• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
LIVE

Coronavirus:మార్చి 22న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ

|

న్యూఢిల్లి: ప్రపంచాన్ని కరోనావైరస్ కుదిపేస్తోందని ఆ మహమ్మారి నుంచి దేశ పౌరులు జాగ్రత్తతతో వ్యవహరించాలని ప్రధాని మోడీ అన్నారు. కరోనావైరస్ గురించి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడారు. స్వీయ నిర్బంధం, సోషల్ డిస్టెన్సింగ్ లాంటి జాగ్రత్తలు పాటిస్తే మనకు మనం సహాయం చేసుకున్నవారమే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా కాపాడిన వాళ్లమవుతామని ప్రధాని మోడీ అన్నారు. మార్చి 22 ఆదివారం రోజున ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఆ సమయంలో అందరూ ఇళ్లకే పరిమితం కావాలని అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని మోడీ సూచించారు. అదే సమయంలో సాయంత్రం 5 గంటల తర్వాత ప్రజలంతా తమ ఇళ్లల్లోని బాల్కానీ లేదా ఇంట్లోనే ఉండి కరోనావైరస్ నుంచి పౌరులకు సేవలు అందిస్తున్న సిబ్బంది కోసం సెల్యూట్ లేదా చప్పట్లు కొట్టి వారికి ధన్యవాదాలు తెలపాలని కోరారు. కష్ట సమయంలో దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలందిస్తున్న వారిని ఈ సందర్భంగా ప్రధాని మోడీ అభినందించారు. ఇక ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మినిట్ టూ మినిట్ అప్‌డేట్స్ మీకోసం.

  PM Modi Telugu Speech On Coronavirus | 'Janata Curfew' Why Only One Day ? | Oneindia Telugu

  PM Modi to address the nation on Coronavirus pandemic, here are the live updates

  Newest First Oldest First
  8:30 PM, 19 Mar
  కలిసి కట్టుగా పనిచేసి దేశంను కాపాడుకుందాం : ప్రధాని మోడీ
  8:28 PM, 19 Mar
  ప్రతి ఒక్కరు తమ సొంత పద్ధతిలో కరోనావైరస్ మహమ్మారిపై పోరాటం చేస్తున్నారు: ప్రధాని మోడీ
  8:27 PM, 19 Mar
  గత రెండు నెలలుగా దేశ పౌరులు సమాజహితం కోసం ఎంతో పనిచేశారు. ఇందుగురించి గర్వంగా ఉంది: ప్రధాని మోడీ
  8:26 PM, 19 Mar
  నిత్యావసరవస్తువులు కొనుగోలు చేసేందుకు భయపడొద్దు: ప్రధాని మోడీ
  8:25 PM, 19 Mar
  ఈ కష్టసమయంలో వ్యాపారస్తులు గానీ ఆయా సంస్థలు కానీ ఉద్యోగస్తులకు వేతనాల్లో కోత విధించరాదు: ప్రధాని మోడీ
  8:24 PM, 19 Mar
  భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని దేశపౌరులు నిర్ణయం తీసుకోవాలి: ప్రధాని మోడీ
  8:23 PM, 19 Mar
  రొటీన్ చెక్‌ అప్ కోసం హాస్పిటల్‌కు వెళ్లడం మానేయండి: ప్రధాని మోడీ
  8:21 PM, 19 Mar
  మార్చి 22న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ
  8:20 PM, 19 Mar
  దేశం వారందరికీ రుణపడి ఉంది. మార్చి 22న వారందరికీ కృతజ్ఞతలు తెలుపుదాం. ఆరోజు సాయంత్రం 5 గంటలకు ఇంటి బయట నిలబడి వారందరికీ సెల్యూట్ చేద్దాం, చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలుపుదాం
  8:19 PM, 19 Mar
  అందరికోసం సేవ చేశారు వారందరిని అభినందిస్తున్నా: ప్రధాని మోడీ
  8:18 PM, 19 Mar
  వారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఇతర పౌరుల కోసం పనిచేశారు: ప్రధాని మోడీ
  8:18 PM, 19 Mar
  గత రెండు నెలలుగా రాత్రింబవళ్లు చాలా మంది కరోనావైరస్ అంశంపై పనిచేస్తున్నారు: ప్రధాని మోడీ
  8:17 PM, 19 Mar
  జనతా కర్ఫ్యూ రోజున భారత ప్రజలకు ఒక పరీక్షలా భావిద్దాం: ప్రధాని మోడీ
  8:16 PM, 19 Mar
  మార్చి 22న జనతా కర్ఫ్యూ గురించి ప్రజల్లో అవగాహన తీసుకొద్దాం: ప్రధాని మోడీ
  8:16 PM, 19 Mar
  మార్చి 22న జనతా కర్ఫ్యూను పాటిద్దాం. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఈ మేరకు విజ్ఞప్తి చేస్తాను: ప్రధాని మోడీ
  8:15 PM, 19 Mar
  మార్చి 22 రోజున ఎవరూ బయటకు రాకూడదు.అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు: ప్రధాని మోడీ
  8:13 PM, 19 Mar
  తప్పదనుకుంటేనే ప్రయాణించండి: ప్రధాని మోడీ
  8:12 PM, 19 Mar
  60 ఏళ్ల పైబడిన వ్యక్తులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు: ప్రధాని మోడీ
  8:12 PM, 19 Mar
  దేశపౌరుల సహకారంతోనే ఈ మహమ్మారిపై పోరాటంలో విజయం సాధించగలం: ప్రధాని మోడీ
  8:11 PM, 19 Mar
  జనసమ్మర్దత ఉన్న ప్రాంతాలకు వెళ్లకండి: ప్రధాని మోడీ
  8:10 PM, 19 Mar
  కరోనావైరస్‌ను ఎదుర్కోవాలంటే ఒక్కటే మార్గం..అదే సోషల్ డిస్టెన్సింగ్: ప్రధాని మోడీ
  8:07 PM, 19 Mar
  ఇప్పటి వరకు కరోనావైరస్‌కు వ్యాక్సిన్ కానీ ఇతర రెమెడీలు కానీ లేవు: ప్రధాని మోడీ
  8:06 PM, 19 Mar
  రెండో ప్రపంచ యుద్ధంలో కూడా ఈ స్థాయిలో ప్రజలు మృతి చెందలేదు: ప్రధాని మోడీ
  8:05 PM, 19 Mar
  పలుదేశాల్లో కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది: ప్రధాని మోడీ
  8:05 PM, 19 Mar
  ప్రతి భారతీయుడు జాగరూతతో వ్యవహరించాలి: ప్రధాని మోడీ
  8:04 PM, 19 Mar
  కోవిడ్ -19 ప్రపంచాన్ని కుదిపేస్తోంది: ప్రధాని మోడీ
  8:03 PM, 19 Mar
  ప్రపంచం ఒక పెద్ద సంక్షోభంను ఎదుర్కొంటోంది: ప్రధాని మోడీ
  8:02 PM, 19 Mar
  ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ ఒక విపత్తులా తయారైంది: ప్రధాని మోడీ
  8:02 PM, 19 Mar
  దేశ ప్రజలను ఉద్దేశించి కరోనావైరస్ పై మాట్లాడుతున్న ప్రధాని మోడీ
  7:03 PM, 19 Mar
  ముందస్తు జాగ్రత్త చర్యలతో కరోనావైరస్‌ను నివారించొచ్చు: ప్రధాని మోడీ
  READ MORE

  English summary
  Prime Minister Narendra Modi will come on live today who will speak on the Coronavirus pandemic.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more