వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాణిజ్య, విదేశీ పెట్టుబడులే లక్ష్యం: ఇండియా గ్లోబల్ వీక్‌ సదస్సులో రేపు ప్రధాని మోడీ ప్రసంగం..

|
Google Oneindia TeluguNews

భారతదేశ వర్తక, విదేశీ పెట్టుబడులే ప్రధాన అంశంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించబోతున్నారు. ఇండియా గ్లోబల్ వీక్ 2020 గురించి గురువారం ఆన్‌లైన్‌లో ప్రసంగిస్తారు. దీనిని బ్రిటన్ నిర్వహిస్తోంది. కరోనా వైరస్ విస్తరిస్తోన్న నేపథ్యంలో దేశం అందిస్తోన్నరాయితీలు, పెట్టుబడులు పెట్టే వారికి అవకాశాల గురించి ప్రస్తావిస్తారు.

 PM Modi to address global audience at India Global Week 2020

సమావేశాలు మూడురోజులు జరగుతున్నాయి. ప్రధాని మోడీతోపాటు కేంద్రమంత్రులు జై శంకర్, పీయూష్ గోయల్, హర్దీప్ సింగ్ పురీ, రవిశంకర్ ప్రసాద్, మహేంద్ర నాథ్ పాండే తదితరులు కూడా ప్రసంగిస్తారు. బ్రిటన్ నుంచి ప్రిన్స్ చార్లెస్ ప్రత్యేక ప్రసంగం చేస్తారు. తర్వాత విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్, హోంశాఖ కార్యదర్శి ప్రీతి పటేల్, ఆరోగ్యశాఖ కార్యదర్శి మాట్ హంకాక్ ఇతరులు మాట్లాడతారు. భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలు.. బ్రెగ్జిట్ తర్వాత మెరుగైన సంబంధాల గురించి చర్చకొచ్చే అవకాశం ఉంది.

హలీవుడ్ నటుడు కునాల్ నాయర్, ఇషా ఫౌండేషన్ ఫౌండర్ సద్దురు, జర్నలిస్ట్ బర్ఖా దత్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ కూడా పాల్గొని.. ప్రసంగిస్తారు. శిఖరాగ్ర సమావేశంలో 250 మంది వ్యాపారవేత్తలు సహా ఇతర రంగాల ప్రముఖులు కూడా పాల్గొంటారు.

English summary
Prime Minister Narendra Modi will make a major worldwide address, expected to focus on India's trade and foreign investment prospects, at India Global Week 2020 organised in the UK from Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X