వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపు ఉదయం 10 గంటలకు: లాక్ డౌన్ పై కీలక నిర్ణయం ప్రకటించనున్న ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటానికి కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ రేపటితో ముగియనుంది. ఈ నేపధ్యంలో లాక్ డౌన్ కొనసాగిస్తారా ? లేదా అన్న ఉత్కంఠ దేశ ప్రజల్లో కొనసాగుతుంది. ఇక ఈ నేపధ్యంలోనే 21 రోజుల లాక్ డౌన్ రేపు పూర్తి అవుతున్న సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడనున్నారు. లాక్ డౌన్ కొనసాగింపుపై మాత్రమే కాకుండా కొన్ని కీలక నిర్ణయాలను ఆయన రేపు వెల్లడించే అవకాశం ఉంది . ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు .

ఇటీవల జరిగిన ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. మెజార్టీ ముఖ్యమంత్రులు మరో రెండు వారాలపాటు లాక్ డౌన్ ను పొడిగించాలని కోరారు. మెజార్టీ సీఎం లు మాత్రం మరో రెండు వారాలపాటు లాక్ డౌన్ ను పొడిగిస్తే కరోనా వైరస్ వ్యాప్తి మరింత కంట్రోల్ లోకి వస్తుందని లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ప్రధాని మోడీకి ముఖ్యమంత్రులు సూచించారు.

PM Modi to announce key decision on lockdown tomorrow at 10AM

ఇక ఏపీ సీఎం జగన్ తో సహా అతి కొద్ది మంది లాక్ డౌన్ ను పాక్షికంగా ఎత్తివేసి ప్రభావం ఉన్న ప్రాంతాలకే పరిమితం చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు . లాక్ డౌన్ విషయంపై ప్రధాని మోడీ ఏం నిర్ణయం తీసుకున్నారు . ఏం చెయ్యబోతున్నారు .. రేపు ఏం చెప్తారు అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ . రేపు ఆయన జాతినుద్దేశించి మాట్లాడబోతున్నారు.

లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంటారా ? లేదంటే దేశంలో కరోనా ఎఫెక్ట్ ఉన్న ప్రాంతాలలో లాక్ డౌన్ విధించి మిగతా ప్రాంతాల్లో ఏమైనా సడలిస్తారా అన్నది తెలియాల్సి ఉంది . ఇప్పటికే సామాన్య మధ్యతరగతి ప్రజలు పనుల్లేక, పస్తులుంటున్నన్న పరిస్థితి పై కూడా ఏం చెయ్యాలన్న దానిపై కేంద్ర సర్కార్ ఆలోచనలో ఉంది.

లాక్ డౌన్ విషయంలో కేంద్రం మూడు జోన్లుగా విభజించాలని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కరోనా తీవ్రతను బట్టి లాక్ డౌన్ నిబంధనలు ఉండబోతున్నాయని విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే దేశంలో ప్రజల ప్రాణాలతో పాటుగా, దేశంలోని ఆర్ధిక పరిస్థితిని కూడా కాపాడుకోవాలని ప్రధాని మోడీ భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో రేపటి నిర్ణయంపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.

English summary
Prime Minister Narendra Modi to address nation by tomorrow 10 am on lock down extension. PM Modi recently conducted a video conference with the Chief Ministers of all the states in the wake of the lockdown. The mejority of the CMs requested to modi to extend the lock down . Many chief Ministers have already taken to the Prime Minister's view that the ongoing lockdown for corona need to continue for a few more days upto april 30. but tomorrow modi will say the final decision to the nation .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X