వమ్ముచేశారని, ఇది బెంగాల్ ప్రజలను అవమానించడమేనని మోదీ అన్నారు. మమత పాలన అరాచకంగా సాగిందని, సోదరీమణులు, ఆడకూతుళ్లను కూడా వేధింపులకు గురిచేశారని, అయితే బెంగాలీలు నిరాశలో కూరుకుపోకుండా, ఆశావహ దృక్పథంతో బీజేపీ వైపు నిలబడ్డారని మోదీ తెలిపారు.

<strong>బీజేపీలోకి మెగాస్టార్ మిథున్ చక్రవర్తి -ప్రధాని మోదీ తొలి సభలోనే సంచలనం -బెంగాల్ సీఎం అభ్యర్థి?</strong>బీజేపీలోకి మెగాస్టార్ మిథున్ చక్రవర్తి -ప్రధాని మోదీ తొలి సభలోనే సంచలనం -బెంగాల్ సీఎం అభ్యర్థి?

PM Modi Targets Mamata Banerjee At Kolkata Rally, Promises Sonar Bangla

'బంగారు బంగ్లా' కలలు సాకారం చేసేందుకే తాను కోల్ కతా వచ్చానని, బెంగాల్ అభివృద్ధికి, పెట్టుబడులు పెరిగేందుకు, బెంగాల్ సంస్కృతి పరిరక్షణకు, మార్పు తీసుకువచ్చేందుకు తాను భరోసా ఇస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. వందేమాతరం నినాదంతో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ రాబోయే ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలో ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయ్యారని అన్నారు.

PM Modi Targets Mamata Banerjee At Kolkata Rally, Promises Sonar Bangla

తన సుదీర్ఘ ప్రస్థానంలో ఇంత పెద్ద స్థాయిలో ప్రజలు తనను ఆదరించడం తానెన్నడూ చూడలేదని కోల్ కతా జనాంగాన్ని ఉద్దేశించి ప్రధాని వ్యాఖ్యానించారు. మార్పు కోరుకుంటున్న బెంగాల్ ప్రజలు ఎప్పుడూ తమ ఆశలు వదులుకోలేదని, కోల్‌కతా, బెంగాల్ భారతదేశానికి స్ఫూర్తి కేంద్రాలని ప్రశంసించారు. ఎందరో దేశభక్తులను బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ చూసిందని అన్నారు. మొత్తం 294 అసెంబ్లీ సీట్లున్న బెంగాల్ లో ఎనిమిది విడతలుగా ఎన్నికలు జరుగనున్నాయి. ఈనెల 27న తొలి దశ పోలింగ్‌తో మొదలై ఏప్రిల్ 29తో ముగుస్తాయి. మే 2న ఓట్లు లెక్కించి ఫలితాలు వెలువడుతాయి.

English summary
Prime Minister flagged off his West Bengal Assembly poll campaign officially today by lashing out against Chief Minister Mamata Banerjee and promising a "Sonar Bangla" (Golden Bengal) if the BJP is voted to power. He attacked the state government for allegedly letting down the people who had placed much expectation in it. "Bengal trusted Didi for Pariborton. She broke the trust," he said today at a massive Kolkata rally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X